ఓ గ్రూప్ నెగిటివ్ గా ప‌బ్లిసిటీ చేస్తుందిః విశ్వ‌క్ సేన్

ఓ గ్రూప్ నెగిటివ్ గా ప‌బ్లిసిటీ చేస్తుందిః విశ్వ‌క్ సేన్

ఓ గ్రూప్ నెగిటివ్ గా ప‌బ్లిసిటీ చేస్తుందిః విశ్వ‌క్ సేన్

 ఇటీవ‌ల విడుద‌లైన `ఫ‌ల‌క్ నుమా దాస్ ` హీరో విశ్వ‌క్ సేన్ విజ‌య‌దేవ‌ర‌కొండ‌ను  టార్గెట్ చేస్తూ ఏదో అన్నాడంటూ దుమారం రేగిన విష‌యం తెలిసిందే. త‌న ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పెట్టిన ఓ వీడియోలో , విజ‌య‌వాడ‌లో పెట్టిన ప్రెస్ మీట్ లో విశ్వ‌క్ సేన్ విజ‌య దేవ‌ర‌కొండ అభిమానుల‌ను , రివ్యూ రైట‌ర్స్ ను విమ‌ర్శించాడ‌ని వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ రోజు హైద‌రాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు విశ్వ‌క్ సేన్.  

“ మీడియా ముందు నేను నోరు అదుపులో పెట్టుకునే మాట్లాడ‌తాను. నాకు  ఇన్ స్టాగ్రామ్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓ పోస్ట్ పెడితే … పెట్టిన న‌ల‌భై సెక‌న్స్ లో అస‌లు ఎవ‌డిని అన్నాడు? అనే డైలాగ్ క్రియేట్ అయ్యింది. ఎవ‌ర్ని అన్నాన‌నే బ్లాంక్స్ ను కొంత మంది నిన్ను అన్నాడు, కాదు నిన్ను అన్నాడంటూ ప‌బ్లిసిటీ చేసారు. ఇది క‌రెక్ట్ కాదు.  ఏ రివ్యూ రైట‌ర‌న్ ని కానీ, మీడియా వారిని కానీ, ఏ హీరోను కానీ అన‌లేదు. కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని సినిమాపై నెగిటివ్ గా ప్ర‌చారం చేస్తున్నారు.   ఐదు కోట్లు ఖ‌ర్చు పెట్టి దాదాపు 80 మందిని కొత్త‌వాళ్ల‌ను పెట్టి రెండేళ్లు క‌ష్ట‌ప‌డి సినిమా తీస్తే ఓ గ్రూప్ అదే ప‌నిగా సినిమా పై బ్యాడ్ గా ప్ర‌చారం చేస్తోంది.  ఎంతో ఖ‌ర్చు పెట్టి వేసిన పోస్ట‌ర్స్ కూడా చించేసారు. ఎవ‌రినో ఏదో అనేసి ప‌బ్లిసిటీ తెచ్చుకునే చీప్ మెంటాలిటీ నాకు లేదు అంటూ చెప్పుకొచ్చాడు విశ్వ‌క్ సేన్.