Major First Look poster

Major First Look poster

అడివిశేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ధైర్య సాహసాలు ప్రతిబింబించేలా `మేజర్` ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించిన చిత్ర యూనిట్‌.

క్ష‌ణం, గూఢచారి, ఎవ‌రు వంటి  సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో  త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివిశేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నిస్వార్థప‌రుడు, ధైర్యవంతుడు మరియు మ‌నంద‌రికీ ఎంతో ఇష్ట‌మైన‌ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా అడివిశేష్‌ను ప్రదర్శిస్తూ ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు `మేజర్` ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌ర్నీని ప్రేక్ష‌కుల‌కుకి అందించ‌డ‌మే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం. అతడు వీర మ‌ర‌ణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తోంది చిత్ర యూనిట్‌.

27/11న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వ‌ర్ధంతి సందర్భంగా  హీరో అడివి శేష్ ‌లుక్ టెస్ట్ పోస్ట‌ర్‌‌తో పాటు, అమరవీరుల జ్ఞాపకాలకు నివాళులు అర్పిస్తూ సినిమా తీసే ప్రయాణాన్ని గురించి‌ వెల్లడించిన వీడియోను రిలీజ్ చేసిన‌ విష‌యం తెలిసిందే..

మేజర్ టీమ్ ఆగష్టులో కోవిడ్ సమయాల్లో షూటింగ్ తిరిగి ప్రారంభించి అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఇప్పటి వరకు 70% షూట్ పూర్తి చేసింది.

పాన్ ఇండియా మూవీగా  తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న‌ ఈ మూవీకి  శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా  తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల,  బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న మేజర్ చిత్రాన్ని 2021 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

 
Capturing the fierce bravery of Major Sandeep Unnikrishnan, team Major unveils the First Look poster

Presenting Adivi Sesh as the young, selfless, brave and much-loved Major Sandeep Unnikrishnan, the makers of Major revealed the first poster of the film.

Major traces the journey of the late army officer Sandeep Unnikrishnan who sacrificed his life for the nation in the 26/11 Mumbai attacks. The intention of this film is to celebrate the life of Major Sandeep. The film depicts scenes that capture the spirit of the way he lived, not just the way he died.

On the death anniversary of Major Sandeep Unnikrishnan on 27/11, the makers unveiled the look test image of Adivi Sesh along with a video where the actor revealed his journey of making the film, paying a tribute to the memories of the martyr.

Major has resumed shoot in August during covid times, shot the film with extreme care and caution, and have finished 70% of the shoot till date.

Directed by Sashi Kiran Tikka, a pan India bilingual film, shot in Hindi and Telugu, Major also stars Sobhita Dhulipala, Saiee Manjrekar, Prakash Raj, Revathi, Murali Sharma in leading roles.

Produced by Sony Pictures Films India in association with Mahesh Babu’s GMB Entertainment and A+S Movies, Major is slated to release in summer 2021.