Anucharudu movie opening

Anucharudu movie opening

Anucharudu movie opening

“అనుచరుడు” మూవీ ప్రారంభం
వెరీగుడ్ సినీ స్కూల్ పతాకంపైప్రభాకర్ ఇప్ప స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న మేసుజ్ ఓరియెంటెడ్ ఎంటర్ టైనర్ “అనుచరుడు”. ఈ చిత్రం నేడు పూజాకార్యక్రమాలతో ప్రారంభమైనది. తెలంగాణ రాష్ట్ర ఇందుష్ట్రీయల్ ఛైర్మన్ బాల మురళి ,తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ఆర్ కె గౌడ్ సంయుక్తంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు వరకోటి, బీసీ సెల్ రాష్ట్ర సెక్రటరీ రిషి కుమార్, లిరిక్ రైటర్ రామారావు, సంగీత దర్సకుడు సాయి శ్రీనివాస్ ,ఆర్టిస్ట్ చిట్టిబాబు,డాన్స్ మాస్టర్ బండ్ల రామారావు ,కెమెరా మాన్ వెంకట్ తదితరులు పాల్గున్నారు .
ఈ సందర్భంగా RK గౌడ్ మాట్లాడుతూ మా సిద్ధిపేట వాస్తవ్యుడైన ప్రభాకర్ గతంలో సహచరుడు సినిమే తీసి 5 బాషలలో రిలీజ్ చేసాడు. ఇప్పుడు అనుచరుడిగా తెరంగేట్రం చేయనున్నారు.అతనికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎప్పుడు సపోర్ట్ గ ఉంటుంది అని తెలియచేస్తున్నాను అని చెప్పారు.
హీరో ప్రభు మాట్లాడుతూ నన్ను అన్నివిధాలా ప్రోత్సహిస్తున్న TFCC చైర్మన్ RK గౌడ్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు .ఛాంబర్ గైడ్ లైన్స్ ని అనుసరించి త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఎక్కడఏది శాశ్వతంకాదు అనే కాన్సెప్ట్ తో ఈచిత్రం నిర్మించ బడుతుంది .సబ్జెక్టు బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అని నేను అనే నమ్మకం తో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాను అని చెప్పారు
కాస్టింగ్: ప్రభు , గౌతమ్ రాజు ,రంగరాజు ,రేలంగి , చిట్టిబాబు ,గబ్బర్ సింగ్ గ్యాంగ్ ,తదితరు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా వెంకట్ కొవూరి,డాన్స్ బండ్ల రామారావు ,లిరిక్ రైటర్ :రామారావు ,కో-డైరెక్టర్ : ఈశ్వర్.దామూగట్ల ,నిర్మాణం :వెరీ గుడ్ సినీ స్కూల్ కథ – స్క్రీన్ ప్లే- దర్శకత్వం :ప్రభు ఇప్ప