గాడ్ ఫాదర్ షూటింగ్‌ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ !!

గాడ్ ఫాదర్ షూటింగ్‌ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ !!

గాడ్ ఫాదర్ షూటింగ్‌ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికిన మెగాస్టార్ చిరంజీవి !!

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం ముంబై లో చిత్రీకరణ జరుపుకుంటుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించడానికి విచ్చేశారు.  ఈ సంద‌ర్భంగా చిరంజీవి పుష్ప‌గుచ్చంతో  స‌ల్మాన్‌కు స్వాగతం పలికారు. ఇప్పటికే ముంబైలో షూట్‌లో చేరారు.

“గాడ్‌ఫాదర్, భాయ్ సల్మాన్ ఖాన్‌కి స్వాగతం! మీ ప్రవేశం ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది & ఉత్సాహం తదుపరి స్థాయికి వెళ్లింది. మీతో స్క్రీన్‌ను పంచుకోవడం ఒక సంపూర్ణమైన ఆనందం. మీ ఉనికి ప్రేక్షకులకు ఆ అద్భుత కిక్‌ ని ఇస్తుందనడంలో సందేహం లేదు.’ అని చిరంజీవి పోస్ట్‌ చేశారు.

పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషిస్తోంది.

అగ్రశ్రేణి టెక్నికల్‌ టీమ్‌ సినిమాకు సంబంధించిన విభిన్నమైన శాఖ‌ల‌లో ప‌నిచేస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ బాణీలు అందిస్తున్నారు. అనేక బాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్‌కి ఆర్ట్ డైరెక్టర్ గా ప‌నిచేసిన సురేష్ సెల్వరాజన్ – ఈ సినిమా ఆర్ట్‌వర్క్‌ని చూసుకుంటున్నారు.

కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

స్క్రీన్ ప్లే & దర్శకత్వం: మోహన్ రాజా

నిర్మాతలు: RB చౌదరి & NV ప్రసాద్

సమర్పకురాలు: కొణిదెల సురేఖ

బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్ & సూపర్ గుడ్ ఫిల్మ్స్

సంగీతం: S S థమన్

DOP: నీరవ్ షా

ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్

ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వాకాడ అప్పారావు

PRO: వంశీ-శేఖర్

Bollywood Superstar Salman Khan Joins The Shoot Of Megastar Chiranjeevi – Mohan Raja – Konidela Productions And Super Good Films – Godfather

Megastar Chiranjeevi’s 153rd film Godfather being directed by Mohan Raja and produced grandly by Konidela Productions and Super Good Films is currently being filmed in Mumbai. Guess what, Bollywood superstar Salman Khan comes on board to play a powerful role in the movie. The actor has already joined the shoot in Mumbai and Chiranjeevi welcomed hin by offering a flower bouquet.

“Welcome aboard #Godfather , Bhai @BeingSalmanKhan ! Your entry has energized everyone & the excitement has gone to next level.  Sharing screen with you is an absolute joy. Your presence will no doubt give that magical #KICK to the audience. @jayam_mohanraja @AlwaysRamCharan ,” posted Chiranjeevi. It’s an eye feast to see the two legends together.

Chiranjeevi will be seen in a powerful role in the movie tipped to be a high intense political action drama. Nayanthara is playing a significant role in the movie.

Top-notch technical team is handling different crafts of the movie. Master cinematographer Nirav Shah handles the camera, while the in-form music director SS Thaman renders soundtracks. Suresh Selvarajan – the art director for many Bollywood Blockbusters – takes care of the artwork of this film.

The film is produced jointly by RB Choudary and NV Prasad, while Konidela Surekha is presenting it.

Screenplay & Direction: Mohan Raja
Producers: RB Choudary & NV Prasad
Presenter: Konidela Surekha
Banners: Konidela Productions & Super Good Films  
Music: S S Thaman
DOP: Nirav Shah
Art Director: Suresh Selvarajan
Ex-Producer: Vakada Apparao
PRO: Vamsi-Shekar