KT Kunjumon’s Gentleman2 As A Pan India Film In Telugu, Tamil, Hindi, Malayalam and Kannada Languages

KT Kunjumon’s Gentleman2 As A Pan India Film In Telugu, Tamil, Hindi, Malayalam and Kannada Languages

 

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో  ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా కేటి కుంజుమోన్ జెంటిల్ మేన్ 2 

 కథా బలం ఉన్న చిత్రాలను బిగ్ స్కేల్ లో నిర్మించి భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన డేరింగ్ నిర్మాత కేటి కుంజుమోన్ నిర్మాతగా మాస్టర్ డైరెక్ట‌ర్ శంకర్‌ దర్శకత్వం వ‌హించిన మొద‌టి సినిమా జెంటిల్ మేన్.  తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా హీరో  అర్జున్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.  విద్యావ్యవస్థలోని లోపాలపై పోరాడే ఓ యువకుడి కథతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం నమోదు చేయడమే కాక విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను కూడా అందుకున్నది.  అప్ప‌టికే శ‌ర‌త్‌కుమార్ హీరోగా వ‌సంత‌కాల ప‌ర‌వై, సూరీయ‌న్ వంటి బిగ్ బ‌డ్జెట్ మూవీస్ నిర్మించిన మెగా ప్రొడ్యూస‌ర్ కేటి కుంజుమోన్ 1993 లో శంకర్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ యాక్ష‌న్ కింగ్ అర్జున్ హీరోగా జెంటిల్‌మేన్ చిత్రాన్ని నిర్మించారు. సంగీత ద‌ర్శ‌కుడు ఏ ఆర్ రెహమాన్ స్వ‌ర‌ప‌రిచిన ఈ మూవీలోని అన్ని పాట‌లు ఇన్ స్టెంట్ హిట్ గా నిలిచి దేశ న‌లుమూల‌ల‌కి వినిపించాయి. ఒక చిన్న ప్రేమకథ ను భారీ స్థాయిలో నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు కుంజుమోన్.కే టి కుంజుమోన్ ప్రభుదేవా ను హీరో గా పరిచయం చేస్తూ నిర్మించిన కాదలన్ / ప్రేమికుడు సంచలన విజయం సాధించింది. తెలుగు స్టార్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జునతో కే టి కుంజుమోన్ తమిళ, తెలుగు భాషల్లో మాసివ్ బడ్జెట్ మూవీ రక్షకుడు నిర్మించి సంచలనం సృష్టించారు. ఈ చిత్రం ద్వారా మిస్ యూనివర్స్ సుస్మిత సేన్ ను వెండితెర కు పరిచయం చేశారు. ఎంతో మందిని పరిచయం చేయడమే కాకుండా తన చిత్రాల ద్వారా ఎంతో మంది నటీ నటులు, సాంకేతిక నిపుణులకు బ్రేక్ ను ఇచ్చారు కే టి కుంజుమోన్. మలయాళం స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ లతో కూడా కుంజుమోన్ చిత్రాలు నిర్మించారు. సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ల ఎన్నో చిత్రాలతో పాటు కొన్ని వందల చిత్రాలను తమిళ నాడు, కేరళ, మహారాష్ట్ర లలో డిస్ట్రిబ్యూట్ చేశారు. తను నిర్మించే చిత్రాలనే కాకుండా డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాలకు కూడా భారీ స్థాయిలో పబ్లిసిటీ చేసి తన ప్రత్యేకతను చాటుకునేవారు కే టి కుంజుమోన్.

తన నిర్మాణంలో అపూర్వ విజ‌యాన్ని సాధించిన జెంటిల్ మేన్ కు పార్ట్ 2 గా, మొదటి భాగానికి రెండింతలు ఉండేలా జెంటిల్ మేన్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు నిర్మాత కేటి కుంజుమోన్. ఈ సంద‌ర్భంగా

భారీ చిత్రాల ప్రొడ్యూస‌ర్ కేటి కుంజుమోన్ మాట్లాడుతూ – “ జెంటిల్‌మేన్ మూవీ తమిళ‌, తెలుగు భాష‌ల‌లో విడుద‌లై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో  దేశాల్లో అనువాదించ‌బ‌డి అన్ని దేశాల ప్రేక్ష‌కుల‌నుండి మంచి రెస్పాన్స్ రాబ‌ట్టుకుంది. అయితే మ‌రోసారి అంద‌రి అంచ‌నాల‌ను అందుకునేలా  రెండింత‌లు గొప్ప‌ద‌నంలో జెంటిల్‌మేన్ 2 తెర‌కెక్కిస్తున్నాం.  అత్యాదునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో హాలీవుడ్ చిత్రాల‌కు ధీటుగా లేటెస్ట్ ప్రొడక్షన్ టెక్నిక్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. “ అన్నారు.

ఈ చిత్రాన్ని త‌మిళ‌, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ  ఐదు భాష‌ల‌లో జెంటిల్‌మేన్ ఫిలిం ఇంట‌ర్‌నేష‌న‌ల్ సంస్థ‌ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా  నిర్మిస్తుంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్రకటించనున్నారు.

 
 

KT Kunjumon’s Gentleman2 As A Pan India Film In Telugu, Tamil, Hindi, Malayalam and Kannada Languages

In the two types of cinemas- Story telling cinema; K T Kunjumon showed in them daring way to the production of Mega cinema, with strong story. Continuing with the block buster movies, ‘Vasanthakala Paravai’ and ‘Surieyan’… in 1993 mega budgeted movie the ‘Gentleman’  was produced, introducing  Shankar as Director..Now known as a Mega Movies Director.It was a turning point for the action King Arjuna. A R Rahman’s all the songs of ‘Gentleman’ became instant hit in all the nook and corner of the country.  By spending many more times the business budget K T Kunjumon created a niche for A R Rahman’s songs.

K T  Kunjumon created a mega movie the’ Kadhal Desam’ out of a small love story.  K T Kunjumon introduced Prabhudeva as a Hero through another block buster movie ‘ Kadhalan’ also brought King Nagarjuna Akkineni to Tamil Film industry through his massive budgeted movie Ratchakan, and introduced Miss universe Susmitha Sen to silver screen. He not only  introduced but gave big breaks to many more Actors and Technicians through his movies.

Now returning to entertain the movie fans with ‘Gentleman2’ which with twice greater than ‘Gentleman’. He announced that through ‘Gentleman2,  I am resuming movie production works; moreover he said:
‘Gentleman’  became a mega hit in Tamil, Telugu and in other languages. This movie released all over the world in many languages got overwhelming reception from the worldwide audience. Twice the greatness of ‘Gentleman’ can be seen in  ‘Gentleman2’ will challenge the best of Hollywood movies with most updated movie production techniques. ‘Gentleman2’ will be produced by Gentleman film International as a part two of ‘Gentleman’;

It  will be produced in five languages as a Pan India Film – Telugu, Tamil, Hindi, Malayalam and Kannada. Discussions are going on with  Actors, Actresses and Technicians. Official announcement about the details of ‘Gentleman2’ will be released soon.

 ‘Gentleman2’ will first release in theatres all over the world. Only afterits theatrical release, it will be released to other media, he announced. He has also produced Malayalam movies with malayalam super stars Mammootty , Mohanlal and many more Malayalam artists. He also has released as a distributor hundreds of movies including that  of Tamil Super stars Rajinikanth, Kamalhaasan, in Tamilnadu, Kerala and Maharashtra . Because, whichever movie released, he used to release with mega budgeted publicity, KT Kunjumon’s releases are always a big celebration for the movie fans.

 
#Gentleman2 begins. Most celebrated #KTKunjumon ‬
‪the Mega Producer announces his next. 2021 will be very Special.‬‪ Produced by #GentlemanFilmInternational ‬‪#జెంటిల్మాన్2

‪#ஜென்டில்மேன்2‬

‪#जेंटलमैन2‬

‪#ജെന്റിൽമാൻ2‬

‪#ಜಂಟಲ್ಮನ್2