గాలి సంప‌త్’‌, ‘జాంబీ రెడ్డి’ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ఆహా డ‌బుల్ ధ‌మాకా

  గాలి సంప‌త్’‌, ‘జాంబీ రెడ్డి’  చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ఆహా డ‌బుల్ ధ‌మాకా  100% తెలుగు ప్లాట్‌ఫామ్ ఆహా తన ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. క్రాక్ మరియు నాంది వంటి ప్రత్యేకమైన బ్లాక్ బస్టర్‌లతో భారీ సంచలనం సృష్టించిన తరువాత, ఆహా ఇప్పుడు గాలి సంపత్, జాంబీ రెడ్డి వంటి వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మైంది. ఆహాలో మార్చి 19న గాలి సంప‌త్ విడుద‌లవుతుంటే.. మార్చి 26న జాంబీ రెడ్డి విడుద‌ల‌వుతుంది. ఈ వారాంతంలో ఈ చిత్రాలు ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇళ్ల‌కు తీసుకురాబోతున్నాయి.   న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్‌, యువ క‌థానాయ‌కుడు శ్రీ విష్ణు న‌టించిన గాలి సంప‌త్ సినిమా ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. అలాగే వైవిధ్య‌మైన జోన‌ర్‌లో తెర‌కెక్కిన జాంబీరెడ్డి చిత్రానికి ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆద‌రించారు. విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను చూడాల‌నుకునే ప్రేక్ష‌కుల‌ను ఆహాలో ఈ చిత్రాలు మెప్పించ‌నున్నాయి.  ఆహా ప్రారంభమైన అతి కొద్ది రోజుల్లోనే ప్రతి తెలుగువాడి ఇంటిలో భాగమైందనే చెప్పాలి. సూపర్ స్టార్స్ , క్లాసిక్ సినిమాల భారీ లైబ్రరీ ఆహా సొంతం. ప్రేక్షకులను తనదైన శైలిలో ఎంటర్‌టైన్ చేస్తున్న ఆహా భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేకమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. Double dhamaka Fridays on aha with Gaali Sampath and Zombie Reddy The 100% Telugu

Read more