సంహరి చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్

సంహరి చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్

సంహరి చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్
 
శ్రీ తుల్జా భవాని గ్రూప్స్ మూవీ మేకర్స్ పతాకం పై కె. రవి కుమార్ రాణా  మరియు నేహా శ్రీ  హీరో హీరోయిన్ గా లక్ష్మి కేతావత్ మరియు రేణుక కేతావత్ సమర్పణలో కె. రవి కుమార్ రాణా  స్వయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం “సంహారి”. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ విడుదల చేసారు. ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే  విడుదల కు సిద్ధం గా ఉంది. ఈ సందర్భంగా 
 
ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ “రవి కుమార్ రాణా నిర్మించి దర్శకత్వం వహించిన సంహరి సినిమా ట్రైలర్ చూసాను. మంచి థ్రిల్లర్ గా అనిపించింది. ఈ సినిమా విజయవంతం అవ్వాలి అని రవి కుమార్ రాణా సక్సెస్ కావాలి అని కోరుకుంటూ యూనిట్ సభ్యులందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. 
 
హీరోయిన్ నేహా శ్రీ  మాట్లాడుతూ “ఈ సంహారి సినిమా లో నాకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాత మరియు హీరో కె. రవి కుమార్ రాణా  గారికి ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది” అని తెలిపారు.
 
ఈ చిత్ర దర్శకుడు, హీరో మరియు నిర్మాత కె. రవి కుమార్ రాణా మాట్లాడుతూ “మా సంహరి చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ధన్యవాదాలు. సంహారి సినిమా విడుదల కి సిద్ధంగా ఉంది. ఇది ఒక్క క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్. ప్రతి ప్రేక్షకుడికి ఖచ్చితంగా నచ్చుతుంది. నా చిత్రానికి పని చేసిన ప్రతి టెక్నీషియన్ కి నా ధన్యవాదాలు. త్వరలోనే సినిమా ని విడుదల చేస్తాము” అని తెలిపారు. 
 
సినిమా పేరు : సంహారి
 
నటి నటులు : కె. రవి కుమార్ రాణా, నేహా శ్రీ 
 
కెమెరా మాన్  : అంజి బాబు, కృష్ణ నాయుడు 
 
సంగీతం : రాజ్ కిరణ్ 
 
ఎడిటింగ్ : వంశీ పెళ్లూరి 
 
ఫైట్స్ : అశోక్ రాజ్ 
 
డాన్స్ మాస్టర్ : ఉమా శంకర్, మనోజ్ పెద్ది 
 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : కె. రవి కుమార్ రాణా