Evaru pre release press Meet

Evaru pre release press Meet

Evaru pre release press Meet

తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుందని నిరూపించే సినిమాల్లో `ఎవరు` సినిమా నిలుస్తుంది – నిర్మాత పి.వి.పి

 
అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న థ్రిల్లర్ `ఎవరు`. వెంక‌ట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. ఆగస్ట్ 15న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో… 
హీరో అడివిశేష్ మాట్లాడుతూ – “గత మూడురోజులుగా ఎనిమిదిన్నర గంటలు మాత్రమే పడుకొని ఉంటాను. అంతగా కష్టపడ్డాను. సినిమా చాలా సార్లు చూశాను. బాగా ఎంజాయ్ చేశాను. నిన్న రాత్రి నేను, వెన్నెలకిషోర్ మరికొంత మంది మిత్రులు కలిసి సినిమాను చూశాం. వెన్నెలకిషోర్ సినిమా చూసిన తర్వాత హగ్ చేసుకున్న విధానం చూసి నాలో కాన్ఫిడెంట్ మరింత పెరిగింది. వెంటనే పివిపిగారికి ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దని అన్నాను. `సినిమా రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ అవసరం.. అలా చేస్తే ఓ బ్యాంగ్ ఉంటుంద`ని ఆయన చెప్పారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ప్రీమియర్ వేద్దాం అని అన్నాను. అదే మా సినిమా గురించి ఫీలవుతున్నాం. సినిమా ప్రీమియర్స్ అపేశారు. ఎందుకంటే.. సినిమా బాగోలేకపోతే.. సినిమా బ్యాడ్ టాక్ బయటకు వెళ్లిపోతుంది.. అది సినిమాను కిల్ చేసేస్తుందని భయపడ్డారు. మనం ఏ సినిమాను చూపించాలనుకుంటున్నామో దాన్నే దాచిపెట్టుకుంటున్నాం. ఈ సినిమాను ఇండస్ట్రీకి సంబంధం లేని ఓ 1000 మందికి చూపించాం. మాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ నుండి సినిమాను బెటర్ చేస్తూ వచ్చాం. ఓ సందర్భంలో ఇక మేం మాట్లాడటానికి ఏమీ లేకుండా.. వాళ్లే వచ్చి పలానా అంశం బావుందని, నచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. క్షణం సినిమా చేస్తున్నప్పుడు మా ఆఫీస్ బాయ్ ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. `ఆ ఏముందిలే ఏదో చిన్న సినిమా` అని అంటున్నాడు. ఇప్పుడు మా `ఎవరు` సినిమాను ఆ ఆఫీస్ బాయ్‌కి డేడికేట్ చేస్తున్నాను. ఆ అబ్బాయిని తప్పు అని ప్రూవ్ చేయడానికి నేను ప్రతిసారి నేను కష్టపడుతూనే ఉన్నాను. నేను 2.0 అప్‌గ్రేడ్ వెర్షన్ అనుకుని క్షణం, అమీతుమీ, గూఢచారి సినిమాలు చేశాను. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది“ అన్నారు. 
శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ – “`క్షణం` నుండి నా జర్నీ శేష్, పి.వి.పి బ్యానర్‌తో స్టార్ట్ అయ్యింది. చాలా బెస్ట్ పెర్ఫామెన్సెస్, ట్విస్టులతో సినిమా మా నా దగ్గరకు వచ్చింది. నాకు ఛాలెంజింగ్ మూవీ ఇది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల కంటే ఇదే టఫ్ మూవీ. రామ్ జీ, శేష్ చాలా ట్విస్టులతో వచ్చారు. రెజీనా, నవీన్ కిల్లింగ్ పెర్ఫామెన్సెస్. ఈ ప్రాజెక్ట్‌లో పార్ట్ కావడం ఆనందంగా ఉంది“ అన్నారు. 
నవీన్ చంద్ర మాట్లాడుతూ – “పాజిటివ్ వైబ్స్‌తో ఉన్నాం. అందరూ ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. పి.వి.పిగారికి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియడం లేదు. నేను యాక్టర్ కాకముందు నుండి ఓ డ్యాన్స్ టీచర్‌గా.. కొన్ని స్కూల్స్‌కు డ్యాన్స్ నేర్పించేవాడిని. రామ్ జీ చాలా కూల్ పర్సన్. నా క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. వంశీతో ఆల్ రెడీ ఓ సినిమా చేశాను. ట్రైలర్, టీజర్ చూసి అందరూ మాట్లాడుతున్నారు. శ్రీచరణ్ మ్యాజిక్ చేసి సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు“ అన్నారు. 
రెజీనా కసండ్ర మాట్లాడుతూ – “పి.వి.పిగారు కాల్ చేసి `ఓ స్టోరీ ఉంది మీరు వినండి` అని చెప్పారు. రామ్‌జీ, శేష్ వచ్చి కథ చెప్పారు. నాకు నచ్చింది. గ్రేట్ టీమ్ కుదిరింది. నా సామ్ లుక్‌నే కాదు.. పాత్రను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు“ అన్నారు. 
పి.వి.పి మాట్లాడుతూ “ఈ జర్నీ స్టార్ట్ చేసి రెండేళ్లు అవుతుంది. శేష్, నేను ఇంట్లో డిస్కస్ చేశాను. రామ్‌జీ మా బ్యానర్‌లో అంత ముందే `సైజ్ జీరో`కు వర్క్ చేశాడు. ఈ టీమ్‌లో ఉన్న అందరికీ మాకు మేం ప్రూవ్ చేసుకోవాలనే ఆకలి, తపన ఉంది. ఈ మూవీ గురించి నేను మాట్లాడటం కంటే ప్రేక్షకులు చూసి మాట్లాడాలి. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుంది. తెలుగు సినిమా నేషనల్ వైడ్ సెన్సేషనల్ అయ్యింది. జెర్సీ, బ్రోచెవారెవరురా, ఆత్రేయ.. ఇలా చాలా మంచి సినిమాలు రూపొందాయి. అలాగే మంచి సినిమాల జాబితాలో `ఎవరు` కూడా భాగమవుతుందని అనుకుంటున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. నమ్మకంగా ఉన్నాం“ అన్నారు. 
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.