విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, పూరిజ‌గ‌న్నాథ్, క‌ర‌ణ్‌జోహార్‌, ఛార్మీకౌర్ ల ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగ‌ర్‌లో స్టంట్ !!

విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, పూరిజ‌గ‌న్నాథ్, క‌ర‌ణ్‌జోహార్‌, ఛార్మీకౌర్ ల ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగ‌ర్‌లో స్టంట్ !!

విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, పూరిజ‌గ‌న్నాథ్, క‌ర‌ణ్‌జోహార్‌, ఛార్మీకౌర్ ల ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగ‌ర్‌లో స్టంట్ డైరెక్ట‌ర్‌గా హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ఆండీ లాంగ్.

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ‌స్ట్ ప్యాన్ ఇండియా మూవీ ‘లైగ‌ర్’ (సాలా క్రాస్‌బ్రీడ్‌). డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ రూపొందిస్తోన్న ఈ మూవీకోసం అభిమానులు, సాధార‌ణ ప్రేక్ష‌కులు అత్యంత క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు

పూరి క‌నెక్ట్స్ అసోసియేష‌న్‌తో  బాలీవుడ్ లీడింగ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

లైగర్ మూవీ ముంబైలో నిర్మించిన భారీ సెట్లో ఇటీవ‌ల షెడ్యూల్ పూర్తి చేసుకుంది. జాకీ చాన్ మ‌రియు అనేక ఇతర హాలీవుడ్ యాక్ట‌ర్స్‌తో క‌లిసి ప‌నిచేసిన  హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించిన ఇంటెన్స్ యాక్ష‌న్స్ సీక్వెన్సెస్ ను ప‌ర్య‌వేక్షించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆండీ లాంగ్ యొక్క విదేశీ బృందం ఈ యాక్షన్ సన్నివేశాల‌లో పాల్గొంది.

అతి త్వ‌ర‌లోనే నెక్ట్స్ షెడ్యూల్ జ‌ర‌ప‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌.

మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో  శిక్షణ పొందిన విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో స‌రికొత్త‌గా క‌నిపించ‌బోతున్నారు.

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్యా పాండే  హీరోయిన్‌గా న‌టిస్తోంది.

బ‌డ్జెట్ విష‌యంలో ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా, లావిష్‌గా ప్యాన్ ఇండియా లెవ‌ల్‌లో లైగ‌ర్ చిత్రాన్ని పూరి క‌నెక్ట్స్‌, ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ నిర్మిస్తున్నాయి.

క్రేజీ కాంబినేష‌న్‌తో నిర్మాణ‌మ‌వుతున్న ఈ చిత్రానికి విష్ణుశ‌ర్మ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మీ కౌర్‌, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా, హిరూ య‌శ్ జోహార్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో నిర్మాణ‌మ‌వుతోంది.

తారాగ‌ణం:
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్యా పాండే, ర‌మ్య‌కృష్ణ‌, రోణిత్ రాయ్‌, విషురెడ్డి, అలీ, మ‌క‌రంద్ దేశ్‌పాండే, గెట‌ప్ శ్రీ‌ను.

సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాతలు: క‌ర‌ణ్‌ జోహార్, ఛార్మి కౌర్‌, అపూర్వ మెహ‌తా, హిరూ య‌శ్ జోహార్ మరియు పూరి జ‌గ‌న్నాథ్‌‌.
బేనర్స్: పూరి కనెక్ట్స్‌, ధర్మా ప్రొడక్షన్స్
సినిమాటోగ్ర‌ఫీ:  విష్ణుశ‌ర్మ‌
ఎడిటింగ్‌:  జునైద్ సిద్దిఖి
ఆర్ట్‌:  జానీ షేక్ బాషా
స్టంట్ డైరెక్ట‌ర్: ఆండీ లాంగ్‌
పీఆర్ఓ: వంశీ – శేఖ‌ర్‌.

 
Hollywood Stunt Director Andy Long Roped In For Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER

Young and promising hero Vijay Deverakonda’s first Pan India film LIGER (Saala Crossbreed) being directed by dynamic director Puri Jagannadh is one of the highly anticipated films.

In association with Puri connects, the film is being produced jointly by Bollywood’s leading production house Dharma Productions.

Interim, Liger is done with a big shooting schedule in a massive set erected in Mumbai. Hollywood stunt choreographer Andy Long who worked with Jackie Chan and many other Hollywood actors is roped in to supervise an intense action sequence shot in the schedule.

Andy Long’s foreign team coming from different places of the world took part in the action sequence.

The makers are planning to begin the next shooting schedule of the film very soon.

Underwent training in mixed martial arts, Vijay Deverakonda sports a completely new look in the film.

Bollywood actress Ananya Pandey is playing the female lead opposite Vijay Deverakonda in the film billed to be an actioner.

Given it is a Pan India film, Puri connects and Dharma Productions are making the film on a grand scale without compromising on budget.

The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma.

Puri Jagannadh, Charmme Kaur, Karan Johar, Apoorva Mehta and Hiroo Yash Johar together are bankrolling the film.

Ramya Krishnan plays a prominent role in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.

Cast: Vijay Deverakonda, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Aali, Makarand Desh Pandey and Getup Srinu.

Technical Crew:
Director: Puri Jagannadh
Producers: Karan Johar, Charmme Kaur, Apoorva Mehta, Hiroo Yash Johar and Puri Jagannadh
Banners: Dharma Productions and Puri Connects
DOP: Vishnu Sarma
Art Director: Jonny Shaik Basha
Editor: Junaid Siddiqui
Stunt Director: Andy Long