‘ఆహా’ సరికొత్త వెబ్ సిరీస్ ‘భామా కలాపం’ఫస్ట్ లుక్ విడుదల !!

‘ఆహా’ సరికొత్త వెబ్ సిరీస్ ‘భామా కలాపం’ఫస్ట్ లుక్ విడుదల !!

ప్ర‌ముఖ నటి ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌లో ‘ఆహా’ సరికొత్త వెబ్ సిరీస్ ‘భామా కలాపం’.. ఫస్ట్ లుక్ విడుదల !!
 
100 శాతం ఓటీటీ మాధ్య‌మం ఆహా ఇప్పుడు తెలుగు వారిలో ఓ భాగ‌మైంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న ఆహా ఇప్పుడు సరికొత్త వెబ్ ఒరిజిన‌ల్ ‘భామా కలాపం’తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చిన ప్ర‌ముఖ న‌టి ప్రియ‌మ‌ణి ..‘భామా కలాపం’లో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా మెప్పిస్తున్నారు. పేరుకి త‌గ్గ‌ట్టే దీనికి ‘డిలిషియ‌ష్ హోం కుక్డ్ థ్రిల్ల‌ర్‌’ అనే క్యాప్ష‌న్ పెట్టారు. ‘డియర్ కామ్రేడ్’ మూవీ దర్శకుడు భరత్ కమ్మ షో రన్నర్‌గా అభిమ‌న్య‌ తాడిమేటి ఈ వెబ్ ఒరిజిన‌ల్‌ను డైరెక్ట్ చేశారు. బుధ‌వారం ‘భామా కలాపం’ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. 
 
ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే .. ప్రియ‌మ‌ణి గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తూనే ఇంట్లోని వివిధ పాత్ర‌ల‌ను చేతుల్లో ప‌ట్టుకుని  కాళికా మాత‌గా క‌నిపిస్తుంది. ఆమె క‌త్తి, గంప‌, బిర్యానీ ప్లేటు, గుడ్డు, పూజ రూమ్‌లోని బెల్ ఇవ‌న్నీ ప్రియ‌మ‌ణి చేతుల్లో ఆయుధాలుగా క‌నిపిస్తున్నాయి. ఇది గ‌మ‌నిస్తుంటే ఇంట్లో ఉంటూ వంట చేసే మ‌న మ‌హిళ‌ల్లో చాలా ర‌కాలైన షేడ్స్ ఉంటాయ‌ని, వారెలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొన్న‌డానికి సిద్ధంగా ఉంటార‌నే అర్థాన్నిచ్చేలా ఉంది. అలాంటి మ‌హిళ గ‌మ్యం ఎలా ఉండ‌బోతుంద‌నేది ప‌లు ర‌కాలైన ప్ర‌శ్న‌లు మ‌న మ‌సుల్లోకి వ‌స్తాయి. ఆ ప్ర‌శ్న‌లు మ‌న‌ల్ని ప్ర‌శాంతంగా కూర్చోనీయ‌వు. 
 
పాన్ ఇండియ మూవీ రాధే శ్యామ్‌, డియ‌ర్ కామ్రేడ్ వంటి చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ఫ్ర‌భాక‌ర్ ‘భామా కలాపం’కు సంగీతాన్ని అందించారు. సుధీర్ ఈద‌ర, భోగ‌వ‌ల్లి బాపినీడు ఈ సిరీస్‌ను ఎస్‌వీసీసీ డిజిట‌ల్ (విశ్వ‌క్ సేన్ చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమా నిర్మాణంలో భాగ‌మైన సంస్థ‌) పై నిర్మించారు. దీప‌క్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. విప్ల‌వ్ ఎడిట‌ర్‌గా వర్క్ చేశారు. తెలుగు డిజిట‌ల్ మాధ్యమంలో ‘భామా కలాపం’ తనదైన స్థానాన్ని దక్కించుకోనుంది. 
 
‘ఆహా’ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ విషయానికి వస్తే ..‘ది అమెరికన్ డ్రీమ్’ , జనవరి 14న విడుదలవుతుంది) , ఇందులో ప్రిన్స్ సెసిల్, నేహా కృష్ణ, తెలుగు ఇండియన్ ఐడల్ (దక్షిణాదిలో నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్).. దీన్ని ప్రముఖ సింగర్ శ్రీరామ చంద్ర హోస్ట్ చేస్తున్నారు. అలాగే ఆహాలో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న బాల‌కృష్ణ టాక్ షో అన్‌స్టాప‌బుల్ (ఈ టాక్ షోను ఐఎండీబీ నెంబ‌ర్ వ‌న్ షోగా గుర్తించింది) ఇవి కాకుండా ల‌క్ష్య‌, సేనాప‌తి, త్రీరోజెస్‌, లాభం, మంచి రోజులు వ‌చ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, అనుభ‌వించురాజా, స‌ర్కార్‌, చెఫ్ మంత్ర‌, అ్ల‌ల్లుడుగారు, క్రిస్మ‌స్ తాత‌, ఇలా ఎన్నో ఆసక్తికరమైన సినిమాలు, షోస్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధంగా ఉన్నాయి.