దుబాయ్ లో ప్రారంభమైన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు `స‌ర్కారు వారి పాట’ షూటింగ్

దుబాయ్ లో ప్రారంభమైన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు `స‌ర్కారు వారి పాట’ షూటింగ్

దుబాయ్ లో ప్రారంభమైన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు `స‌ర్కారు వారి పాట’ షూటింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా టాలెంటెడ్ డైరెక్డ‌ర్ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని అధికారికంగా తెలియ‌జేస్తూ `ది ఆక్ష‌న్ అండ్ ది యాక్ష‌న్ బిగిన్స్` అంటూ ఒక వీడియో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ సంద‌ర్భంగా..

చిత్ర ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ పెట్ల మాట్లాడుతూ – “సర్కారు వారి పాట` మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభ‌మైంది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు గారిని డైరెక్ట్‌ చేయాల‌న్న ఇన్నేళ్ళ నా క‌ల ఈ రోజు నిజ‌మైంది. మహేష్ బాబు గారితో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.  ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను. డెఫినెట్‌గా ప్రేక్షకుల, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇర‌వై రోజుల పాటు దుబాయ్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం“ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఎస్.ఎస్ మాట్లాడుతూ – “స‌ర్కారు వారి పాట రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైన సంద‌ర్భంగా టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి,
సంగీతం: త‌మన్ ఎస్‌.ఎస్‌,
సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి,
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్,
ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్,
ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్,
పిఆర్ఓ: బి.ఏ.రాజు,  
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్,
కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్,    
సీఈఓ: చెర్రీ,
నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.

 
Superstar Mahesh Babu’s ‘Sarkaru Vaari Paata’ Shoot Begins At Dubai

Superstar Mahesh Babu starrer big-budgeted ‘Sarkaru Vaari Paata’ is Directed by Talented Director Parasuram Petla. Mythri Movie Makers, GMB Entertainments, 14 Reels Plus are jointly producing this prestigious movie. Keerthy Suresh is the heroine. Latest Music Sensation Thaman S.S. is composing the music. The regular shoot of this film started today at Dubai. Team has released a video stating that ‘The Auction and The Action Begins’ announcing the commencement of movie’s shoot. On this occasion..

Director Parasuram said, ” The regular shoot of ‘Sarkaru Vaari Paata’ begins today at Dubai. My dream to direct Superstar Mahesh Garu comes true with ‘Sarkaru Vaari Paata’ today. I am very excited to work with Mahesh Babu Garu. This film is very challenging to me. This film will be on a big scale and definitely will match the expectations of audience and Superstar Mahesh Babu’s fans. A 30 days first schedule will be shot in Dubai. We will announce the details of other artists and technicians soon.

Superstar Mahesh Babu, Keerthy Suresh, Vennela Kishore, Subbaraju and other prominent actors as the principal cast.

Music: Thaman S.S.
Cinematography: Madhi
Editor: Marthand K Venkatesh
Art Director: AS Prakash
Fight Masters: Ram – Laxman
PRO: B.A. Raju
Line Producer: Raj Kumar
Co-Director: Vijaya Ram Prasad
CEO: Cherry
Producers: Naveen Yerneni, Ravi Shankar Yelamanchili, Raam Achanta, Gopi Achanta
Written & Directed by Parasuram Petla