ఆది పినిశెట్టి, సుశీంద్ర‌న్ ఫిల్మ్ టైటిల్ ‘శివుడు’

ఆది పినిశెట్టి, సుశీంద్ర‌న్ ఫిల్మ్ టైటిల్ ‘శివుడు’

ఆది పినిశెట్టి, సుశీంద్ర‌న్ ఫిల్మ్ టైటిల్ ‘శివుడు’

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది పినిశెట్టి, డైరెక్ట‌ర్ సుశీంద్ర‌న్ (విశాల్ ‘ప‌ల్నాడు’, కార్తీ ‘నా పేరు శివ’ సినిమాల ద‌ర్శ‌కుడు) కాంబినేష‌న్‌లో.. యాక్ష‌న్‌, డ్రామ్‌, స‌స్పెన్స్ ఎలిమెంట్స్‌తో.. రూర‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఒక స్ట్ర‌యిట్ తెలుగు ఫిల్మ్ రూపొందుతోంది.

మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ఒక పోస్ట‌ర్ ద్వారా రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘శివుడు’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ఆది పినిశెట్టి తీక్ష‌ణ‌మైన చూపుల‌తో.. త‌ల‌కు, ముక్కుకు గాయాల‌తో క‌నిపిస్తున్నారు. టైటిల్ లోగోపై కూడా ర‌క్తాన్ని మ‌నం చూడ‌వ‌చ్చు.

‘శివుడు’ టైటిల్ పోస్ట‌ర్ ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తుండ‌గా, మ‌రో బ‌ల‌మైన కంటెంట్‌తో ఆది పినిశెట్టి మ‌ళ్లీ మ‌న ముందుకు వ‌స్తున్నార‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తోంది.

ఆద‌ర్శ చిత్రాల‌య ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై ఆది పినిశెట్టి అన్న‌య్య స‌త్య‌ప్ర‌భాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, ర‌విరాజా పినిశెట్టి స‌మ‌ర్పిస్తున్నారు.

నిక్కీ గ‌ల్రానీ, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లు కాగా.. సునీల్‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, కంచ‌ర‌పాలెం రాజు, జేపీ, శ‌త్రు కీల‌క పాత్ర‌ధారులు.

వేల్‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్న ఈ చిత్రానికి జై మ్యూజిక్ అందిస్తున్నారు. కాశీ విశ్వ‌నాథ‌న్ ఎడిట‌ర్ కాగా, చంద్ర‌బోస్ పాట‌లు రాస్తున్నారు.

ప్ర‌స్తుతం శివుడు చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. త్వ‌ర‌లో ఈ ఫిల్మ్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

తారాగ‌ణం:
ఆది పినిశెట్టి, సునీల్‌, నిక్కీ గ‌ల్రానీ, ఆకాంక్ష సింగ్‌, ప్రిన్స్‌, శ‌ర‌త్ లోహితాశ్వ‌, జ‌య‌ప్ర‌కాశ్‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, శ‌త్రు, కంచ‌ర‌పాలెం రాజు (సుబ్బారావు), ముఖ్తార్ ఖాన్‌, కుత్తుకుమార్‌.

సాంకేతిక బృందం:
ద‌ర్శ‌క‌త్వం:  సుశీంద్ర‌న్‌
నిర్మాత‌: స‌త్య‌ప్ర‌భాస్‌
స‌మ‌ర్ప‌ణ‌: ర‌విరాజా పినిశెట్టి
బ్యాన‌ర్‌: ఆద‌ర్శ చిత్రాల‌య ప్రైవేట్ లిమిటెడ్‌
సినిమాటోగ్ర‌ఫీ:  వేల్‌రాజ్
మ్యూజిక్‌:  జై
ఎడిటింగ్‌:  కాశీ విశ్వ‌నాథ‌న్‌
పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌
కొరియోగ్ర‌ఫీ:  శోబి మాస్ట‌ర్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

 

Aadhi Pinisetty, Susienthiran’s Film Titled SIVUDU
 

Young and promising hero Aadhi Pinisetty has teamed up with Director SUSIENTHIRAN (directed Vishal’s Palnaadu & Karthi’s Naa Peru shiva preciously) for a straight Telugu film billed to be a rural entertainer laced with action, drama and suspense elements.

The poster revealing the title of the film is out today on the occasion of Maha Shivaratri. Incidentally, Sivudu is the title locked for the film. Aadhi Pinisetty looks fierce in the poster with injuries to his head and nose. We can also see blood on the title logo as well.

The title poster of Sivudu looks interesting and feels like aadhi is back yet again with another strong content.

Aadhi Pinisetty’s elder brother Sathya Prabhas is producing the film under Aadarsha Chitralaya PVT LTD. Ravi Raja Pinisetty is presenting it.

Nikki Galrani and Akanksha Singh are the heroines, while Sunil, Harish uthaman,Kancharapalem Raju, JP, shatru and many more will be seen in crucial roles.

Ace cinematographer Velraj is handling the cinematography, while Jai is the music director. Kasi Viswanathan is the editor and Chandra Bose pens lyrics.

Sivudu is in last leg of post production. The film is gearing up for a grand release soon.

Cast: Aadhi Pinisetty, Sunil, Nikki Galrani, Akanksha Singh, Prince, Sarath Lohithaswa, Jayaprakash, Harish Uthaman, Shatru, Kancherpalem Raju (Subba Rao), Mukthar Khan, and Kuthukumar

Technical Crew:

Director – Susienthiran
Cameraman – Velraj
Music director – Jai
Editor – Kasi Viswanathan
Lyrics – Chandra Bose
Choreographer – Shobi Master
PRO: Vamsi-Shekar