`జయమ్మ పంచాయతీ` ఏప్రిల్ 22న విడుదల !!

సుమ కనకాల ప్ర‌ధాన పాత్ర‌లో విజయ్ కుమార్ కలివరపు ద‌ర్శ‌క‌త్వంలో వెన్నెల క్రియేషన్స్ పై రూపొందుతోన్న `జయమ్మ పంచాయతీ` ఏప్రిల్ 22న విడుదల !! ప్రముఖ యాంకర్, టెలివిజన్ ప్రెజెంటర్, హోస్ట్ సుమ కనకాల న‌టించిన తాజా చిత్రం `జయమ్మ పంచాయితీ` విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. సమ్మర్‌లో వచ్చే  సినిమాల‌ను చూసుకుని  చివరకు ఏప్రిల్ 22తో విడుద‌ల‌కు ఫిక్స్ అయినట్టు ఓ ఆహ్లాద‌ర‌క‌ర‌మైన వీడియో ద్వారా వారు తేదీని ప్రకటించారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ పల్లెటూరి డ్రామా చిత్రం టీజర్, పాటలతో చాలా ఆసక్తిని రేకెత్తించింది. వారు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో ముందుకు రావడం ద్వారా ప్రమోషన్‌లను చేస్తున్నారు.

Read more