ఇదే నా బెస్ట్ హాలిడే

కారోనా కార‌ణంగా ఈ ఏడాది అంద‌రికీ క‌ష్టంగానే గ‌డిచింది. లాక్‌డౌన్ వ‌ల్ల సినీమా షూటింగ్‌ల‌కు లాంగ్ గ్యాప్ వ‌చ్చింది. దీంతో మ‌న గురించి మ‌నం ఆలోచించుకునే అవ‌కాశం దొరికింద‌ని ర‌కుల్ అన్నారు. గ‌తంలో షూటింగ్ ల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల మా అమ్మానాన్న‌ల‌తో ఎక్కువ రోజులు గ‌డ‌ప‌టం కుద‌ర‌లేదు. అలాగే నా కెరీర్‌లో ఇంత లాంగ్ గ్యాప్ కూడా రాలేదు. నేను నా ఫ్యామిలీతో క‌లిసి టూర్‌కు వెళ్లి దాదాపు 10 సంవ‌త్స‌రాల‌కు పైనే అయి ఉంటుంది. కాబ‌ట్టి ఈ షూటింగ్ గ్యాప్‌లో మాల్దీవులు వెళ్లాం. ఇది నా బెస్ట్ హాలిడే అని ర‌కుల్ ప్రీత్ అన్నారు.హీరోయిన్ ర‌కుల్ ఈ మ‌ధ్య మాల్దీవుల‌లో గ‌డిపిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి.