ఆది సాయి కుమార్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “తీస్ మార్ ఖాన్” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఆది సాయికుమార్… పలు యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించి మాస్ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యాడు. అతని నుండీ రాబోతున్న తాజా చిత్రం ‘ తీస్ మార్ ఖాన్ ‘. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఆకర్షించే అందం, చక్కటి అభినయం తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుండగా ఓ కీలకమైన పాత్రలో ప్రముఖ నటుడు సునీల్ నటిస్తున్నాడు. దసరా పండగ సందర్భంగా ఈ సినిమా కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ తీస్ మార్ ఖాన్ చిత్రంలో ఆది మరో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ ఫస్ట్ లుక్ లో ఆది నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపిస్తున్నాడు. సిగరెట్ కాలుస్తూ నడుస్తూ వస్తున్నట్లు ఉన్న ఈ మాస్ లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ సినిమా లో స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర లో ఆది నటిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

నటీనటులు

ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ఠాకూర్, పూర్ణ తదితరులు

సాంకేతిక నిపుణులు

బ్యానర్ : విజన్ సినిమాస్
డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ
ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తిరుమల రెడ్డి
మ్యూజిక్ : సాయి కార్తీక్
ఎడిటర్ : మణికాంత్
సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి
పీఆర్వో : సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు

Aadi Saikumar, Kalyanji Gogana, Vision Cinemas Production No 3 Tees Maar Khan First Look Out

Young and promising hero Aadi Saikumar had created a special place for himself as a protagonist by complimenting him with various films and unique characters.

Aadi’s new film under the direction of Natakam Fame Kalyanji Gogana is fast progressing with its shoot. Leading Businessman Nagam Tirupathi Reddy is producing this Production No 3 under Vision Cinemas. Gorgeous diva Payal Rajput plays Aadi’s love interest, while hero Sunil will be seen in important role in this film.

On the auspicious occasion of Dussehra, the makers have revealed the film’s title, besides releasing first look poster. The film is titled as Tees Maar Khan and it’s a perfect one, given Aadi plays an action-packed role in this high voltage action drama.

The first look poster sees Aadi in mass avatar walking stylishly with a cigarette in his mouth. He, at the same time, looks class in stylish attire, sporting shades. We can see some deadly weapons like guns, knives on his back and this gives huge elevation to this character.

Student, Rowdy and Police represent three shades of this Tees Maar Khan.

Sai Karthik who had scored music for many successful films is scoring music for this film. Bal reddy is the cinematographer and Mani Kanth is the editor. Other details of the film will be unveiled soon.

Cast: Aadi Saikumar, Payal Rajput, Sunil, Anoop Singh Thakur, Kabir Singh Thakur, Poorna and others.

Crew
Banner: Vision Cinemas
Director : Kalyanji Gogana
Producer: Nagam Tirupathi Reddy
Executive Producer: Tirumala Reddy
Music: Sai Karthik
Editor: Manikanth
Cinematographer: Bal Reddy
PRO: Sai Satish, Parvataneni Rambabu