ఘనంగా ప్రారంభమైన నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ #NBK107

ఘనంగా ప్రారంభమైన నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్  #NBK107

ఘనంగా ప్రారంభమైన నందమూరి బాలక‌‌ృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్  #NBK107

నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్‌ గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ సినిమా అంటే ఇంకే రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. మాస్ హీరో మరియు మాస్ డైరెక్టర్ కలిసి పనిచేస్తే మాస్‌ ఆడియన్స్ కు  విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. బాలకృష్ణ కోసం అద్భుతమైన కథను సిద్దం చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు గోపీచంద్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా శ్రుతీ హాసన్‌ నటిస్తోంది.  #NBK107 అంటూ వర్కింగ్ టైటిల్‌‌తో  రూపొందుతోన్న ఈ మూవీ ప్రారంభోత్సవం నేడు హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది.

ముహూర్తపు సన్నివేశానికి  వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా స్క్రిప్ట్‌ను మేకర్లకు అందజేశారు.

నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

సాంకేతిక పరంగా ఈ చిత్రం ఉన్నతంగా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం గోపీచంద్ మలినేని ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. రిషి పంజాబీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాలకృష్ణకు తగ్గట్టుగా పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేయనున్నారు.

ఈ మూవీ  రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది.

నటీనటులు  : నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్

సాంకేతిక బృందం

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ :  గోపీచంద్ మలినేని
నిర్మాతలు :  నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్ :  మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం : తమన్ ఎస్
డీఓపీ  : రిషి పంజాబీ
ఎడిటర్  : నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్  : ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్  : సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్ రామ్ లక్ష్మణ్
సీఈవో :  చెర్రీ
కో డైరెక్టర్ :  కుర్రా రంగరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :  చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్ :  బాల సుబ్రహ్మణ్యం కేవీవీ
పబ్లిసిటీ :  బాబా సాయి కుమార్
మార్కెటింగ్ :  ఫస్ట్ షో
పీఆర్వో : వంశీ-శేఖర్

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 Launched Grandly

One of the all-time greatest entertainers and an irreplaceable demigod of masses- Natasimha Nandamuri Balakrishna will be joining forces with successful director Gopichand Malineni who is an expert in dealing pucca mass and commercial entertainers. The film in the combination of the mass hero and the mass director is going to provide a full meal treat for masses. The director readied a powerful script for Balakrishna and the story is based on true incidents. Of course, Gopichand Malineni makes sure to include elements for all other sections which is why he has been delivering back-to-back blockbusters.

Billed to be a pucca mass and commercial film, Tollywood’s leading production house Mythri Movie Makers will be bankrolling the project prestigiously. Shruti Haasan plays heroine opposite Balakrishna in the movie. Tentatively titled #NBK107, the film has been launched in a grand manner with a pooja ceremony today in Hyderabad.

VV Vinayak sounded clapboard for the muhurtham shot, while Boyapati Srinu switched on the camera. Harish Shankar directed the first shot, while script was handed over to the team by Koratala Siva, Bobby and Buchi Babu Sana.

Naveen Yerneni and Y Ravi Shankar will be producing the film on massive scale.

Gopichand Malineni’s films are technically high in standard. And, he is taking extra care for #NBK107, in terms of artists and technicians to associate for the project.

S Thaman renders soundtracks, while Rishi Punjabi will handle the cinematography. Acclaimed writer Sai Madhav Burra provides dialogues, while National Award-Winning Craftsman Navin Nooli takes care of editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film that will have fights by Ram-Lakshman duo.

Regular shoot of the movie will begin from January, 2022.

Cast: Nandamuri Balakrishna, Shruti Haasan

Technical Crew:
Story, Screenplay & Direction: Gopichand Malineni
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music Director: Thaman S
DOP: Rishi Punjabi
Editor: Navin Nooli
Production Designer: AS Prakash
Dialogues: Sai Madhav Burra
Fights: Ram-Lakshman
CEO: Chiranjeevi (Cherry)
Co-Director: Kurra Ranga Rao
Executive Producer: Chandu Ravipati
Line Producer: Bala Subramanyam KVV
Publicity: Baba Sai Kumar
Marketing: First Show
PRO: Vamsi-Shekar