‘నా.. నీ ప్రేమ‌క‌థ’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన త‌న్నీరు హ‌రీష్ రావు

‘నా.. నీ ప్రేమ‌క‌థ’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన త‌న్నీరు హ‌రీష్ రావు

‘నా.. నీ ప్రేమ‌క‌థ’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన త‌న్నీరు హ‌రీష్ రావు

నివాస్, కారుణ్య హీరో హీరోయిన్లుగా, అముద శ్రీ‌నివాస్ ద‌ర్శక‌త్వంలో పి.ఎస్‌. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై పోత్నక్ శ్రవ‌ణ్ కుమార్ నిర్మిస్తోన్న చిత్రం ‘నా.. నీ ప్రేమ‌క‌థ’‌. ఈ ఫిల్మ్ ఫ‌స్ట్ లుక్‌ను తెలంగాణ ఆర్థిక మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.

హ‌రీష్ రావు మాట్లాడుతూ, “ఇది ఒక చ‌క్క‌ని ప్రేమ‌క‌థా చిత్రం. గుండెల‌కు హ‌త్తుకొనేలా ద‌ర్శ‌కుడు అముద శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని చ‌క్క‌గా రూపొందించారు. నేటి కాలంలో జ‌రుగుతున్న య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా శ్ర‌వ‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు” అని అన్నారు.

నిర్మాత శ్ర‌వ‌ణ్ కుమార్ మాట్లాడుతూ, “ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం రీ రికార్డింగ్ ప‌నులు జ‌రుపుతున్నాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రేక్ష‌కుల్ని అల‌రించే అన్ని అంశాలూ ఈ మూవీలో ఉన్నాయి. త్వ‌ర‌లో అన్ని ప‌నులూ పూర్తిచేసి రిలీజ్‌కు సిద్ధం చేస్తాం” అన్నారు.

తారాగ‌ణం:
నివాస్‌, కారుణ్య‌, అజ‌య్ ఘోష్‌, ఫిష్ వెంక‌ట్‌, ష‌ఫీ, బ‌స్‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మాధ‌వి.

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: అముద శ్రీ‌నివాస్‌
నిర్మాత‌:  పోత్నక్ శ్ర‌వ‌ణ్ కుమార్‌
బ్యాన‌ర్‌:  పి.ఎస్‌. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
స‌హ నిర్మాత‌:  జి. విజ‌య్‌కుమార్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎం.ఎస్‌. కిర‌ణ్‌
ఎడిటింగ్‌: న‌ంద‌మూరి హ‌రి
బ్యాగ్రౌండ్ స్కోర్‌:  చిన్నా
మ్యూజిక్‌: ఎం.ఎల్‌.పి. రాజు
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.