‘భీమ్లా నాయక్’ నుంచి మరో పాట విడుదల !!

‘భీమ్లా నాయక్’ నుంచి మరో పాట విడుదల !!

‘భీమ్లా నాయక్’ తో ‘అంత ఇష్టమేందయ‘ అంటూ పాటందుకున్న ‘ నిత్య మీనన్‘
 
‘భీమ్లా నాయక్’ నుంచి మరో పాట విడుదల
 
రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన ప్రేమానురాగాల గీతం
 
వీనుల విందుగా తమన్  స్వరాలు 
 
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం  
‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
 
‘భీమ్లా నాయక్’ మలి గీతం విజయదశమి పర్వదినాన (15-10-2021) విడుదల అయింది. ‘భీమ్లా నాయక్’ తో ‘అంత ఇష్టమేందయ‘ అంటూ పాటందుకున్న ‘నిత్య మీనన్. ఈ గీతాన్ని వినగానే చిత్ర కథాంశం ను అనుసరించి రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన ప్రేమానురాగాల గీతం ఇది అనిపిస్తుంది. వీనుల విందుగా సాగిన తమన్ స్వరాలు ఈ గీతాన్ని మరో స్థాయికి చేర్చాయి.
 
భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను వ్యక్త పరచ గలిగే పాటలు గతంలో వచ్చాయి కానీ ఆ భావం ఎప్పటికప్పుడు నిత్య నూతనం. నిత్యామీనన్ దృష్టికోణంలోనుంచి తన పట్ల భర్త తాలూకు ప్రేమ ఏ పతాక స్థాయిలో ఉన్నదో ఈ పాటలో చక్కగా కొత్తగా అలతి పదాల్లో కుదిరింది. అతితక్కువ సమయంలో రాయడం బాణీ కట్టడం జరిగిపోయాయి.దాదాపు ఒక గంట వ్యవధిలో పాట రూపకల్పన జరిగింది. వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సాగర్ చంద్ర గారు వినడం,ఆస్వాదించి ఆమోదించడం జరిగిపోయింది. 
తమన్ చక్కటి బాణీకి చిత్రగారి స్వరం ప్రాణం పోసి పాట ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింప చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు అన్నారు ఈ పాట గురించి గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి.
 
తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని  తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. 
 
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మిత మవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
 
సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ 
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్ 
ఎడిటర్:‘నవీన్ నూలి
ఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ 
నిర్మాత:సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
 
“ANTHA ISHTAM SONG RELEASE”
 
*‘Nithya Menen’ sings ‘Antha Ishtamendaya’ with ‘Bheemla Nayak‘ *’Bheemla Nayak’ second song release
*A song of love penned down by Ramajogayya Sastry
 *Thaman’s tune is a feast for the senses
 
Pawan Kalyan and Rana Daggubati starrer ‘Bheemla Nayak’ is being produced by Sithara Entertainments. Screenplay and dialogues are given by Ace Writer-Director ‘Trivikram’ while ‘Survyadevara Naga Vamsi’ is producing the film which is being Directed by ‘Saagar K Chandra’.
 
‘Bheemla Nayak’ second song is released on the occasion of Vijayadashami (15-10-2021). ‘Nithya Menen’ sings ‘Antha ishtamendaya’ with Bheemla Nayak. Upon hearing this song, it feels like a love song that has been invented by Ramajogayya Sastry’s literature by taking the storyline into consideration. Thaman’s tune, which is a feast to the senses, took the song to another level.
Songs that express the love between a husband and wife have come in the past but the feeling is always new. From Nithya Menen’s point of view, her love for her husband has been expressed using many words in a new and beautiful way. The song has been written along with the composition of the tune in the shortest time. The song was designed in about an hour. Immediately Sri Pawan Kalyan, Trivikram Garu, Saagar Chandra garu have enjoyed and approved the song after listening to it.
The lyricist Ramajogayya Sastry said that without a doubt, singer Chitra has poured life into Thaman’s melodious tune and has elevated and strengthened the song.
 
Producer Suryadevara Naga Vamsi said that his banner is producing this film with great ambition. He also said that the film is set to release on 12 January 2022.
 
Nithya Menen and samyukta menan are acting alongside Pawan Kalyan and Rana Daggubati respectively. Renowned actors like Rao Ramesh, Murali Sharma, Samuthirakani, Raghu Babu, Narra Srinu, Kadambari Kiran, Chitti, Pammi Sai are playing important characters in this movie.
 
 Dialogues, Screenplay: Trivikram Cinematographer: Ravi K. Chandran (ISC) Music: Thaman.S
Editor: Navin Nooli
Art: A.S.Prakash
VFX Supervisor: Yugandhar.T
P.R.O: Lakshmi Venugopal
 
Presenter: P.D.V. Prasad
Producer: Suryadevara Naga Vamsi Director: Saagar K. Chandra