`అఖండ`గా గ‌ర్జించిన న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌!!‌

`అఖండ`గా  గ‌ర్జించిన న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌!!‌

`కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.. `అఖండ`గా  గ‌ర్జించిన న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌. ‌

‘సింహా’, ‘లెజెండ్`వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే.. ఈ సినిమా టైటిల్ కోసం ప్రేక్ష‌కులు, నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు వారు చాలా ప్ర‌త్యేకంగా భావించే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది పండుగ పర్వదినం రోజున గ‌త చిత్రాల్లాగానే బాల‌య్య  సినిమాకు `అఖండ` అనే పవర్ ఫుల్ టైటిల్ ఎనౌన్స్ చేసి ఆడియెన్స్ కు సరికొత్త సర్ ప్రైజ్ ఇచ్చారు మేక‌ర్స్‌. దీంతో పాటు మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

ఈ టీజ‌ర్‌లో ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని సరికొత్త లుక్‌లో బాల‌య్య క‌నిపించ‌డంతో పాటు టైటిల్ కూడా ఆయ‌నకు యాప్ట్ అయ్యేలా ఉండ‌డంతో అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ఇక  ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది… కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది…’  అంటూ హై వోల్టేజ్ తో  బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్  విజిల్స్ వేయించేలా  ఉంది. ముఖ్యంగా త‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది.

మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లోద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం మే28న  ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది.
 
నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌, శ్రీకాంత్‌తో  పాటు భారీతారాగ‌ణం న‌టిస్తున్న‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: త‌మన్‌ ఎస్‌‌‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

 
‘Kaaru Kuthalu Koosthe.. Kapalam Pagilipoddi..’
NataSimha Nandamuri Balakrishna Roaring In His Latest Titled ‘Akhanda’
After Biggest Blockbusters ‘Simha’ and ‘Legend’, NataSimha Nandamuri Balakrishna and Mass Director Boyapati Srinu’s massive blockbuster combination collaborated again to deliver a hat-trick blockbuster. Audience and Fans are eagerly waiting for the title of the film. Makers gave a pleasant surprise to all by announcing the powerful title of this much awaited film as ‘Akhanda’ on the auspicious occasion of Telugu New Year, Ugadi like previous Balakrishna’s films. The film unit has also released  the teaser as ‘Massive Title Roar’.

The teaser showcased Balayya in a never seen before avatar. The brand new powerful look of Balayya and the title which perfectly suits to him together made the Fans ecstatic. Dialogue in the teaser, ‘ Kaalu duvve Nandi Mindy rangu maarchina pandi… Kaaru koothalu Koosthe kapaalam Pagilipoddi..’ uttered by NBK in a high voltage manner is whistle-worthy. Director Boyapati once again showcased Balayya in a Powerful look which will be a feast for fans and audience alike. Thaman’s pulsating Background Music has elevated the teaser to a whole new level. The teaser is trending top in social media and cruising ahead with tremendous response.

‘Akhanda’ is Presented by Miryala Satyanarayana Reddy and Prestigiously Produced by Young Producer Miryala Ravinder Reddy under his Dwaraka Creations banner. The film is progressing it’s shoot in a brisk.oace and is gearing up to roar in theatres from May 28th this year worldwide.

This Natasimha Nandamuri Balakrishna starrer will have Pragya Jaiswal and Srikanth along with a huge cast.

Cinematography: C.Ramprasad, Music: Thaman S, Dialogues: M Rathnam, Art Director: AS Prakash, Editing: Kotagiri Venkateswara Rao, Thammiraju, Fights: Ram – Lakshman, Presented by Miryala Satyanarayana Reddy,
Producer: Miryala Ravinder Reddy,
Direction: Boyapati Srinu.