విష్ణు మంచు ‘మోస‌గాళ్లు’ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌

విష్ణు మంచు ‘మోస‌గాళ్లు’ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌

విష్ణు మంచు హీరోగా న‌టిస్తోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘మోస‌గాళ్లు’ కోసం ప్రేక్ష‌కులు అమితాస‌క్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా మార్చిలో థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌, పోస్ట‌ర్స్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించ‌డ‌మే కాకుండా, సినిమాపై అవి అంచ‌నాల‌ను పెంచేశాయి.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై ‘మోస‌గాళ్లు’ చిత్రాన్ని నిర్మిస్తోన్న విష్ణు మంచు దాన్ని చ‌క్క‌గా ప్ర‌మోట్ చేస్తుకుంటూ వ‌స్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 25న థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు ఓ పోస్ట‌ర్ ద్వారా చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ పోస్ట‌ర్‌లో లైట్ బ్లూ క‌ల‌ర్ ట్రౌజ‌ర్స్, డార్క్ బ్లూ నెక్ టీ ష‌ర్ట్ ధ‌రించి క్లాసిక్ లుక్‌తో ఎలిగెంట్‌గా క‌నిపిస్తున్నారు విష్ణు.

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ‘మోస‌గాళ్లు’ చిత్రంలో విష్ణు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌టం ఓ విశేషం. జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో విష్ణు జోడీగా రుహీ సింగ్ క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి ఓ కీల‌క పాత్ర చేశారు.

శ్యామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, షెల్డ‌న్ చౌ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

తారాగ‌ణం:
విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్ శెట్టి, రుహీ సింగ్, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌

సాంకేతిక బృందం:
మ్యూజిక్‌: శ‌్యామ్ సీఎస్‌
సినిమాటోగ్ర‌ఫీ: షెల్డ‌న్ చౌ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కిర‌ణ్‌కుమార్ ఎం.
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ ఆర్‌.
నిర్మాత‌: విష్ణు మంచు
ద‌ర్శ‌క‌త్వం: జెఫ్రీ గీ చిన్‌
బ్యాన‌ర్‌: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ.

 
Vishnu Manchu’s Mosagallu Theatrical Trailer On February 25th

Tall hunk Vishnu Manchu’s Pan India film Mosagallu is getting ready to grace the theatres in March. In the meantime, promotional activities are in full swing for the film which is undoubtedly one of the highly anticipated films in 2021, given teaser, songs and posters received wonderful response.

Billed to be a high octane action thriller, Mosagallu is a Pan India film to be released in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi languages.

The team has announced to release theatrical trailer of the film on February 25th with a poster where Vishnu looks class and elegant.

Jeffrey Chin is directing, while Vishnu Manchu is producing the film. Kajal Aggarwal will be seen as Vishnu’s sister. Ruhi Singh is the female lead and Suniel Shetty plays a crucial role in his Tollywood debut.

Mosagallu has music by Sam CS, while Sheldon Chau is the cinematographer.

Cast: Vishnu Manchu, Kajal Aggarwal, Suniel Shetty, Ruhi Singh, Naveen Chandra, Navdeep and others.

Crew:
Producer – Vishnu Manchu
Executive Producer- VijayKumar R
Director – Jeffrey Gee Chin
Music- Sam CS
DOP – Sheldon Chau
Production Design – Kiran Kumar M