మంచు విష్ణు ‘మోసగాళ్లు’ రెండో పాటకు అద్భుతమైన స్పందన

మంచు విష్ణు ‘మోసగాళ్లు’ రెండో పాటకు అద్భుతమైన స్పందన

మంచు విష్ణు ‘మోసగాళ్లు’ రెండో పాటకు అద్భుతమైన స్పందన

విష్ణు మంచు హీరోగా న‌టిస్తోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘మోస‌గాళ్లు’. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్యాన్ ఇండియా ఫిల్మ్‌గా ఇది విడుదలవుతోంది.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ అండ్ ఎవిఎ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా ప్లాన్ చేసారు నిర్మాత, హీరో మంచు విష్ణు. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌కు, టీజ‌ర్ల‌కు సూప‌ర్బ్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాలోని ‘సంపాదించాలంటే…’ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది.

తాజాగా విడుదల చేసిన ‘డబ్బే మనది కుమ్మేస్కో… మస్తీ మస్తీ చేసేస్కో… కాస్ట్లీ మందే వేసేస్కో…’ లిరికల్ వీడియోకు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సామ్ సీఎస్ స్వరపరిచిన ఈ పాటకు లిరిసిస్ట్ సిరాశ్రీ సాహిత్యం అందించారు. సింగర్ హేమచంద్ర తనదైన శైలిలో ఈ పాటను ఆలపించి మెప్పించారు.చ‌రిత్ర‌లో న‌మోదైన అతిపెద్ద ఐటీ స్కామ్ నేప‌థ్యంలో త‌యార‌వుతున్న ‘మోస‌గాళ్లు’ చిత్రానికి లాస్ ఏంజెల్స్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. 51కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘మోసగాళ్లు’ చిత్రాన్ని డా.మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో విడుదలకానుంది. 

తారాగ‌ణం:
విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్ శెట్టి, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌, రుహీ సింగ్‌ తదితరులు
సాంకేతిక బృందం:
ద‌ర్శ‌క‌త్వం: జెఫ్రీ గీ చిన్‌
నిర్మాత‌: విష్ణు మంచు
బ్యాన‌ర్‌: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ, ఎవిఎ ఎంటర్ టైన్ మెంట్స్
సినిమాటోగ్ర‌ఫీ: షెల్డ‌న్ చౌ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కిర‌ణ్‌కుమార్ ఎం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ ఆర్‌.

Vishnu Manchu’s Dabbe Manadi Song From Mosagallu Gets Thumbs Up

Vishnu Manchu’s high-budgeted PAN India film Mosagallu has been making quite noise. Touted to be an intelligent con drama, the film is based on Rs 2800 Crore Scam in the Indian IT Industry. The huge call center scam in India has ripped off millions of dollars of US tax payers money. With this interesting and promising premise, Vishnu will be seen paired up with Kajal Aggarwal. Already, the stills of the lead pair are grabbing attention.

The makers of Mosagallu had unveiled the lyrical video of a crucial song from the film “Dabbe Manadi Kummesko” the other day. It opened to great reception. Sam C’s music, Sirasri’s lyrics have worked in favour of the song. The song is said to have a significance in the film.

Being made with a whopping Rs 51 Crore, the makers are planning to release the film very soon on the eve of Dr Mohan Babu’s birthday. But the official confirmation is yet to come that the film will release on 19th March, 2021. Produced by Vishnu Manchu under 24 Frames Factory & AVA Entertainment and directed by Jeffrey Gee Chin, Mosagallu is going to be released simultaneously in Hindi, Tamil, Kannada and Malayalam languages along with the original Telugu.