15 కిలోలు బ‌రువు త‌గ్గిన మంచు మ‌నోజ్‌..మ‌రో రెండు ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్న‌ల్.

15 కిలోలు బ‌రువు త‌గ్గిన మంచు మ‌నోజ్‌..మ‌రో రెండు ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్న‌ల్.

15 కిలోలు బ‌రువు త‌గ్గిన మంచు మ‌నోజ్‌..మ‌రో రెండు ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్న‌ల్

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోని బహుముఖ ప్రతిభావంతులలో ఒకరైన మంచు మనోజ్ కొంతకాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అయితే త‌న రీ ఎంట్రీకి ఈ మ‌హ‌మ్మారి స‌మ‌యాన్ని పూర్తిగా ఉపయోగించుకుని రెండు విష‌యాల‌పై దృష్టి సారించారు. ఒక‌టి బ‌రువు త‌గ్గ‌డం మ‌రోక‌టి త‌ను సంత‌కం చేసిన రెండు ప్రాజెక్ట్స్ ప్రీ- ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ చూసుకోవ‌డం.

మంచు మ‌నోజ్ ఏకంగా 15 కిలోలు తగ్గి స్మార్ట్ లుక్‌లోకి మారాడు. ఆయుర్వేదిక్ డైట్, కఠినమైన వ్యాయామం చేసి మనోజ్ స్లిమ్‌గా మారాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. అందరికీ వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మనోజ్ హార్డ్ వర్క్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించి మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి తెలుగు దర్శకుడితో తెలుగు / తమిళ చిత్రం, రెండోది తమిళ దర్శకుడి నుండి తెలుగు, తమిళ ద్విభాష చిత్రం. ఈ రెండు చిత్రాల‌ను 2021లో విడుద‌ల‌చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మంచు మ‌నోజ్‌. వీటితో పాటు స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సిటీ కూడా డెవ‌ల‌ప్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే దాని గురించి వివ‌రించ‌నున్నాడు.
2021 మంచు మ‌నోజ్‌కు కొత్త ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్ రాక్ స్టార్.

Manchu Manoj Cuts Down 15Kgs, Signs Two Films

Manchu Manoj, one of those versatile talents in TFI has been off the radar for a while. He seems to be the one to have best made use of pandemic times to announce a strong come back.

Manoj diverted his attention on two aspects. One is to cut down the extra adipose and second is to oversee the pre production works of two projects signed.

Manoj is learnt to have cut down nearly 15 kgs of weight slimming down for a superb new look, as one can find in above pic. Following a strict Ayurvedic diet and heavy physical workouts and kept him busy all through the covid period.

In parallel, Manoj is eyeing on two releases for 2021. One is a Telugu/Tamil film with a Telugu director and the other is a Telugu, Tamil bi lingual from a Tamil director. Inspite of this it’s been heard that Manoj Manchu is working on One of a kind Sports and Entertainment City which is going to be talked about.

With 2021 hoped to bring new happiness all over, Manoj too is oozing with new energy and bottle neck confidence. All the best Rock Star.