`యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌`గా నొబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డ్ సాధించిన విధ్యా నిర్వాణ మంచు ఆనంద్‌

`యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌`గా నొబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డ్ సాధించిన విధ్యా నిర్వాణ మంచు ఆనంద్‌

Vidya Nirvana Manchu Anand Holds The Noble Book of World Records As Youngest Chess Trainer

Collection King Dr. Mohan Babu’s granddaughter and popular actress Manchu Lakshmi Prasanna’s daughter Vidya Nirvana Manchu Anand holds The Noble Book of World Records as `Youngest Chess Trainer ‘. On December 19, a test under the surveillance of Noble Book of Records representative Dr. Dr Chockalingam Balaji, was conducted and Vidya Nirvana passed it.

On the occasion, Representative of the Noble Book of Records, Dr. Chockalingam Balaji said, “We might have seen four to five year old kids playing chess, but giving training at the age of six is a great thing. Our organization really feels happy to honor Vidya Nirvana with the award.”

Vidya Nirvana’s trainer Karthik said, “I had told Manchu Lakshmi garu last year that if Vidya Nirvana learns chess, she will definitely prosper. However, she told me no saying Vidya was too young to learn the game. This year, Lakshmi garu called and asked me to train her. Just after four to five classes of training, Vidya Nirvana became an expert in the game. She later started teaching chess game to her friends. Then we spoke with the representatives and applied for the Noble Book Of Record. We are happy that Nirvana passed the exams today that was conducted under the supervision of Dr Chockalingam Balaji.
.
Manchu Lakshmi says, “I believe that chess is not just a game, but a life skill. That is why chess training was given to Vidya at an early age. But within two weeks, her coach Karthik came to me and told me that she was playing chess very well and we should apply for this record. I told him to wait for a few more days. But, then, I said ok as when she is ready why shouldn’t support her. As a mother, I really proud of my daughter Vidya Nirvana for holding the Noble Book of World Records as Youngest Chess Trainer.

Dr. Mohan Babu said, “Even today, I do not even know how to play chess. When Lakshmi informed me that Vidya Nirvana was learning Chess, I told her to better focus on her studies. She said no and told me that Vidya was interested to learn the game. As a grandfather, I feel proud of Nirvana for achieving the record at such young age. I suggest parents to encourage their children in the fields they are interested in, other than studies, and they will reach great heights. We wish Nirvana will become Great Nirvana with all our blessings.”

 
 
`యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌`గా నొబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డ్ సాధించిన విధ్యా నిర్వాణ మంచు ఆనంద్‌

కలెక్ష‌న్ కింగ్ డా. మోహ‌న్‌బాబు మ‌నవ‌రాలు, ప్ర‌ముఖ న‌టి మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌ కూతురు  విధ్యా నిర్వాణ మంచు ఆనంద్‌.  `యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌`గా నొబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. డిసెంబ‌ర్ 19న నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్ర‌తినిధి డా. చోక‌లింగం బాలాజి స‌మ‌క్షంలో జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా..
నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్ర‌తినిధి డా. చోక‌లింగం బాలాజి మాట్లాడుతూ – “నాలుగైదు సంవ‌త్స‌రాల పిల్లలు చెస్ ఆడ‌డం మనం చూసుంటాం కాని ఆరెళ్ల వ‌య‌సులో చెస్ గేమ్ లో  ట్రైనింగ్ ఇవ్వ‌డం గొప్ప విష‌యం. మా సంస్థ త‌ర‌పున రికార్డ్ అందించినందుకు హ్యాపీగా ఉంది“ అన్నారు.
విధ్యా నిర్వాణ ట్రైన‌ర్ కార్తిక్ మాట్లాడుతూ – “విధ్యా నిర్వాణ‌కి చెస్ గేమ్ నేర్పిస్తే త‌ప్ప‌కుండా రాణించ‌గ‌ల‌ద‌ని గ‌తేడాదే మంచు లక్ష్మిగారికి చెప్ప‌డం జ‌రిగింది. త‌న వ‌య‌సు చాలా చిన్న‌ది ఇప్పుడే వ‌ద్దు అని చెప్పారు. ఈ ఏడాది ల‌క్ష్మిగారే ఫోన్ చేసి త‌న‌‌కి ట్రైనింగ్ ఇవ్వ‌మ‌ని అడిగారు. ట్రైనింగ్ ఇవ్వ‌డం మొద‌లుపెట్టాక నాలుగైదు క్లాసుల్లోనే ఎంతో చురుకుగా గేమ్‌ని పూర్తిగా నేర్చుకుంది. ఆ త‌ర్వాత త‌న ఫ్రెండ్స్‌కి చెస్‌గేమ్ నేర్పించ‌డం మొద‌లుపెట్టింది. అప్పుడే ఈ రికార్డ్ ఎందుకు న‌మోదు చేయ‌కూడ‌దు అనిపించి వారి ప్ర‌తినిధుల‌తో మాట్లాడి ఈ రికార్డ్‌కోసం న‌మోదు చేయ‌డం జ‌రిగింది. ఈ రోజు నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్ర‌తినిధి డా. చోక‌లింగం బాలాజి స‌మ‌క్షంలో నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డ్ సాధించ‌డం సంతోషంగా ఉంది“ అన్నారు.
మంచు ల‌క్ష్మి మాట్లాడుతూ – “చెస్ అనేది కేవ‌లం ఆట మాత్ర‌మే కాదు అదొక లైఫ్ స్కిల్ అని నేను న‌మ్ముతాను. అందుకే విధ్య కి చిన్న వ‌య‌సులోనే చెస్ ట్రైనింగ్ ఇప్పించ‌డం జ‌రిగింది. కాని  రెండు వారాల్లోనే త‌న కోచ్ కార్తిక్ గారు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చెస్ చాలా బాగా ఆడుతుంది ఈ రికార్డ్‌కి మనం అప్లై చేద్దాం అని చెప్పారు. ఇప్పుడే వ‌ద్దు సార్ ఇంకా కొన్ని రోజులు చూడండి త‌ర్వాత చూద్దాం అన్నాను. త‌ను రెడీగా ఉన్న‌ప్పుడు మ‌నం ఎందుకు స‌పోర్ట్ చేయ‌కూడ‌దు అని ఓకే చెప్ప‌డం జ‌రిగింది. విధ్యా నిర్వాణ ఇంత చిన్న వ‌య‌సులోనే  `యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌` గా నొబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నందుకు ఒక త‌ల్లిగా ఎంతో గ‌ర్వంగా ఉంది“ అన్నారు.
డా. మోహ‌న్ బాబు మాట్లాడుతూ – “నాకు ఈ రోజుకి చెస్ ఆడ‌డం తెలీదు. అటువంటిది మా మ‌నవ‌రాలు విధ్యా నిర్వాణ చెస్ నేర్చుకుంటుంది అని లక్ష్మీ చెప్పిన‌ప్ప‌డు ఎందుక‌మ్మా ఇవ‌న్ని చ‌క్క‌గా చ‌దువుకోనివ్వు  అని అన్నాను. లేదు డాడి త‌ను చాలా ఆస‌క్తిగా ఉంది అని చెప్పింది. త‌ను ఈ వ‌య‌సులో ఈ రికార్డు లో స్థానం సంపాదించుకున్నందుకు ఒక తాత‌గా ఎంతో గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. ఈ సంద‌ర్భంగా త‌ల్లిదండ్రులకి నేను చెప్ప‌ద‌లుచుకుంది ఏంటంటే వారి పిల్ల‌ల‌కు దేనిమీద అయితే ఆస‌క్తి ఉందో చ‌దువుతోపాటు దానికి కొంత స‌మ‌యం కేటాయిస్తే త‌ప్ప‌కుండా ప్ర‌తిఒక్క‌రు గొప్ప స్థాయికి చేరుకుంటారు. మా అంద‌రి బ్లెస్సింగ్స్‌తో గ్రేట్ నిర్వాణ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.