కఫే ల్లో చాయ్ విత్ కప్రిషియో లైవ్ బ్యాండ్

కఫే ల్లో చాయ్ విత్ కప్రిషియో లైవ్ బ్యాండ్

 

కఫే ల్లో చాయ్ విత్ కప్రిషియో లైవ్ బ్యాండ్

ఇన్నాళ్లు నగరంలో పబ్బులకే పరిమితమైన లైవ్ బ్యాండ్ ఇకనుంచి కఫే ల్లో సంగీతాభిమానులను అలరించనుంది. తమ ప్రత్యక్ష సంగీతంతో ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చే వారికి తేనెటీ రుచులే కాకుండా సంగీత రుచిని చూపనున్నారు. చాయ్ విత్ కప్రీషియో పేరుతో ఈ కార్యక్రమానికి నగరంలో శ్రీకారం చుట్టనున్నారు. మొట్టమొదటి తెలుగు బ్యాండ్ అయిన బ్యాండ్ కప్రీషియో ఆధ్వర్యంలో చాయ్ విత్ కప్రీషియో పేరుతో సంగీత వేడుకను నిర్వహించనున్నారు.

 

కాఫీ షాపుల్లో అన్ని వయసుల వారికి అనుమతి ఉంటుందని సంగీతాన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి ఈ ప్రత్యక్ష సంగీతాన్ని దగ్గరికి చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బ్యాండ్ కప్రీషియో సభ్యులు ఏకనాథ్, సాయి తేజ, శ్రవణ్, ఆయాన్, నిశాంత్, మోసెస్ తెలిపారు. తొలిగా డేట్ కఫే లో ఈ వేడుకను నిర్వహించనున్నారు.