ష్యూర్ షాట్‌.. నో డౌట్‌.. పుచ్చ‌పేలిపోద్ది.. క్రాక్ ట్రైల‌ర్ రిలీజ్‌

ష్యూర్ షాట్‌.. నో డౌట్‌.. పుచ్చ‌పేలిపోద్ది.. క్రాక్ ట్రైల‌ర్ రిలీజ్‌

 

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ… గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ క్రాక్ ట్రైల‌ర్ ను నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా చిత్ర బృందం విడుద‌ల చేశారు. మాస్ మ‌హారాజ ర‌వితేజ మ‌రోసారి త‌న ఎన‌ర్జిక్ న‌ట‌న‌.. డైలాగ్ డెలివ‌రీ టైమింగ్‌తో ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ర‌వితేజ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తున్నారు. ఇటీవ‌లే శృతిహాస‌న్ మ‌రియు ర‌వితేజ కాంబీనేష‌న్‌లో తెర‌కెక్కిన రోమాంటిక్ సాంగ్ విడుద‌ల చేశారు. ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లిన‌నే ఈ చిత్రాన్ని మాంచి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించారు. వీరిద్ద‌రి కాంబోలో డాన్ శ్రీ‌ను.. బ‌లుపు చిత్రాలు విడుద‌ల అయి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. దీంతో హ్యాట్రిగ్ మూవీగా వ‌స్తున క్రాక్ సినిమాపై ప్రేక్షకుల అంచ‌నాలు ఈ ట్రైల‌ర్ ద్వారా మ‌రింత పెరిగాయి.
అంతేకాకుండా వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ చిత్రానికి విక్ట‌రీ వెంక‌ట్ వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ… ఈ నెల 9న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని వెల్ల‌డించారు.