`మ‌హాన‌టి` స‌ఖి`గా మెప్పిస్తుందా!! 

 `మ‌హాన‌టి` స‌ఖి`గా మెప్పిస్తుందా!! 
 `మ‌హాన‌టి` స‌ఖి`గా మెప్పిస్తుందా!!   
      
       `మ‌హాన‌టి` చిత్రంతో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని తెచ్చుకుంది కీర్తి సురేష్‌. ఇక ఇటీవ‌ల ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో లేడీ ఓరియెంటెడ్ గా ఓ చిత్రం ప్రారంభ‌మైంది. న‌రేంద్ర అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా ఈస్ట్ కోస్ట్ బేన‌ర్ పై మ‌హేష్ కోనేరు నిర్మాణంలో తెర‌కెక్కుతోంది. ప్ర‌జంట్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఐరోపాలో  జ‌రుగుతోంది. సినిమాకు కీల‌క‌మైన సీన్స్ అక్క‌డ తెర‌కెక్కిస్తున్నారు. మహిళల‌పై ఒక్కో స్టేజ్ లో ఒక్కో త‌ర‌హాలో ఎటాక్స్ జ‌రుగుతుంటాయి. వాటిని ఎన‌లైజ్ చేస్తూ.. వాటిని దాటుకుని ఒక మ‌హిళ త‌న గ‌మ్యాన్ని ఎలా చేరుకుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఒక‌టి సోష‌ల్ మీడియ‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే..మ‌హిళా ప్ర‌ధాన‌మైన సినిమా కావ‌డంతో దీనికి `స‌ఖి` అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలున్నాయ‌ట‌.  మ‌హాన‌టిగా మెప్పించిన కీర్తి సురేష్ స‌ఖిగా ఎంత వ‌ర‌కు ఆక్టుకుంటుందో చూద్దాం.