నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న “కాళికా” చిత్రం విడుదల

నూతన సంవత్సర శుభాకాంక్షలతో  జనవరి 1న “కాళికా” చిత్రం విడుదల

నూతన సంవత్సర శుభాకాంక్షలతో  జనవరి 1న “కాళికా” చిత్రం విడుదల

నట్టి ఎంటర్టైన్మెంట్ సమర్పణలో
క్వీటీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై రాధికా కుమరస్వామి,సౌరవ్ లోకేష్,శరణ్ ఉల్తి, జి. కె. రెడ్డి,సాదు కోకిల,తబ్లా నాని,అంజనా నటీ నటులుగా నవరసన్ దర్శకత్వంలో
కన్నడ లో సూపర్ హిట్ సాధించిన దమయంతి చిత్రాన్ని “కాళికా” పేరుతో నిర్మాతలు నట్టి కరుణ,నట్టి క్రాంతిలు తెలుగులో రీమేక్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1 న విడుదల చేస్తున్నారు.

 ఈ సందర్భంగా నిర్మాతలు నట్టి కరుణ నట్టి క్రాంతిలు మాట్లాడుతూ ..రాధికా కుమారస్వామి హీరోయిన్ గా లీడ్ పాత్రలో కన్నడలో సూపర్ హిట్ అయిన దమయంతి చిత్రాన్ని తెలుగులో “కాళికా” గా రిమేక్ చేసి విడుదల చేస్తున్నాము.ఈ మూవీ ప్రతి ఒక్క ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.ఫ్యామిలీ అందరూ వచ్చి చూడదగ్గ చిత్రమిది.ఈ సినిమాను 18 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన హర్రర్ గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను అడుగడుగున ఉత్కంఠ కలిగిస్తుంది.కన్నడలో ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో.. తెలుగులో కూడా అంతటి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని
అన్నారు.

 బ్యానర్..క్విట్ ఎంటర్ టైన్మెంట్

సాంకేతిక నిపుణులు

ప్రొడ్యూసర్స్… నట్టి కరుణ,నట్టి క్రాంతి

డైరెక్టర్.. నవరసన్

సంగీతం.. ఆర్ ఎస్ గణేష్, నారాయణ

పి.ఆర్.ఓ..మధు వి.ఆర్
 
నటీనటులు
రాధికా కుమారస్వామి
సురవ్ లోకేష్
శరణ్ ఉల్తి
జ.కె. రెడ్డి
సాదు కోకిల
తబ్లా నాని
అంజన