అడివి శేష్ ‘మేజర్’ ఫస్ట్ సింగిల్ ‘హృదయమా’

అడివి శేష్ ‘మేజర్’ ఫస్ట్ సింగిల్ ‘హృదయమా’

సూపర్ స్టార్ మహేష్ బాబు, దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసిన అడివి శేష్ ‘మేజర్’ ఫస్ట్ సింగిల్ ‘హ‌ృదయమా’

అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా మేజర్ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.

మేజర్ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ హృదయమా అనే పాటతో మొదలుపెట్టారు. తెలుగు పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా.. మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు.

అడివి శేష్ సాయీ మంజ్రేకర్ మధ్య రొమాంటిక్‌గా ఈ హృదయమా అనే పాట కొనసాగనుంది. శ్రీచరణ్ పాకాల అద్బుతమైన మెలోడి ట్యూన్‌ను అందించగా.. సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సరిహద్దుల్లో మేజర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే.. అతని కోసం ఎదురుచూసే ప్రేయసి పాడుకున్నట్టుగా ఈ పాట సాగుతుంది. వారు తమ ప్రేమను లేఖల ద్వారా వ్యక్త పరుచుకుంటూ ఉంటారు. ఇక ఈ లిరికల్ వీడియోలో వారిద్దరి చిన్న నాటి జ్ఞాపకాలను కూడా చూపించారు. ఈ పాటలో మేజర్, ఇషాల మధ్య ప్రేమను అద్భుతంగా చూపించారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మేజర్ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మేజర్ సందీప్ బాల్యాన్ని, యవ్వనాన్ని కూడా చూపించనున్నారు. ముంబై అటాక్, మేజర వీర మరణం వంటి సన్నివేశాలన్నీ ఇందులో చూపించబోతోన్నారు.

ఇప్పటికే  విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. విజువల్స్, టీజర్‌లోని ఎమోషన్స్ సినిమా మీద అంచనాలు పెంచాయి.

శోభితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Superstar Mahesh Babu, Dulquer Salmaan Released Adivi Sesh Major’s First Single Hrudayama

Actor Adivi Sesh’s first Pan India film Major is getting ready for its release. Currently, the film is in last leg of post-production. Directed by Sashi Kiran Tikka, the film was shot simultaneously in Telugu, Hindi and it will also be released in Malayalam.

The film’s musical promotions begin with first single Hrudayame is out now. Superstar Mahesh Babu launched the song in Telugu, while Dulquer Salmaan released it in Malayalam.

Hrudayame, as the title suggests, is a romantic song on the lead pair- Adivi Sesh and Saiee Manjrekar. Sricharan Pakala has come up with a cool and mellifluous number, while sensational singer Sid Sriram brings special charm with his expressive singing.

While Major is on duty at the border, his sweetheart has been waiting to meet him. They share their feelings through love letters. They even share their photographs which show month and year on them. The visuals show both memorizing their past and unforgettable time together, since their schooling days. Words can’t describe when they finally meet at the costume party. The song has so much love and it shows the beautiful love story of Major and Isha.

Bringing to screen the untold story of Major Sandeep Unnikrishnan, the multilingual film ‘Major’ traces the journey of Major Sandeep from childhood, teenage, glorious years in the army to the tragic events of the Mumbai attack where he martyred, touching upon the different aspects of his being.

Mounted on a large scale, the team earlier shared the teaser, with a surge of emotions, the visually stunning teaser struck a chord with the audience generating anticipation for the film.

Sobhita Dhulipala, Saiee Manjrekar, Prakash Raj, Revathi and Murli Sharma are the other prominent cast of the filmproduced by Sony Pictures Films India in association with Mahesh Babu’s GMB Entertainment and A+S Movies.