అక్కినేని నాగ చైతన్య ఇంట‌ర్వ్యూ !!

అక్కినేని నాగ చైతన్య ఇంట‌ర్వ్యూ !!

బంగార్రాజు సంక్రాంతికి ఫుల్ మీల్స్‌లా ఉంటుంది –  అక్కినేని నాగ చైతన్య

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా బుధవారం హీరో నాగ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.

నాన్న, తాతతో కలిసి యాక్ట్ చేసినప్పుడు కాస్త భయంగా ఉండేది. మనం సినిమాలో ఆ భయం ఉండేది. ఆ ఎక్స్‌పీరియెన్స్ వల్ల బంగార్రాజులో అంతగా భయం అనిపించలేదు. పూర్తిగా ఓపెన్ అయిన నటించాను.

షూటింగ్ కంటే ముందే నాన్నను, కళ్యాణ్‌ను చాలా డౌట్స్ అడిగాను. నేను మొదటి సారి సీక్వెల్‌ చేశాను. నాకు అదే భయంగా ఉంది. బంగార్రాజు పాత్రను ఓన్ చేసుకునేందుకు సోగ్గాడే సినిమాను చాలా సార్లు చూశాను. చాలా హోం వర్క్ కూడా చేశాను.

సినిమాలో రెండు పాత్రలు సమానంగానే ఉంటాయి. నాన్నది గెస్ట్ రోల్ కాదు. బంగార్రాజు పాత్రే ముఖ్యం. ఈ సినిమా మొత్తం నాన్నగారు, రమ్యకృష్ణ గారి మీది నుంచే నడుస్తుంది. ఇక రాము పాత్ర అమెరికాలో ఉంటుంది.

సినిమాలో కృతి శెట్టి మెయిన్ హీరోయిన్. ఫెస్టివెల్ మూడ్, సీన్ కోసం అలా సరదాగా హీరోయిన్లను పెట్టారు. ప్రతీ పాటలో మంచి కొరియోగ్రఫీ ఉంటుంది. నాలుగు పాటలను ఎంజాయ్ చేస్తూ చేశాను. పండుగకు ఇలాంటి సినిమాలే రావాలి.

బంగార్రాజు రొమాంటిక్ సినిమా అని కాదు. రొమాన్స్‌లో  ఎంటర్టైన్మెంట్ యాడ్ అయి ఉంటుంది. నాకు నాగలక్ష్మీకి మంచి సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ మాత్రం అస్సలు తగ్గదు.

ఇది ఫెస్టివెల్ సినిమా. ఇది పండుగ కోసం రెడీ చేసిన సినిమా. నాన్న గారు మొదటి నుంచి అదే నమ్మకంతోనే ఉన్నారు. నాలుగేళ్ల క్రితమే ఈ ఐడియా వచ్చింది. కానీ ఇద్దరి డేట్స్ అడ్జస్ట్ అయ్యేసరికి ఇంత టైం అయింది. బంగార్రాజును ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసేశాం. 90 రోజుల్లో సినిమాను చేశాం.

టికెట్ రేట్లు నాన్నతో చాలా చర్చించాను. ఏప్రిల్‌లో జీవో వచ్చింది. ఆ టికెట్ రేట్లకు తగ్గట్టే బడ్జెట్ ఫిక్స్ చేశాం. ఒక వేళ టికెట్ రేట్లు పెరిగితే.. మాకు బోనస్‌లా అవుతుంది. థాంక్యూ సినిమా విషయంలో దిల్ రాజు నిర్ణయం తీసుకుంటారు. నేను కేవలం నటుడిని. ఏదైనా ఇబ్బంది ఉందా? నిర్మాతను ముందే అడుగుతాను. పరిస్థితిని బట్టి ముందుకు వెళ్లాల్సిందే.

సిధ్ శ్రీరామ్ వెళ్లిపోమాకే అనే పాట పాడారు. అనూప్‌తో స్పెషల్ బాండ్ ఉంటుంది. సరదాగా కంపోజ్ చేస్తుంటారు. మాకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తూనే ఉంటారు.

బంగార్రాజు పాత్ర కోసం తాతగారి వస్తువులను నాన్న ఏవైతే వాడారో నేను కూడా అన్నీ వాడాను.

ఇండస్ట్రీలో రానా, అఖిల్ నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్లతోనే ఎక్కువగా మాట్లాడతాను. నాన్నతో కూడా ఎక్కువగా మాట్లాడతాను.

కృతి శెట్టి చాలా మంచి నటి. చాలా హోం వర్క్ చేస్తుంది. ఆమె డెడికేషన్ వేరే లెవెల్. సర్పంచ్ నాగలక్ష్మీ పాత్రలో కృతి శెట్టి అద్భుతంగా నటించింది. ఈ పాత్రకు న్యాయం చేసింది.

రమ్యకృష్ణతో గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. శైలజారెడ్డి అల్లుడు సినిమాతో ఫుల్ లెంగ్త్ నటించాను. ఇందులో కూడా అలానే ఉంటుంది. సీనియర్స్ ఆర్టిస్ట్‌లతో నటిస్తుంటే ఎంతో నేర్చుకోవచ్చు. అందుకే నేను వారితో నటించే అవకాశాల కోసం ఎదురుచూస్తుంటాను. రమ్యకృష్ణ గారు ఎంతో సరదాగా ఉంటారు.

యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేశారు. లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టు ఉంటాయి. కర్రతో ఫైట్ ఉంటుంది. దాని కోసం కర్రసాము కూడా నేర్చుకున్నాను.

వీఎఫెక్స్ వర్క్ 35 నిమిషాలుంటాయి. నాగలక్ష్మీ సీన్స్, రమ్యకృష్ణ నాన్న గారి మధ్య సీన్స్ బాగుంటాయి. సంక్రాంతికి ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. థ్యాంక్యూ సినిమా తరువాత అమెజాన్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయబోతోన్నాను. అది కూడా విక్రమ్ కే కుమార్‌తోనే చేయబోతోన్నాను. హారర్ సినిమాలంటే నాకు భయం.  కానీ ఆ జానర్‌లో ఓ సినిమా చేస్తాను. విజయ్ కనకమేడల గారితో ట్రావెల్ చేస్తున్నాను. ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ అవ్వలేదు. లాల్ సింగ్ చద్దా షూటింగ్ పూర్తయింది. థ్యాంక్యూ మూవీ ఇంకో షెడ్యూల్ ఉంది. సినిమాలో మూడు షేడ్స్ ఉంటాయి. కరోనా వల్ల అన్ని ప్రాజెక్ట్‌లు ఆలస్యమయ్యాయి. ఆమీర్ ఖాన్ గారి నుంచి నా జీవితానికి సరిపడే అంత నేర్చుకున్నాను. ప్రతీ యాక్టర్ ఒక్కసారైనా ఆయనతో నటించాలి.

చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. కంటెంట్ అనేది కింగ్. ఆడియెన్స్‌కి ఏది నచ్చితే అదే హిట్ అవుతుంది. హీరో, రౌడీ బాయ్స్ టీంకు ఆల్ ది బెస్ట్. అదే సమయంలో బంగార్రాజు పెద్ద హిట్ అవ్వాలి