దర్శకుడు పులి వాసు ఇంట‌ర్వ్యూ !!

దర్శకుడు పులి వాసు ఇంట‌ర్వ్యూ !!

 

సంక్రాంతి రోజున కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా ‘సూపర్ మచ్చి –  దర్శకుడు పులి వాసు

కల్యాణ్ దేవ్ హీరోగా, రచిత రామ్ హీరోయిన్‌గా ‘సూపర్ మచ్చి’ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రిజ్వాన్ నిర్మించారు. ఈ సినిమాతో పులి వాసు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా..

దర్శకుడు పులి వాసు మాట్లాడుతూ.. ‘ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించిన సినిమా సంక్రాంతి రావడం గొప్ప విషయం. నేను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం సూపర్ మచ్చి సంక్రాంతికి విడుదలవుతుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా అందరినీ మెప్పిస్తుంది. ఎవ్వరినీ నిరాశపర్చదు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదొక ఎమోషనల్ డ్రామా, ఫీల్ గుడ్ మూవీ. సంక్రాంతి రోజున కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా. రాజు పాత్రలో కళ్యాణ్ దేవ్ నటించారు. ప్రేమించే ప్రతీ అమ్మాయి ఇటువంటి గొప్ప ప్రేమికుడు కావాలని అనుకుంటారు. అంత గొప్ప ప్రేమికుడి పాత్రను పోషించారు. కన్నడ‌లో రచితా రామ్ స్టార్. ఇప్పుడు తెలుగులో నటిస్తున్నారు. ప్రతీ తల్లిదండ్రులు ఇలాంటి అమ్మాయి ఉండాలని కోరుకుంటారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఎంతో నమ్మకంగా చెబుతున్నాను. మంచి సినిమా నిలుస్తుందని ఆశిస్తున్నాను. పెద్ద సినిమాలున్నా కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామంటే ఈ సినిమా మీద మాకున్న నమ్మకమే కారణం. అందరి గురించి సక్సెస్ మీట్‌లో మాట్లాడాతాను. ఈ సినిమాకు ఇద్దరు మూలస్థంభాలుగా నిలిచారు. రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు నరేష్ సినిమాను నడిపించారు. తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గారు అద్భుతంగా నటించారు. ఒకరు ఫస్టాఫ్‌లో ఎంటర్టైన్ చేస్తారు. సెకండాఫ్‌లో ఇంకొకరు ఎంటర్టైన్ చేస్తారు. ఈ సినిమాకు నలుగురు హీరోలు. కళ్యాణ్ దేవ్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, రచితా రామ్‌లు కలిసి సినిమాను అద్బుతంగా పండించారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నాను. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని అన్నారు.