‘మెరిసే మెరిసే’ టీజర్‌ చాలా బావుంది: డైరెక్టర్‌ శివ నిర్వాణ

‘మెరిసే మెరిసే’ టీజర్‌ చాలా బావుంది:  డైరెక్టర్‌ శివ నిర్వాణ

మెరిసే మెరిసే’ టీజర్‌ చాలా బావుంది:  డైరెక్టర్‌ శివ నిర్వాణ
 
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా శ్వేతా అవస్తి హీరోయిన్‌గా  కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె.దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న చిత్రం ‘మెరిసే మెరిసే’. లవ్,కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది. శనివారం ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ యంగ్‌ డైరెక్టర్‌ శివ నిర్వాణ విడుదల చేశారు. ఈ సందర్భంగా…
శివ నిర్వాణ మాట్లాడుతూ “‘మెరిసే మెరిసే’ టీజర్‌ చూశాను. చక్కటి విజువల్స్‌తో చాలా కూల్‌గా ఉంది. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో హీరో దినేష్‌ తేజ్‌, హీరోయిన్‌ శ్వేతా అవస్తి తమదైన మార్కుని క్రియేట్‌ చేసుకున్నారు. డైరెక్టర్‌ పవన్‌ కుమార్‌ తొలి చిత్రమే అయినా సినిమాను చక్కగా తెరకెక్కించాడని టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. కచ్చితంగా ‘మెరిసే మెరిసే’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను” అన్నారు. 
కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకు సూపర్స్‌ రెస్పాన్స్‌ వచ్చింది. పెళ్లిచూపులు ఫేమ్ నగేశ్ బానెల్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందించారు. పాటలు, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. 
 
నటీనటులు:
దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు
 
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత: వెంకటేష్ కొత్తూరి
ర‌చ‌న‌, దర్శకత్వం: పవన్ కుమార్. కె
కెమెరామెన్:  నగేష్ బన్నెల్
సంగీతం: కార్తిక్ కొడగండ్ల
సినిమాటోగ్ర‌ఫీ: న‌గేశ్ బానెల్‌
ఎడిట‌ర్‌:  మ‌హేశ్‌
 
 
I Really Loved The Teaser Of “Merise Merise”: Shiva Nirvana
 
“Husharu” fame Dinesh Tej and Shweta Avasthi starrer upcoming film “Merise Merise” is directed by Pawan Kumar K and bankrolled by Venkatesh Kothuri under KOTHURI Entertainments LLP.
 
Billed to be a Rom-Com with feel good emotions, the film has completed post-production works as well. The slice of life drama is gearing up for release. 
 
Karthik Kodakandla has scored music for the film and the two songs released so far by the team became chartbusters. First look poster and songs indeed increased curiosity on the project.
 
Successful director Shiva Nirvana has launched the teaser of the film. And the event has been attended by the core team.
 
While speaking on the occasion, Shiva Nirvana said, “I really loved the teaser of Merise Merise. It looks refreshing with some breezy visuals. Both hero Dinesh Teja and heroine Shweta Avasthi came up with wonderful performance. Though it is first film for director Pawan Kumar, he made the film appealingly. I wish the entire team all the very best.”
 
Pelli Choopulu fame Nagesh Banell has cranked the camera for the flick that has music by Karthik Kodakandla.
 
Cast: Dinesh Tej, Shweta Awasthi, Sanjay Swaroop, Guru Raj, Bindu, Sandhya Janak, Mani, Shashank, Nanaji
 
Technical Crew:
Banner: Kothuri Entertainments
Producer: Venkatesh Kothuri
Written & Directed by Pawan Kumar K
Cinematography: Nagesh Banell
Music: Karthik Kodakandla