”డియర్ మేఘ” ఫస్ట్ లుక్ రిలీజ్

”డియర్ మేఘ” ఫస్ట్ లుక్ రిలీజ్

”డియర్ మేఘ” ఫస్ట్ లుక్ రిలీజ్
మేఘా ఆకాష్,అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ”డియర్ మేఘ”. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ ,సోరింగ్ ఎలిఫెంట్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి . అర్జున్ దాస్యన్ నిర్మాత.యంగ్ ఫిల్మ్ మేకర్ సుశాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా ”డియర్ మేఘ” సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఎ సుశాంత్ రెడ్డి. ”డియర్ మేఘ” ఫస్ట్ లుక్ ను ఈ రోజు ( గురువారం, ఫిబ్రవరి 4 తేదీన) ఉదయం 9.01 నిమిషాలకు రిలీజ్ చేశారు. హీరో రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా తన సోషల్ మీడియా లో ఈ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. హీరోలు రానా, విజయ్ సేతుపతి, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ”డియర్ మేఘ” చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలియజేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే….. మేఘ ఆకాష్ ఉద్వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఒక కంటిలో నుంచి కన్నీరు రావడం కనిపిస్తోంది. సినిమాలో మేఘా ఆకాష్ పాత్ర కీలకంగా ఉన్నట్లు, కథను నడిపే డ్రైవింగ్ ఫోర్స్ గా ఆమె ఫర్మార్మెన్స్ ఉంటుందని అనుకోవచ్చు. ఆమె కన్నీటికి కారణం ఎవరు, ఈ ఉద్వేగ పరిస్థితి ఎందుకొచ్చింది అనేది “డియర్ మేఘ” సినిమాలో తెలియనుంది.

“డియర్ మేఘ” సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ – పీఎస్ వర్మ, పీఆర్వో – జీఎస్కే మీడియా.
రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

 
 
“Dear Megha” First Look is out

Actress Megha Akash will be next seen in ‘Dear Megha’ and we have the first look and motion poster unveiled.

Tollywood hunk Rana Daggubati & Ace director Gautham Menon unveiled the first look and Makkal Selvan Vijay Sethupathi took his social media handles to release Motion poster of the film on Thursday.

Based on friendship, this is a light-heartened emotional drama and Megha is seen having moist eyes and in deep sorrow in the first look.

Sushanth Reddy is directing ‘Dear Megha’ and Hari Gowra is composing music.

Arun Adith and Arjun Somayajula are part of the male lead cast.

The film is produced by Arjun Dasyan on Vedaansh Creative Works & Soaring Elephant films banners.Currently post production works are going on. Film will release soon