వైభవంగా పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 2 ప్రారంభం !!

వైభవంగా పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 2 ప్రారంభం !!

వైభవంగా పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 2 ప్రారంభం !!

పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా తీసిన ‘ఇక్షు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే ఈ బ్యానర్ లో రెండో సినిమాను మొదలెట్టారు. ‘ఇక్షు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వి వి రుషిక దర్శకత్వంలో నిర్మాత హనుమంత్ రావు నాయుడు నిర్మిస్తున్న ప్రొడక్షన్ 2 చిత్రం గురువారం హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ సందర్బంగా చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి  ‘ఎంఎల్ఏ’ ఫేమ్ దర్శకుడు ఉపేంద్ర క్లాప్ ఇవ్వగా, నిర్మాత డి ఎస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా తొలి షాట్ కు చిత్ర దర్శకురాలు రుషిక గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కో ప్రొడ్యూసర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ .. “దసరా నవరాత్రుల సందర్బంగా ఈ రోజు ఈ చిత్రాన్ని పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టడం చాలా అందంగా ఉంది. పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై వస్తున్న రెండో చిత్రమిది. ఇంతకు ముందు మొదటి ప్రయత్నంగా ఇక్షు అనే చిత్రాన్ని నిర్మించాం. అది విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఓ మిడిల్ క్లాస్ జీవితాలలో జరిగే కథ. ముఖ్యంగా తండ్రి, కొడుకు నేపథ్యంలో సాగుతుంది. ఇక్షు చిత్రానికి అద్భుతంగా దర్శకత్వం వహించిన రుషిక గారే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా తరువాత ప్రారంభిస్తాం” అన్నారు.

నిర్మాత హనుమంత్ రావు నాయుడు మాట్లాడుతు .. “మా బ్యానర్ లో ఇది రెండో సినిమా. మేము నిర్మించిన మొదటి సినిమా ఇక్షు సినిమాను తెరకెక్కించిన విధానం బాగా నచ్చడంతో అదే దర్శకురాలితో రెండో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది” అన్నారు.

దర్శకురాలు వి.వి. రుషిక మాట్లాడుతూ .. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నా రెండో సినిమా మొదలవ్వడం. తెలుగులో లేడి దర్శకులు చాలా తక్కువ అందులో నేను తీసిన మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే రెండో సినిమాకు ఛాన్స్ రావడం. ఈ సందర్బంగా నిర్మాత హనుమంత్ రావు గారికి థాంక్స్ చెబుతున్నాను. అలాగే సాయి కార్తీక్ కు కూడా. ఈ సినిమాలో ఇంకా నటీనటులను ఫైనల్ చేయలేదు. ఈ వారంలో మిగతా నటీనటులను ఎంపిక చేస్తాము. అలాగే ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్న రామాగ్నివేశ్ చాలా మంచి టాలెంట్ ఉన్న అబ్బాయి. సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ను చాలా అద్భుతంగా చెప్పాడు. ఏ కథ గురించి చెప్పాలంటే పేరెంట్స్, పిల్లల మధ్య జరిగే సన్నివేశాలతో ఉంటుంది. ఈ సినిమా చుస్తే చాలా మందికి కొన్ని సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి. అంతలా ఎమోషన్, కామెడీ, ఫ్యామిలీ, అన్ని అంశాలు ఉన్న సినిమా ఇది.  అలాగే ఈ సినిమాకు సపోర్ట్ అందిస్తున్నారు కార్తీక్ అలాగే టీం అందరికి థాంక్స్ అన్నారు.

హీరో రామ్ అగ్నివేశ్ మాట్లాడుతూ .. ఈ బ్యానర్ లో నా రెండో చిత్రమిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్ అన్నారు.

నటీనటులు : రామాగ్నివేశ్ ..
ఈ చిత్రానికి నిర్మాత :  హనుమంత్ రావు నాయుడు,
దర్శకత్వం : వివి రుషిక  
కో ప్రొడ్యూసర్ :  సాయి కార్తీక్.