chikati Gadilo Chitakkottudu success meet

chikati Gadilo Chitakkottudu success meet

`చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు` స‌క్సెస్ మీట్

బ్లూ ఘోస్ట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఆదిత్ , నిక్కితంబోలి , హేమంత్ , తాగుబోతు ర‌మేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం `చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు`. సంతోష్ పి.జ‌య‌కుమార్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా మార్చి 21న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం జ‌రిగిన స‌క్సెస్ మీట్లో …

ద‌ర్శ‌కుడు సంతోష్ పి.జ‌య‌కుమార్ మాట్లాడుతూ – “సినిమా విడుద‌లై రెండు రోజులవుతుంది. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. చిన్న బ‌డ్జెట్ లో చేసిన ఈ సినిమా ప్ర‌జ‌ల‌కు రీచ్ అయ్యేలా చేసిన మీడియాకు ఈ సంద‌ర్భంగా థాంక్స్ . సినిమా 2.5 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింద‌ని తెలిసి ఆనంద‌ప‌డుతున్నాం. థియేట‌ర్ లో సినిమా చూసేవాళ్లు విప‌రీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ డైరెక్ట‌ర్ గా ఆనందంగా ఉంది. స‌పోర్ట్ చేసిన ఎంటైర్ యూనిట్ కు థాంక్స్. సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ “అన్నారు.

హీరోయిన్ నిక్కీ తంబోలి మాట్లాడుతూ – “ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌హా ఎంటైర్ యూనిట్ కు థాంక్స్. సినిమా చాలా గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది. అంద‌రికీ థాంక్స్ “అన్నారు

హీరో ఆదిత్‌ అరుణ్ మాట్లాడుతూ – “ఈ సినిమా రిలీజ్ అయ్యేట‌ప్పుడు చాలా మంది చాలా మాట్లాడారు. ఇలాంటి సినిమాలు అవ‌స‌ర‌మా ? అని అన్నారు. సినిమా చూడ‌కుండానే చాలా ర‌కాలుగా మాట్లాడారు. అలాంటి వారంద‌రికీ మా సినిమా మంచి జ‌వాబు చెప్పింది. మా సినిమాను చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్ష‌కుడికి థాంక్స్ . బి, సి సినిమా , మ‌ల్టీ ప్లెక్స్ లో వ‌ర్క్ అవుట్ కాద‌ని అన్నారు. నా నిర్మాత , ద‌ర్శ‌కుడికి థాంక్స్. ఆనందంతో మాటలు రావ‌డం లేదు. ష్యూర్ షాట్ గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని చెప్పాను. నా మాట నిల‌బెట్టిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ “ అన్నారు.