‘‘అక్షర’’ లోని ‘రామ రామ’ పాట రిలీజ్ చేసిన హీరో విశ్వక్ సేన్ !!

‘‘అక్షర’’ లోని ‘రామ రామ’ పాట రిలీజ్ చేసిన హీరో విశ్వక్ సేన్ !!

 

‘‘అక్షర’’ లోని ‘రామ రామ’ పాట రిలీజ్ చేసిన హీరో విశ్వక్ సేన్ !!

నందిత శ్వేతా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘‘అక్షర’’. సినిమా హాల్
ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ
అల్లూరి,అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘అక్షర’’ సినిమా
లిరికల్ సాంగ్ ను హీరో విశ్వక్ సేన్  విడుదల చేశారు.. ‘‘అక్షర’’. మూవీ
ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతుంది.

ఈ సందర్భంగా  హీరో విశ్వక్ సేన్  మాట్లాడుతూ :
పాగల్ సినిమా సెట్ లో నిర్మాత అహితేజ పరిచయ మయ్యాడు.ఆయన తో
మాట్లాడుతున్నపుడు సినిమా మీద ఫ్యాషన్ ఉన్న వ్యక్తి అనిపించింది. అందుకే
ఈ సినిమా సాంగ్ లాంచ్ కి గెస్ట్ గా పిలవగానే వచ్చాను. సాంగ్ చాలా
బాగుంది. చిన్న సినిమాలు లాక్ డౌన్ లో ఓటీటీ కి వెళ్లాయి. ఇంకొన్ని
థియేటర్ రిలీజ్ కు వస్తున్నాయి. అలాంటి సినిమాలకు కాసుల వర్షం
కురుస్తోంది. అక్షర సినిమాకు కూడా బాగా డబ్బులు రావాలి. అన్నారు.

దర్శకుడు చిన్ని కృష్ణ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థ లోపాలను చూపిస్తూ
అక్షర సినిమా రూపొందించాం. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ను ఒక కారెక్టర్ కు
అనుకున్నాం అయితే ఆయన అప్పటికే హీరోగా లాంచ్ అయ్యారు. సో బాగోదని
అనుకున్నాం. అక్షర ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇస్తుంది. అన్నారు.

నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ…చిన్న సినిమాగా అక్షర ను
స్టార్ట్ చేశాం. మీడియా సపోర్ట్ తో పెద్ద సినిమాగా రిలీజ్ చేస్తున్నాం.
ఒకే ఒక ఫోన్ చేయగానే విశ్వక్ సేన్ గారు మా కార్యక్రమానికి వచ్చారు ఆయన
వైజాగ్ వెళ్ళాలి మాకోసం ఈక్కడికి వచ్చినందుకు థాంక్స్. అన్నారు.

హీరోయిన్ నందిత శ్వేతా మాట్లాడుతూ…. అక్షర సినిమా ఒక మంచి సినిమా.
థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఫీల్ తో వస్తారు. ఒక మంచి కథతో దర్శకుడు
అక్షర ను రూపొందించారు. మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాము. అన్నారు

ఈ కార్యక్రమంలో నటుడు మధు నందన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర
పాత్రల్లో నటిస్తున్నారు.
కెమెరామాన్ : నగేష్ బెనల్, సంగీతం : సురేష్ బొబ్బిలి, ఎడిటర్ : జి.సత్య,
ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి, కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు,
లైన్ ప్రొడ్యూసర్స్ :  గంగాధర్, రాజు ఓలేటి, పి.ఆర్.ఓ :  జియస్ కె
మీడియా, కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్ కొప్పు రావూరి,
నిర్మాణ సంస్థ :  సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాతలు : సురేష్ వర్మ
అల్లూరి, అహితేజ బెల్లంకొండ, రచన – దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.