హ‌ర్ష్ క‌నుమిల్లి, జ్ఞాన సాగ‌ర్ ద్వార‌క‌, వ‌ర్గో పిక్చ‌ర్స్`సెహ‌రి` టీజ‌ర్ విడుద‌ల‌ !!

హ‌ర్ష్ క‌నుమిల్లి, జ్ఞాన సాగ‌ర్ ద్వార‌క‌, వ‌ర్గో పిక్చ‌ర్స్`సెహ‌రి` టీజ‌ర్ విడుద‌ల‌ !!

హ‌ర్ష్ క‌నుమిల్లి, జ్ఞాన సాగ‌ర్ ద్వార‌క‌, వ‌ర్గో పిక్చ‌ర్స్`సెహ‌రి` టీజ‌ర్ విడుద‌ల‌ !!

హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌధ‌రి హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతోన్న`సెహ‌రి` మూవీ టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ ఈ రోజు (ఏప్రిల్ 16) విడుద‌ల‌చేసింది. ఈ బృందం ప్రత్యేకమైన ప్రమోషన్లు మరియు హర్ష్‌ను వర్జిన్ స్టార్ అని పిలిచే  ప్రకటన వీడియో `సెహ‌రి` టీజ‌ర్  మంచి  రెస్పాన్స్ సంపాదించడానికి  ఎంత‌గానో ఉపయోగ‌ప‌డింది. వ్యూహాత్మకంగానే వారు బాలకృష్ట‌గారి ప్రసంగాన్నిసెహారీ టీజర్‌లో చేర్చ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.

బాలకృష్ణగారు గ‌తంలో హర్ష్ కనుమిల్లిని వర్జిన్ స్టార్ అని పేర్కొన్న విష‌యం తెలిసిందే.. అందుకే ఈ చిత్ర  బృందం కూడా  అదే ట్యాగ్ లైన్ ద్వారా అతన్ని పిలవాలని నిర్ణయించుకుంది. “మేము బాలకృష్ణ గారి ప్రసంగాన్నిసెహారీ టీజర్‌లో చేర్చాము. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు మేము కృత‌జ్ఞత‌లు తెలుపుతున్నాము”  అని మేకర్స్ ప్ర‌క‌టించారు.

తన ప్రియురాలితో క‌లిసి ఆనందకరమైన జీవితాన్నిగడిపే వరుణ్ పాత్రలో హర్ష్ కనుమిల్లి క‌నిపించారు. ఒక్క‌సారిగా త‌న‌తో బ్రేక‌ప్ అవ‌డం, దాంతో మ‌రోక‌రితో వివాహానికి సిద్ద‌మ‌వ‌డం మ‌నం ఈ టీజ‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఆ త‌ర్వాత త‌ను వివాహం చేసుకోబోయే అమ్మాయి అక్క సిమ్రాన్ చౌదరితో సన్నిహితంగా ఉండ‌డం ద్వారా త‌న భాగ‌స్వామి ఎంపిక సరైనది కాదని అతను గ్రహించడం టీజ‌ర్లో చూపించారు.

హ‌ర్ష్ క‌నుమిల్లి కామెడి టైమింగ్ ఈ టీజ‌ర్‌కి మేజ‌ర్ హైలెట్ అని చెప్పొచ్చు.

ద‌ర్శ‌కుడు జ్ఞాన సాగ‌ర్  ద్వారక `సెహ‌రి` చిత్రాన్ని యూత్ ఫుల్ రామ్‌- కామ్‌ ఎలిమెంట్స్‌తో ఆహ్లాద‌కరంగా ‌
తెర‌కెక్కించారు. ప్రశాంత్ ఆర్ విహారీ నేపథ్య సంగీతం ఆకర్షణీయంగా ఉంది.

శిల్ప చౌదరి భాగస్వామ్యంతో వ‌ర్గో పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా అద్వ‌య జిష్ణు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది.  

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర పోషించారు.

తారాగ‌ణం:
హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌధ‌రి, అభిన‌వ్ గోమటం, ప్ర‌ణీత్ రెడ్డి, అనీషా అల్ల, అక్షిత హ‌రీష్‌, కోటి, బాల‌కృష్ణ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కత్వం: జ్ఞాన సాగ‌ర్ ద్వారక‌,
నిర్మాత‌లు: అద్వ‌య జిష్ణు రెడ్డి, శిల్పా చౌధ‌రి,
సినిమాటోగ్ర‌ఫి: సురేష్ సారంగం
ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజ‌ల‌
సంగీతం: ప్ర‌శాంత్ ఆర్ విహారి
ఆర్ట్‌: సాహి సురేష్‌.
పిఆర్ఒ: వంశీ- శేఖ‌ర్‌.

 
Harsh Kanumilli, Gangasagar Dwaraka, Virgo Pictures Sehari Teaser Out

Harsh Kanumilli and Simran Choudary starrer new film Sehari teaser has been launched today. The team is opting for unique promotions and the teaser announcement video where Harsh was called virgin star has helped garnering good buzz. Strategically, they included Balakrishna’s speech in Sehari teaser.

It is known that, Balakrishna referred Harsh Kanumilli as virgin star and the team too decided to call him by this tagline. “In vote of thanks, we have included Balakrishna speech in Sehari’s teaser,” said the makers.

Harsh Kanumilli has played the role of Varun who leads a joyful life with his girlfriend, until he breaks up with her. In anger, he takes a senseless decision to enter next phase of life. i.e. entering wedlock.

But he realizes that she is not the right choice after becoming close with Simran Choudary who happens to be his fiancée’s elder sister.

Harsh Kanumilli’s comic timing is one of the major highlights of the teaser.

Gangasagar Dwaraka has made Sehari as a crazy rom-com laced with youthful elements. Prashanth R Vihari’s background score is captivating.

Advaya Jishnu Reddy in partnership with Shilpa Chowdary is producing the production No 1 of Virgo Pictures which is in post-production stages and is gearing up for release soon.

Music director Koti plays a key role in the movie.

Cast: Harsh Kanumilli, Simran Choudary, Abhinav Gomatam, Praneeth Reddy, Anisha Alla, Akshitha Harish, Koti, Balakrishna and others.

Technical Crew:
Director: Gnanasagar Dwaraka
Producer: Advaya Jishnu Reddy, Shilpa Chowdary
D.O.P: Suresh Sarangam
Music Director: Prashanth R Vihari
Editor: Raviteja Girijala
Art Director: Sahi Suresh