‘గతం’ దర్శకుడు కిరణ్‌తో రాజశేఖర్ 92వ సినిమా

‘గతం’ దర్శకుడు కిరణ్‌తో రాజశేఖర్ 92వ సినిమా

‘గతం’ దర్శకుడు కిరణ్‌తో రాజశేఖర్ 92వ సినిమా

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ఓ కొత్త సినిమాను శనివారం ప్రకటించారు. ఆయన 92వ చిత్రమిది. ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘గతం’ ఫేమ్ కిరణ్ కొండమడుగుల దర్శకత్వంలో రాజశేఖర్ నటించనున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా. ఆఫ్ బీట్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్, ఎస్ ఒరిజినల్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. ‘గతం’ నిర్మాతలు భార్గవ పోలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎర్రబోలు… రాజశేఖర్ కుమార్తెలు శివాని-శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శనివారం సినిమా థీమ్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్న ‘శేఖర్’ పూర్తయిన తర్వాత ఆగస్టులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు కిరణ్ కొండమడుగుల మాట్లాడుతూ “దర్శకుడిగా నేను తీసిన ‘గతం’ సినిమాను ఆదరించినందుకు కృతజ్ఞతలు. నా తదుపరి సినిమా రాజశేఖర్ గారి చేయబోతున్నా. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. యాంటీ సోషల్ ఎలిమెంట్ సెక్స్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సినిమా జరుగుతుంది. సినిమా అంతా అమెరికాలో చిత్రీకరించేలా ప్లాన్ చేశాం. హీరో క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. రాజశేఖర్ గారికి టైలర్ మేడ్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ప్రేక్షకులందరూ సినిమా చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.

నిర్మాత భార్గవ పోలుదాసు మాట్లాడుతూ “నన్ను ‘గతం’లో అర్జున్ పాత్రలో చూసి ఉంటారు. ఆ సినిమా నిర్మాతల్లో నేను ఒకడ్ని. మా నెక్స్ట్ సినిమాను కిరణ్ దర్శకత్వంలో డాక్టర్ రాజశేఖర్ గారితో చేస్తున్నాం. కిరణ్ రాసిన కథ రాజశేఖర్ గారికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాం. చిత్రీకరణ అంతా అమెరికాలో చేస్తాం. ఈ సినిమా ‘గతం’ కన్నా మంచి పేరు తెస్తుందనీ, మీరంతా సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

నిర్మాత హర్ష ప్రతాప్ మాట్లాడుతూ “కిరణ్ దర్శకత్వం వహించిన ‘గతం’ చిత్రనిర్మాతల్లో నేను ఒకడిని. ‘గతం’ తర్వాత మరోసారి కిరణ్ దర్శకత్వంలో, హీరో రాజశేఖర్ గారితో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. స్క్రిప్ట్ ప్రకారం సినిమా అంతా అమెరికాలో జరుగుతుంది. ఆగస్టు నుండి అమెరికాలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రొడక్షన్ వేల్యూస్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీలా తీయాలనేది మా ప్రయత్నం. ప్రేక్షకులకు హాలీవుడ్ మూవీ చూసిన ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది. స్క్రిప్ట్ బాగా వచ్చింది. ‘గతం’ సినిమాను ఆదరించినట్టు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ పార్ట్‌నర్: టికెట్ ఫ్యాక్టరీ, నిర్మాతలు: శివాని-శివాత్మిక, భార్గవ పోలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎర్రబోలు, దర్శకత్వం: కిరణ్ కొండమడుగుల.

‘Gatham’ director Kiran to helm Rajasekhar’s 92nd movie

A new movie of ‘Angry Star’ Rajasekhar was announced on Saturday. This is going to be the versatile actor’s 92nd movie. Kiran Kondamadugula, who got both audience’s acceptance and critical acclaim for his debut movie ‘Gatham’ (2020), is going to direct it. This is the first outing of the actor-director duo. Off Beat Films, S Originals and Pegasus Cine Corp have come together to produce this promising action thriller. Bhargava Poludasu, Harsha Pratap, Srujan Yarabolu and Rajasekhar’s daughters, Shivani and Shivathmika, are producing it. A Theme Poster was released to make the project official. Rajasekhar will start shooting form August, after the completion of his ongoing project, ‘Sekhar’.

Speaking about the project, director Kiran Kondamadugula said, “I thank everyone for making my first movie, ‘Gatham’, a success. I am glad that my next film is going to star Rajasekhar garu. This is an action thriller. Sex trafficking done by anti-social elements is the backdrop. The entire shoot will be done in the US. The hero’s character will be intense. For Rajasekhar garu, it’s a tailor-made character. The audience will surely find it quite thrilling.”

Producer Bhargava Poludasu said, “In ‘Gatham’, I played a character named Arjun. I was one of the producers of the movie. Coming to Rajasekhar garu’s movie, it is a perfect fit for the Angry Star’s image. I am very excited about producing it. I am hoping that this film will be a bigger success than ‘Gatham’.”

Producer Harsha Pratap said, “I too was one of the producers of ‘Gatham’. I have teamed up with Kiran once again. As demanded by the script, the entire filming of RS92 will take place in America. We are planning to start the shoot sometime in August. We will make this action thriller without compromising on the quality of production values. The audience will get the experience of watching a Hollywood movie. The script has shaped up so well.”

PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media); Digital Partner: Ticket Factory; Producers: Shivani-Shivathmika, Bhargava Poludasu, Harsha Pratap, Srujan Yarabolu; Director: Kiran Kondamadugula.

Here’s #RS92ThemePoster🔥

After #Shekar, @ActorRajasekhar garu teams up with the makers of the super hit film #Gatham for #RS92.

Banners: @off_beat_films @SOriginals1 @PegasusCineC

🎬: @kkondamadugula

@Rshivani_1 @ShivathmikaR @bpoldaz @nooble451 @HarshaPratap