`సౌండ్ పార్టీ` మూవీ ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్!!

`సౌండ్ పార్టీ` మూవీ ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్!!

ట్రెండింగ్ లో  `సౌండ్ పార్టీ`  ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్!!
 వైర‌ల్ అవుతోన్న `సౌండ్ పార్టీ` ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్!!

 ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ`.  వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టిస్తున్నారు.   రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ.  సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం టీజ‌ర్ ఇప్ప‌టికే  విడుద‌లై టాలీవుడ్ లో గ‌ట్టిగానే సౌండ్ చేసింది. ఇక ఇటీవ‌ల ఈ చిత్రం నుండి `మ‌ని మ‌ని మ‌ని మ‌నీ దీని ముఖ‌ములు సోమెనీ` అనే లిరిక‌ల్ వీడియో సాంగ్ లాంచ్ చేశారు. ప్ర‌జంట్ ఈ సాంగ్ యూట్యూబ్ లో  వైర‌ల్ అవుతోంది. డ‌బ్బు ప్రాధాన్య‌త  గురించి యువ ర‌చ‌యిత పూర్ణ‌చారి ప్ర‌జంట్ ట్రెండ్ కి క‌నెక్ట‌య్యే విధంగా పాట రాయ‌గా మోహిత్ రెహ‌మానిక్  దానికి త‌గ్గ‌ట్టుగా మాంచి బీట్ తో కంపోజ్ చేశారు. యూట్యూబ్ లో వైర‌ల్   అవుతోన్న ఈ సాంగ్ మంచి వ్యూస్ తో రీల్స్ తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఫ‌స్ట్ లిరిక‌ల్ తోనే మంచి బ‌జ్ క్రియేట్ చేసిన `సౌండ్ పార్టీ ` చిత్రం ఇటు ఇండ‌స్ట్రీలో అటు ఆడియ‌న్స్ లో రీ -సౌండ్ సృష్టించ‌డం ఖాయం అన‌డంలో సందేహం లేదు. శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం త్వ‌ర‌లో  విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.
 ఈ సంద‌ర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ర‌వి పోలిశెట్టి మాట్లాడుతూ…“ఎప్పుడైతే మా `సౌండ్ పార్టీ` చిత్రం  టీజ‌ర్ విడుద‌లైందో అప్ప‌టి నుంచి మా `సౌండ్ పార్టీ` చిత్రానికి మంచి మంచి బ‌జ్ వ‌చ్చింది. ముఖ్యంగా టీజ‌ర్ లో వీజే స‌న్నీ, శివ‌న్నారాయ‌ణ చెప్పిన డైలాగ్స్ తో సినిమాలో ఎలాంటి హ్యుమ‌ర్ ఉండ‌బోతుందో అర్థ‌మ‌వుతోంది. ఇక ఇటీవ‌ల రిలీజ్ అయిన‌ `సౌండ్ పార్టీ` టైటిల్ ట్రాక్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ప్ర‌స్తుతం పాటలు సినిమాకు ఎంత ప్ల‌స్ అవుతున్నాయో, సినిమాను ప‌బ్లిక్ లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నాయో చూస్తున్నాం. ఈ త‌రుణంలో మా సినిమా నుండి రిలీజైన ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ కి  మంచి రెస్పాన్స్ రావ‌డం ఎంతో సంతోషంగా ఉంది. త్వ‌ర‌లో మిగ‌తా పాట‌లు రిలీజ్ చేయ‌నున్నాం. మా సంగీత ద‌ర్శ‌కుడు మోహిత్ రెహ‌మానిక్ అద్భుత‌మైన పాట‌ల‌తో పాటు సినిమాను నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్లే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోరు చేశారు. అలాగే స‌మ‌ర్ప‌కుడు జ‌య శంక‌ర్ , ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేస్తున్నారు. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.

  శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి   డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో – రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న‌ ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. టి ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. ఓ. :  జీ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : జ‌య‌శంక‌ర్‌ ; రచన – ద‌ర్శ‌కత్వం :  సంజ‌య్ శేరి

Sound Party’: Viral first lyrical video trends big!

The VJ Sunny entertainer’s first song resonates with listeners in a big way

Bigg Boss Telugu 5 title winner VJ Sunny’s upcoming movie titled ‘Sound Party’ is up for theatrical release. Starring Hritika Srinivas as the heroine, the film is Full Moon Media Productions’ maiden venture. Sanjay Sheri, a talented writer, is making his debut as a director. Producers Ravi Polishetty, Mahendra Gajendra, and Sri Shyam Gajendra have joined hands with presenter Jaya Shankar. The film’s teaser has already been a hit.

Lately, the film’s first song has gone viral on YouTube. Titled ‘Money Money’, the peppy song has been rendered by Jassie Gift. Purnachary has penned enjoyable lyrics. Mohith Rehamanic’s music has been embraced by listeners. No wonder the song is going viral. The trendy song comes with an appreciable theme. The chorus involving children is a special feature. The capacity of currency to dominate our lives and determine our destiny has been brought out in an entertaining way by the song. The popularity of the song can be gauged from the fact that it has been turned into reels by movie buffs. The song is playing a major role in taking the film to the audience.

Ravi Polishetty, the head of Full Moon Media Productions, today said that the movie started gaining buzz right from the day its teaser was released. “The dialogues spoken by VJ Sunny’s and Shivannarayana’s characters in the teaser have been a hit. This kind of humour is what the auidence want. The title track of ‘Sound Party’ has been getting a tremendous response. Currently, we are seeing how much role the song is playing in taking the film to the public. We are elated with how popular ‘Money Money’ has become among the audience. We will release the rest of the songs soon. Our music director Mohith has scored the background score in such a way that the film is taken to the next level. Presenter Jaya Shankar and director Sanjay Sheri are completing the post-production work without compromising anywhere. We will announce the film’s release date soon,” he said.

Cast:

VJ Sunny, Sivannarayana, Ali, Saptagiri, ’30 Years’ Prudhviraj, ‘Mirchi’ Priya, Manik Reddy, Ashok Kumar, Kadambari Kiran, ‘Gemini’ Suresh, Bhuvan Saluri, ‘I Dream’ Anjali, Prem Sagar, RJ Hemanth, Shashank Mouli, Trinadh, Krishna Teja and others.

Crew:

Director of Photography: Srinivas Reddy; Editor: G Avinash; Music Director: Mohit Rahmaniac; Lyricist: Poornachari; PRO: GK Media; Line Producer: Sivakanth Vanga; Executive Producer: Bhuvan Saluru; Producer: Ravi Polishetty; Presented by: V Jayashankar; Written and Directed by Sanjay Sheri.