‘ట‌క్ జ‌గ‌దీష్‌’లోని రెండో పాట “కోలో కోల‌న్న కోలో” లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌

‘ట‌క్ జ‌గ‌దీష్‌’లోని రెండో పాట “కోలో కోల‌న్న కోలో” లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌

నాని, శివ నిర్వాణ‌, షైన్ స్క్రీన్స్ ‘ట‌క్ జ‌గ‌దీష్‌’లోని రెండో పాట “కోలో కోల‌న్న కోలో” లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌

నేచురల్ స్టార్ నాని  హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ 2021లో ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

టాప్ ఫామ్‌లో ఉన్న ఎస్‌. త‌మ‌న్ సినిమాలో సంద‌ర్భానుసారం వ‌చ్చే ఒక పాట‌కు చ‌క్క‌ని మెలోడీ ట్యూన్స్ స‌మ‌కూర్చారు. “కోలో కోల‌న్న కోలో కొమ్మ‌లు కిల‌కిల న‌వ్వాలి..” అంటూ ప్ర‌సిద్ధ గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన ఈ మోటివేష‌న‌ల్ సాంగ్‌ను అర్మాన్ మాలిక్‌, హ‌రిణి ఇవ్వ‌టూరి, శ్రీ‌కృష్ణ‌, త‌మ‌న్ క‌లిసి ఆల‌పించారు. నాని ఫ్యామిలీపై ఈ పాట‌ను చిత్రీక‌రించారు. కుటుంబ అనుబంధాల‌ను తెలియ‌జేస్తూ, చిన్న‌నాటి కేరింత‌ల్ని గుర్తుచేస్తూ, హీరోను మోటివేట్ చేస్తూ ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఈ పాట‌ను ఆల‌పిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

చ‌క్క‌ని సాహిత్య విలువ‌ల‌తో, సంగీత వాయిద్యాల‌న్నీ చెవుల‌కు ఇంపుగా వినిపిస్తూ మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకొనే రీతిలో ఈ పాట ఉంది. “ఆ న‌లుగు‌రితో చెలిమి పంచుకో చిరున‌గ‌వు సిరులు పెంచుకో.. జ‌డివానే ప‌డుతున్నా జ‌డిసేనా త‌డిసేనా నీ పెద‌వుల‌పై చిరున‌వ్వులు ఎపుడైనా..” లాంటి లైన్లు సీతారామ‌శాస్త్రి గారికి కాకుండా ఎవ‌రికి సాధ్య‌మ‌వుతాయి! ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీతో దృశ్య‌ప‌రంగా ఈ పాట క‌న్నుల‌పంట‌గా ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహ‌మూ లేదు.  

ఈ పాట‌లో నానితో పాటు ఆయ‌న‌ తండ్రిగా న‌టిస్తోన్న నాజ‌ర్‌, అన్న‌గా న‌టిస్తోన్న జ‌గ‌ప‌తిబాబు, హీరోయిన్లు రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్, ఫ్యామిలీ మెంబ‌ర్స్ అయిన రావు ర‌మేష్‌, రోహిణి, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు క‌నిపిస్తున్నారు.

నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని  షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ 23న ‘ట‌క్ జ‌గ‌దీష్’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ది.

తారాగ‌ణం:
నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌,  నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌,  డానియ‌ల్ బాలాజీ,  తిరువీర్, రోహిణి,  దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
బ్యాన‌ర్‌: షైన్ స్క్రీన్స్‌
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)
కో- డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌ణ్‌ ముసులూరి
క్యాస్టూమ్ డిజైన‌ర్‌: నీర‌జ కోన‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

 
Nani, Shiva Nirvana, Shine Screens Tuck Jagadish’s 2nd Song Kolo Kolanna Kolo Lyrical Video Out

Tuck Jagadish starring Natural Star Nani is one of the most awaited films in 2021. The successful combination of Nani and Shiva Nirvana after Ninnu Kori is back with the film which is billed to be a wholesome family entertainer with adequate commercial elements.

S Thaman who is in top form has tuned a fresh melody suiting the situation. The song has enough depth in lyrics and the instrumental music makes it a soothing melody. Armaan Malik, Harini Ivvanturi, Sri Krishna and Thaman’s magical voices make the song even more beautiful. The legendary lyricist Sirivennela Seetharama Sastry has penned lyrics for the song which will be pleasing to watch with visuals on screen.

Ritu Varma, Aishwarya Rajesh who played the heroines and Jagapathi Babu who played Nani’s brother are also seen in the song.

The 26th film of Nani is produced jointly by Sahu Garapati and Harish Peddi under Shine Screens Banner.

Tuck Jagadish is gearing up to hit the screens on April 23rd.

Cast: Nani, Ritu Varma, Aishwarya Rajesh, Nasser, jagapathi babu, Rao ramesh, Naresh, Daniel Balaji, Tiruveer, Rohini, Devadarsini, Praveen and others.

Crew:
Written& Directed by: Shiva Nirvana
Producers: Sahu Garapati and Harish Peddi
Music Director: S Thaman
Cinematography: Prasad Murella
Editor: Prawin Pudi
Art: Sahi Suresh
Fights: Venkat
Executive Producer: S.Venkatarathnam (Venkat)
Co-Director: Laxman Musuluri
PRO: Vamshi-Shekar
Publicity Designer: Siva Kiran (Working Title)
Costume Designer: Neeraja Kona