Arjun Suravaram release on 1 May

Arjun Suravaram release on 1 May

మే 1న `అర్జున్ సుర‌వ‌రం`

యువ క‌థానాయ‌కుడ నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్‌, ఆరా సినిమా ప్రై.లి. ప‌తాకాల‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల‌, కావ్య వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. మే 1న న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా శనివారం జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో…

హీరో నిఖిల్ మాట్లాడుతూ -“నా తొలి సినిమా హ్యాపీడేస్ నుండి అర్జున్ సుర‌వ‌రం వ‌ర‌కు మీడియా న‌న్ను ఎంత‌గానో స‌పోర్ట్ చేసింది. `అర్జున్ సుర‌వ‌రం` నా 16వ సినిమా. నా స‌క్సెస్ కు కార‌ణ‌మైన మీడియా వాళ్ల‌పై సినిమా చేయ‌డం రెస్పాన్సిబుల్ గా ఫీల‌య్యాను. జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. టాప్ రిపోర్ట‌ర్ కావాల‌నుకునే యువ‌కుడిగా క‌న‌ప‌డ‌తాను. ఈ సినిమా చేయ‌డానికి ముందు కాస్త భ‌య‌ప‌డ్డాను. క‌త్తి మీద సాములాంటి సినిమా. చాలా డేలికేట్ పాయింట్ తో తెర‌కెక్కింది. మీడియాలోని చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చూపించాం. నా కెరీర్ లో చాలా బాధ్య‌త‌గా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని చేసిన సినిమా. ఓ ప్ర‌భుత్వం నిల‌బ‌డాల‌న్నా, కూలిపోవాల‌న్నా, యుద్దం మొద‌లు కావాల‌న్నా, ఆగిపోవాల‌న్నా, మీడియానే కీ రోల్ పోషిస్తుంది. ప‌వ‌ర్ ఫుల్ మీడియాను రెప్ర‌జెంట్ చేయ‌డం గ‌ర్వంగా ఉంది. `అర్జున్ సుర‌వ‌రం` సినిమా మే1న విడుద‌ల అవుతుంది. మా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామ‌ని అడుగుతున్నారు. పోస్ట‌పోన్ ఉంది. పోస్ట్ పోన్ అయిన ప్ర‌తిసారి స‌క్సెస్ అవుతూనే వ‌చ్చాను. ఉదాహ‌ర‌ణ‌కు కార్తికేయ సినిమానే. ఏది జ‌రిగినా మ‌న మంచికే అన‌కుంటున్నాం. కంటెంట్ బావుంటే సినిమాను ఆదరిస్తార‌ని న‌మ్ముతున్నాం. మా నిర్మాత‌లు ఠాగూర్ మ‌ధుగారు, రాజ్ కుమార్ గారు మేకింగ్ లో ఎంత‌గానే స‌పోర్ట్ చేశారు. ఎంత ఖ‌ర్చు అయినా ఓవ‌ర్ బ‌డ్జెట్ అయినా సినిమా బాగా రావాల‌ని నిర్మాత‌లు నిల‌బ‌డి సినిమాను పూర్తి చేశారు. ప్ర‌జ‌లంతా ఎల‌క్ష‌న్స్ మూడ్ లోనే ఉన్నారు. చాలా కాంట్ర‌వ‌ర్సీలు కూడా ఉన్నాయి. వాట‌న్నింటికీ దూరంగా మా సినిమాను మే 1న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌ల , డిస్ట్రిబ్యూట‌ర్స్ నిర్ణ‌యించుకున్నారు. ఏషియ‌న్ సునీల్ గారు పిల్ల‌ర్ లా మా సినిమాకు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఆయ‌న నైజాంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఓవ‌ర్‌సీస్ డిస్ట్రిబ్యూట‌ర్ కూడా లార్జ్‌గా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇంత గ్రాఫిక‌ల్ సినిమాను నా కెరీర్‌లో చేయ‌లేదు. అంతా గ్రాపిక్స్ ఉన్నాయి. సినిమా కంప్లీట్‌గా రెడీ అయ్యింది. 2గంట‌ల 20 నిమిషాల ర‌న్ టైంతో లాక్ అయ్యింది. మే డే నాడు ప్రేక్ష‌కుల‌కు క‌లుస‌కోబోతున్నాం. కుటుంబ‌మంతా క‌లిసి చూసే సినిమా ఇది. ఠాగూర్ సినిమాలో మ‌ధుగారు ఎంత మంచి పాయింట్ అయితే చూపించారో. ఆయ‌న స్ట‌యిల్లో ఆయ‌న బ్యాన‌ర్‌కు త‌గ్గ‌ట్లు కొత్త పాయింట్‌ను బ్యూటీఫుల్‌గా చెప్పాం“ అన్నారు.

నిర్మాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ -“సినిమా అంతా రెడీ అయ్యింది. ప్ర‌జ‌లంద‌రూ ఎల‌క్ష‌న్ మూడ్ లో ఉన్నారు. మీడియాకు రిలేటెడ్ గా ఉన్న సినిమా. సినిమాను మే 1న విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం. అంద‌రి స‌హ‌కారం కోరుకుంటున్నాం “ అన్నారు.

నిఖిల్ సిద్దార్థ్ , లావ‌ణ్య త్రిపాఠి , పోసాని , వెన్నెల కిషోర్ ,నాగినీడు , స‌త్య ,కిషోర్ ,త‌రుణ్ అరోరా , ప్ర‌గ‌తి , విద్యుల్లేఖా, వ‌త్స‌వ్ త‌దిత‌రులు

సాంత‌కేతిక వ‌ర్గం:
ఎస్‌.ఎఫ్‌.ఎక్స్‌: త‌ప‌స్ నాయ‌క్‌, కోడైరెక్ట‌ర్స్‌: గులాబి శ్రీను, రంగ‌నాథ్‌, పి.ఆర్‌.ఒ: వ‌ంశీ-శేఖ‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సాహి సురేష్‌, ఆర్ట్‌: శ్రీనివాస్ పున్న‌, కాస్ట్యూమ్స్‌: రాగా రెడ్డి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: శ‌ర‌ణ్ అడ్ల‌, ఎడిటింగ్‌: న‌వీన్ నూలి, ఫైట్స్‌: వెంక‌ట్‌, కొరియోగ్ర‌ఫీ: శేఖ‌ర్‌, విజ‌య్‌, సినిమాటోగ్ర‌ఫీ: సూర్య‌, మ్యూజిక్ : సామ్ సి.ఎస్‌, నిర్మాత‌లు: రాజ్‌కుమార్ ఆకెళ్ల‌, కావ్యా వేణుగోపాల్‌, స్టోరీ, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: టి.సంతోష్‌.