పీవీపీ సినిమా,శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై విశ్వ‌క్‌సేన్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

పీవీపీ సినిమా,శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై విశ్వ‌క్‌సేన్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

  పీవీపీ సినిమా,శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై విశ్వ‌క్‌సేన్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీవీపీ సినిమా,శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ పతాకాల‌పై యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. త‌మిళంలో సూప‌ర్‌హిట్ అయిన ఓ మై క‌డ‌వులే సినిమాకు ఇది రీమేక్‌. త‌మిళంలో ‘ఓ మై క‌డ‌వులే’ సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అశ్వ‌త్ మారిముత్తు తెలుగులోనూ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ముహూర్త‌పు స‌న్నివేశానికి హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్ట‌గా, ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ముహ‌ర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ద‌ర్శ‌కుడు అశ్వ‌త్ మారిముత్తుకి దిల్‌రాజు స్క్రిప్ట్‌ను అందించారు. ఫిబ్ర‌వ‌రి మూడో వారం నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

బెస్ట్ డైలాగ్ రైట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్‌ను అందుకున్న డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రానికి మాట‌ల‌ను అందించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. త్వరలోనే హీరోయిన్ సహా  ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.

 
Vishwak Sen’s new film produced by PVP Cinema, Sri Venkateswara Creations launched

Tollywood’s prominent production houses PVP Cinema and Sri Venkateswara Creations have come together to produce a movie with Vishwak Sen as the hero. The film was launched on Monday in a grand manner in Hyderabad. The untitled flick is the remake of the super-hit Tamil rom-com ‘Oh My Kadavule’. Ashwath Marimuthu, who wielded the megaphone for the Tamil original, will be directing the remake as well.

The ‘muhurtham’ scene was given the clap by ace producer Dil Raju, while well-known producer BVSN Prasad switched on the camera. Young filmmaker Tharun Bhaskcer directed the ‘muhurtham’ shot. Producer Dil Raju handed over the script to Director Ashwath Marimuthu. The plan is to start the shoot from the third week of February.

Dialogues are by Tharun Bhascker, who won National award as best dialogue-writer. Editing is by Garry BH. The makers will be announcing the details of the rest of the cast and crew soon.