‘తెలంగాణ దేవుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ !!

‘తెలంగాణ దేవుడు’  ప్రీ రిలీజ్ ఈవెంట్ !!

‘తెలంగాణ దేవుడు’ చిత్రం పెద్ద విజయం సాధించాలి: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలంగాణ హోం మినిస్టర్ మొహమ్మద్ అలీ

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం ఓ స్ఫూర్తి ప్రదాయకం. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు.1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవిత చరిత్రే ‘తెలంగాణ దేవుడు’. ఫ్రెండ్లీ స్టార్‌ శ్రీకాంత్ టైటిల్‌ పాత్రలో జిషాన్ ఉస్మాన్ హీరోగా (నూతన పరిచయం), హీరోయిన్ సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, మధుమితతో పాటు 50 మంది అగ్ర తారాగణం ఈ చిత్రంలో నటించారు. వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ హోం శాఖా మంత్రి వర్యులు మొహమ్మద్ అలీ, మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్.. చిత్ర ట్రైలర్స్‌ను విడుదల చేశారు. చిత్ర నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ ఈ చిత్రంలోని మొదటి పాట ‘వాడెవడు వీడెవడు’ సాంగ్‌ను విడుదల చేశారు. అప్పాజి రెండవ పాటను విడుదల చేశారు. ‘జై తెలంగాణ’ అంటూ సాగే మూడవ పాటను ప్రభాకర్ విడుదల చేశారు. ‘తెలంగాణ అమరులకు వందనం’ అంటూ సాగే నాలుగవ పాటను ప్రముఖ నిర్మాత, నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి విడుదల చేశారు.

కేసీఆర్ బయోపిక్‌కు ‘తెలంగాణ దేవుడు’ టైటిలే కరెక్ట్‌: తెలంగాణ హోం మినిస్టర్ మొహమ్మద్ అలీ
అనంతరం తెలంగాణ హోం మినిస్టర్ మొహమ్మద్ అలీ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము అంటే దానికి ముఖ్య కారణం కేసీఆర్ గారు. అందరికీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చేస్తారనే డౌట్ ఉండేది. తెలంగాణ రాకముందు కేసీఆర్‌గారు పార్లమెంట్‌లో రిప్రజెంట్ చేసి ఎంపీలను, 36 పార్టీల ప్రెసిడెంట్‌లను కలిసి రిక్వెస్ట్ చేస్తే అందరూ కూడా తెలంగాణ చాలా వెనుకబడింది. మీ దగ్గర పవర్ లేదు, ఫార్మర్స్ సూసైడ్ చేసుకొంటున్నారు, ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు మీరెలా అభివృద్ధి చేస్తారని అందరూ క్వశ్చన్ చేశారు. తెలంగాణ సాధించిన తర్వాత ఈ రోజు అన్ని రంగాలను ప్రగతి పథంలో తీసుకెళుతూ కేసీఆర్‌గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 2002 చంద్రబాబు పాలనలో రైతులు రెండు గంటల కరెంట్ ఎక్కువ కావాలని దీక్ష చేస్తూ.. ప్రభుత్వాన్నీ నిలదీస్తే ఫైరింగ్ చేసి పది మంది రైతుల మరణానికి కారణమైనాడు. అలాంటిది ప్రస్తుతం రైతులకు రైతు భీమా ఏర్పాటు చేసి వారికి కేసీఆర్‌గారు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అలాగే పవర్‌ విషయంలో తెలంగాణ నెంబర్ వన్‌లో ఉంది. ఫ్లోరైడ్ నీరు ఎక్కువ ఉండే నల్గొండలో ఇంటింటికి మంచి నీరిచ్చారు. ఇలా అందరికీ మంచి చేసుకుంటూ కేసీఆర్‌ను వంకపెట్టే ఛాన్స్ ఇవ్వకుండా తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్‌గా తీసుకువచ్చారు. ఎంతో కష్టపడి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ బయోపిక్‌కు ‘తెలంగాణ దేవుడు’ టైటిలే కరెక్ట్‌గా సూట్ అయ్యింది. తెలంగాణ ఉద్యమం గురించి తెలియజేసే సినిమా ఫంక్షన్‌కు మమ్మల్ని ఆహ్వానించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. వారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను..’’ అని అన్నారు.

కేసీఆర్ నిజంగా ‘తెలంగాణ దేవుడే’: తెలంగాణ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్
ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నో అవమానాలు, ఇబ్బందులు పడి తెలంగాణను సాధించుకున్నాము. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఆ నాటి ఉద్యమం గుర్తుకొస్తుంది. తెలంగాణ వస్తే ఆంధ్ర.. తెలంగాణలో చాలా కోట్లాటలు వస్తాయి, నదుల కోసం గొడవలు జరుగుతాయని పుకార్లు పుట్టించారు. ఒకప్పుడు తినడానికి ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు బియ్యం సరఫరా అయ్యేవి. తెలంగాణ సాధించుకున్న తర్వాత అన్ని రంగాల్లో ముందుకు వెళుతూ.. ఇప్పుడు తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు బియ్యం సరఫరా అయ్యేలా రాష్ట్రం అభివృద్ధి చెందడమేగాక దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం.. అంటే మనం ఎంత ప్రగతి పథంతో ముందుకు దూసుకువెళ్తున్నామో తెలుస్తోంది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో నేను, మొహమ్మద్ అలీగారితో పాటు ఎంతో మంది ఉద్యమంలో తోడుగా నిలిచాము. ఈ రోజు కూడా ఆయన నాయకత్వంలో నేను మంత్రిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. 70 సంవత్సరాల పాలనలో తెలంగాణలో కరెంటు కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాము. తెలంగాణ సాధించుకున్న తరువాత అన్ని సమకూర్చుకోవడమే కాక దేశంలో లేని ఎన్నో పతకాలు కేసీఆర్ గారు ప్రవేశ పెట్టారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, ఒక కుంట భూమి ఉన్న రైతు చనిపోతే ఐదు లక్షలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలు పెట్టిన కేసీఆర్ నిజంగా ‘తెలంగాణ దేవుడే’. ఇక్కడ ప్రతి వర్గానికి, ప్రతి కులానికి మంచి జరిగే కార్యక్రమం కేసీఆర్ చేస్తుంటే అదిచూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ అన్ని రంగాల్లో రాణిస్తూ దేశానికే తెలంగాణ మార్గదర్శకంగా నిలిచింది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని ఇతర దేశాలు చెప్పుకొనే స్థాయికి ఎదిగింది. అలాగే ఆనాడు సినిమా తీయాలి అంటే సినిమా ఇండస్ట్రీ కొంతమంది చేతుల్లోనే ఉండేది వాళ్లు తీస్తేనే థియేటర్స్ ఓపెన్ అయ్యి సినిమాలు ఆడాలి అనే పరిస్థితి ఉండేది అది ఇప్పుడు మారుతూ వస్తుంది. దానిలో కూడా ఇంకా మార్పును తీసుకు వస్తాము. తెలంగాణ రాక ముందు వచ్చిన తరువాత అభివృద్ధి గురించి తెలియజేస్తూ ప్రజలకు తెలంగాణ గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాటి మీద కూడా సినిమాలు తీయాలి. ఇలాంటి మంచి సినిమాలు ఎవరు తీసినా ప్రభుత్వం అన్ని రకాలూగా సపోర్ట్ గా నిలుస్తూ వారికి కావలసిన సహాయ,సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. నా మిత్రుడు హీరో శ్రీకాంత్ మా నాయకుడు కేసీఆర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. వారికి మరియు దర్శకనిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పక నచ్చుతుంది’’ అన్నారు.

‘తెలంగాణ దేవుడు’ టైటిల్ శుభపరిణామం: ఆర్. నారాయణమూర్తి
ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో దాసరిగారి శిష్యులు ఎంతో మంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద దర్శకులై ఇప్పటికీ ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నారు. దాసరిగారి శిష్యుల దగ్గర శిష్యరికం చేసిన హరీష్ కూడా వారిలాగే ఈ సినిమాతో పెద్ద దర్శకుడవ్వాలి. కేసీఆర్ బయోపిక్ పాత్రలో శ్రీకాంత్ అద్బుతంగా నటించాడు. ఈ చిత్రానికి ఎంతో మంది పెద్ద టెక్నిషియన్స్ వర్క్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి వారు చేసిన కృషిని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు హరీష్ ‘తెలంగాణ దేవుడు’ టైటిల్ పెట్టడం చాలా శుభపరిణామం. ఈ సినిమా గొప్ప విజయం సాధించి చిత్రయూనిట్‌కు మంచిపేరు రావాలి..’’ అని అన్నారు.

నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కోసం కష్టపడి ప్రత్యేక తెలంగాణను సాధించిన కె.సి.ఆర్ గారి బయోపిక్‌ను తీసినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను..’’ అన్నారు.

దర్శకుడు వడత్యా హరీష్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకానుంది. ఈ చిత్రం అందరికీ తప్పక నచ్చుతుంది..’’ అన్నారు.
 
సంగీత దర్శకుడు నందన్ బొబ్బిలి మాట్లాడుతూ.. ‘‘ఇంత గొప్ప సినిమాకు మ్యూజిక్ ఇచ్చే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సాంగ్స్ ఇంత బాగా రావడానికి టీం అందరి సహకారం ఎంతో ఉంది. శ్రీకాంత్‌గారు, దర్శకనిర్మాతలు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నాకీ అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు’’ అని అన్నారు.

హీరో జిషాన్ ఉస్మాన్(తొలి పరిచయం) మాట్లాడుతూ.. గొప్పచరిత్ర కలిగిన ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

మాక్స్‌ల్యాబ్ సీఈవో మొహమ్మద్ ఇంతెహాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి ప్రస్పుటంగా ఈ చిత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ చిత్రంతో నిర్మాత మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారి అబ్బాయి జిషాన్ ఉస్మాన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాము. కొత్తవాడైనా అద్భుతంగా నటించాడు. అందరి సహకారంతో పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23 విడుదల చేస్తున్నాము. ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని చూసి విజయవంతం చేయాలని కోరుతున్నాను..’’ అన్నారు

లైన్ ప్రొడ్యూసర్ మెహమూద్ ఖాన్ మాట్లాడుతూ.. మేము అనుకున్న దానికంటే చిత్రం బాగా వచ్చింది. ఇలాంటి చరిత్ర కలిగిన సినిమా తీసిననందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు

కేసీఆర్‌గారి పాత్రలో అనగానే షాకయ్యా: హీరో శ్రీకాంత్
కేసీఆర్ పాత్రలో నటించిన హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘పెద్దలు మొహమ్మద్ అలీగారికి, నా ఆప్తులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఆర్. నారాయణమూర్తిగారికి.. మమ్మల్ని, మా సినిమాను బ్లేస్ చేయడానికి వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు. దర్శకుడు హరీష్ నన్ను కలిసి కేసీఆర్‌గారి బయోపిక్ సినిమా చేస్తున్నానని చెప్పి, ఆయన పాత్రలో నువ్వు నటించాలని చెప్పినపుడు షాక్ అయ్యాను. నేను ఆయన పాత్రలో నటించగలనా? లేదా? ఆయన పాత్రకు నేను సూట్ అవుతానా? అనే ఆలోచనతో కొంత టైమ్ తీసుకొని ఎలా చేస్తే బాగుంటుందా అని డిస్కషన్ చేసి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. దేశాన్ని సాధించిన మహాత్మాగాంధీని జాతిపిత అంటారు. తెలంగాణను సాధించిన కేసీఆర్‌గారు కూడా ఒకరకంగా తెలంగాణ దేవుడే. అలాంటి కేసీఆర్ రోల్ నాకు లభించినందుకు ఈ రోజు నేను నిజంగా గర్వపడుతున్నాను. ఆ రోజు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోకుంటే ఇలాంటి మంచి సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకునే వాడిని. థాంక్స్ హరీష్. ఈ సినిమాలో 50 మంది ఆర్టిస్టులు నటించారు. ఈ సినిమా కరోనా కంటే ముందు స్టార్ట్ అయ్యింది. కానీ వారందరి డేట్స్ సెట్ అవ్వక సినిమా ఆలస్యం అయ్యింది. ఇంత మంచి సబ్జెక్ట్‌ను, ఎంతో మంది ఆర్టిస్టులతో మంచి ప్రొడక్షన్ వేల్యూస్‌తో నిర్మాత జాకీర్ ఉస్మాన్ గారు ఎంతో ప్యాసినెట్‌గా ఖర్చుకు వెనుకాడకుండా చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించారు. వారికి స్పెషల్ థ్యాంక్స్. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. జిషాన్‌కు ఇది ఫస్ట్ ఫిల్మ్ అయినా చాలా చక్కగా నటించాడు. తను ఫ్యూచర్‌లో మంచి హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 23న విడుదల అవుతున్న ఈ సినిమా చూడడానికి వచ్చే ప్రతి ప్రేక్షకుడు కోవిడ్ ప్రికాషన్స్ తీసుకొని సినిమాను విజయవంతం చేయాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఇలాంటి మంచి చిత్రం కోసం హాట్ ఫుల్‌గా పనిచేశాము. రియలిస్టిక్‌గా నిర్మించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు

ఫ్రెండ్లీ హీరో శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు
మూల కథ, నిర్మాత: మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్
రచన, దర్శకత్వం: వడత్యా హరీష్
మ్యూజిక్: నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్: గౌతంరాజు
లైన్ ప్రొడ్యూసర్: మెహమూద్ ఖాన్
మాక్స్‌ల్యాబ్ సిఈఓ: మొహమ్మద్ ఇంతెహాజ్‌ అహ్మద్‌
పీఆర్వో: బి.ఎస్‌. వీరబాబు

Home minister Mahmood Ali wishes luck to “Telangana Devudu” movie team

Telangana Movement is one of the greatest movements of Independent India. It happened started in 1969 and ended in 2014 with the birth of Telangana state. The new born State’s first Chief Minister Kalvakuntla Chandrasekhar Rao, popularly known as KCR is one of the most revered leaders of the Telangana people. To tell the story of the greatest activist and his journey to make the Telangana dream come true, director Vadatya Harish made a movie titled “Telangana Devudu”. Friendly star Srikanth portrayed the title role of KCR in the movie. Jishan Kishan (First appearance), Sangeetha, Brahmanandam, Sunil, Suman, Tanikella Bharani, Brahmaji, Madhumitha etc., are the cast of the film. The movie produced under Max lab Pvt Ltd banner had completed all procedures and ready to hit the silver screen on 23rd April. In this auspicious occasion film unit held a pre-release event at Prasad Labs in Hyderabad. State Home Minister Mahmood Ali, Srinivas Goud attended the event.

Mahmood Ali wished luck to the film unit and wanted the movie to be a huge success. “KCR played a huge role in winning Telangana State for people. There were many doubts about the progress of the State but after becoming CM of the State, KCR erased all those doubts with his development plans. He very well deserves the title of ‘Telangana Devudu’ (God of Telangana)”, said the Home Minister.

State Minister Srinivas Goud also praised the filmmakers for their efforts to bringing the story of the people’s hero to big screen. He said that the movie trailer reminded him of the movement days. In the leadership of KCR, me and present Home Minister Mahmood Ali all put a great effort in Telangana movement, says Srinivas Goud. KCR, with all his people-friendly schemes is actually the god of the State, the minister proclaims.

Senior actor Srikanth revealed that he was shocked after hearing that he has to portray KCR on the big screen. “I had my doubts about the character. Can I do that? Am I suitable for that role? are my first thoughts after hearing Harish’s request. After much pondering I decided to take this challenge.” says the veteran artist. He praised the presence of both Telangana State Minister’s in the pre-release event. He also extended his thankfulness to director Harish, Producer Zakir Usman and all the co-actors for the wonderful movie.

People’s Star R. Narayana Murthy said the title alone can be considered as a good sign for the movie. He also exclaimed that Harish is a talented director and wished that Harish will make a good name with this film. Srikanth’s acting is flawless, extolled the senior actor.

Movie producer Zakir Usman said, KCR won the Telangana with utmost effort. And he proclaims that he is so happy for making a biographical movie about KCR. Director Vadatya Harish said that he felt very lucky to be able made such a movie. He also thanked Zakir Usman for giving him courage. He extended his gratitude to his entire team for their efforts in making this movie well-framed. Music Director Nandan Bobbili, Hero Jishan Usman(debut), Max Lab CEO Mohammad Intehaz Ahmad, line producer Mohamood Khan and others also wished best of luck to the movie team.

Cast: Srikanth, Jishan Usman (Debut), Sangeetha, Brahmanandam, Sunil, Suman, Brahmaji, Venkat, Prithvi, Raghubabu, Shayaji Shinde, Vijay Rangaraju, Benerji, Chittibabu, Madhumitha, Satyakrishna, Sana, Rajitha, ETV Prabhakar, Samir, Bus Stop Koteswar Rao, Kashi Vishwanath, Gemini Suresh, etc.
Original Story, Producer: Mohammad Zakir Usman
Writing-Direction: Vadatya Harish
Music: Nandan Bobbili
Cinematography: Adusumalli Vijay Kumar
Editor: Gautamraju
Line Producer: Mohamood Khan
Max Lab CEO: Mohammad Intehaz Ahmad
PRO: B.S. Veerababu