పద్మశ్రీ ట్రైలర్ విడుదల !!

పద్మశ్రీ ట్రైలర్  విడుదల !!

పద్మశ్రీ ట్రైలర్  విడుదల !!

ఎస్.ఎస్.పిక్చర్స్ బ్యానర్ పై, ఎస్.ఎస్. పట్నాయక్ రచన,దర్శకత్వంలో సదాశివుని శిరీష నిర్మాతగా, మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ మరియు PVS రామ్మోహన్ రావు సహనిర్మాతలు గా నిర్మితమైన  *పద్మశ్రీ*  సినిమా  ట్రైలర్ ఆవిష్కరణ  ఫిలింఛాంబర్లో ప్రముఖ పాత్రికేయులు చేతులమీదుగా జరిగినది.

చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. పట్నాయక్ మాట్లాడుతూ ఈ రోజు తన జన్మదినం అని, ఈ జన్మదిన వేడుకను ఇలా ట్రైలర్ లాంచ్ ద్వారా పాత్రికేయులు నడుమ  ఫిలింఛాంబర్లో జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కొనియాడుతూ… తను కూడా జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వ్యక్తిని కాబట్టి జర్నలిస్ట్ కష్టనష్టాలు సాధకబాధకాలు తనకు తెలుసు కాబట్టి తన  పుట్టిన రోజు నాడు  జర్నలిస్టుల చేతుల మీదుగా తన దర్శకత్వం వహించిన పద్మశ్రీ  చిత్ర ట్రైలర్ ని విడుదల చేయడం ఇది ఒక గౌరవంగా భావిస్తున్నానని జర్నలిస్టులతో ట్రైలర్ని విడుదల చేయించారు.

ఈ చిత్రంలో హీరోగా పరిచయమైన కిషోర్ కుమార్, హీరోయిన్ సంధ్యారాణి మాట్లాడుతూ… ఈ చిత్రం ఒక కొత్త ప్రయోగాత్మక చిత్రం అని ఈ చిత్రం విడుదల తర్వాత వారికి మరెన్నో అవకాశాలు వస్తాయని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

ఈ చిత్ర సహనిర్మాత కొత్తకోట బాలకృష్ణ మాట్లాడుతూ అంతా కొత్త వారైనా నటీనటులతో ఇంత చక్కగా దర్శకుడు చేయించడం దర్శకునికి చిన్ననాటి స్నేహితులు గా తను ఎంతో గర్వపడుతున్నానని తన  ఆనందాన్ని, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే ఆశాభావాన్ని  వ్యక్తపరిచారు.

ఈ చిత్ర లిరిక్ రైటర్ బాసంగి  సురేష్ మాట్లాడుతూ ఈ చిత్రం ఎలా ఉంటుందో… ఈ నూతన  దర్శకుని స్టామినా ఏంటో ఈ ఒక్క ట్రైలర్ తెలిపిందని కొనియాడారు.

అయితే ఈ కార్యక్రమాన్ని మొదటిగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంతో పద్మశ్రీ టీం ప్రారంభించింది. అయితే సినిమా మనిషికి ఎంత ఆనందాన్ని ఇస్తుందో అదే విధంగా మనలో ఉండే శుభ్రత పరిసరాల శుభ్రత అనేది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని కరోనా బారి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అని నేపథ్యంలో కరోనా కి భయపడొద్దు జాగ్రత్తపడండి అంటూ పద్మశ్రీ టీం ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్ దగ్గర నుండి స్వచ్ఛభారత్ ని కొనసాగిస్తూ పరిసరాలను శుభ్రం చేసింది. ఎస్. ఎస్. పిక్చర్స్ బ్యానర్ పై  ప్రొడక్షన్ నెంబర్ వన్ గా పద్మశ్రీ అనే చిత్రంతో అడుగులు వేస్తున్నప్పుడు ఒక సామాజిక కార్యక్రమం తో ప్రారంభించాలనే సదుద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చిత్ర ఎడిటర్ కంబాల శ్రీనివాస్ తెలియపరిచారు.

గ్రాఫిక్స్ తో పాటు కామెడీ బేస్డ్ యాక్షన్ ఓరియెంటెడ్ హర్రర్ మూవీగా రూపుదిద్దుకుంది  పద్మశ్రీ. ఈ చిత్రాన్ని హైదరాబాద్, ఆలంపూర్ లో కొంత భాగాన్ని చిత్రీకరించగా, ఉత్తరాంధ్ర జిల్లాలలో తృప్తి రిసార్ట్స్ పరిధిలో  అందమైన లొకేషన్లలో చిత్రీకరించడం జరిగింది

ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వారు/నటీనటులు :
కిషోర్ కుమార్, సంధ్యారాణి, రావిపల్లి జ్యోతి పట్నాయక్, S.S.సతీష్ పట్నాయక్, కంబాల శ్రీనివాసరావు, అల్లెన్ హర్ష, కాళీ చరణ్, సదాశివుని శివ, కొండవలస జగదేవ్, పుట్ట గణేష్, లవ కుమార్, శ్రీదేవి  ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు

ఇతర సాంకేతిక వర్గం:
ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు, ఎడిటింగ్: కంబాల శ్రీనివాసరావు, ఆర్ట్: మణిపాత్రుని నాగేశ్వరరావు, ఫైట్స్: దేవరాజు మాస్టర్, సంగీతం: జాన్ పోట్ల, డాన్స్: వెంకట్, తారక్, లిరిక్స్: బాసంగి సురేష్ కుమార్, గ్రాఫిక్స్: డాట్ యానిమేషన్,
ఫైనాన్షియల్ అడ్వైజర్స్: పక్కి సురేష్, హారిక కృష్ణ!
డిజిటల్ ప్రమోషన్ : BRKఅడ్వర్టైజింగ్, పి ఆర్ ఓ: సతీష్ పాలకుర్తి, పర్వత నేని రాంబాబు.