శ్రీ‌విష్ణు, చైత‌న్య దంతులూరి, వారాహి చ‌ల‌న‌చిత్రం ఫిల్మ్ ‘భ‌ళా తంద‌నాన’ ప్రారంభం

శ్రీ‌విష్ణు, చైత‌న్య దంతులూరి, వారాహి చ‌ల‌న‌చిత్రం ఫిల్మ్ ‘భ‌ళా తంద‌నాన’ ప్రారంభం

 

శ్రీ‌విష్ణు, చైత‌న్య దంతులూరి, వారాహి చ‌ల‌న‌చిత్రం ఫిల్మ్ ‘భ‌ళా తంద‌నాన’ ప్రారంభం

ప్ర‌తిసారీ వైవిధ్య‌భ‌రిత‌మైన స్క్రిప్ట్‌, క్యారెక్ట‌ర్‌తో ఇంప్రెస్ చేసే కొద్దిమంది టాలీవుడ్ న‌టుల్లో శ్రీ‌విష్ణు ఒక‌రు. ఎప్పుడూ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌నే ఎంచుకుంటూ ఉంటార‌ని పేరుపొందిన ఆయ‌న‌ మ‌రో ఆస‌క్తిక‌ర కాన్సెప్ట్‌తో మ‌న ముందుకు రానున్నారు.

‘బాణం’ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మై అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న చైత‌న్య దంతులూరి ఇప్పుడు మ‌రో సూప‌ర్బ్ స్క్రిప్ట్‌తో, ఇదివ‌ర‌కు ఎన్న‌డూ చేయ‌ని రోల్‌లో శ్రీ‌విష్ణును ప్రెజెంట్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

నిర్మించిన ప్ర‌తి చిత్రంతో వార్త‌ల్లో నిలుస్తూ వ‌చ్చే ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న‌చిత్రం నిర్మించే ఈ చిత్రానికి ‘భ‌ళా తంద‌నాన’ అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌ ఖ‌రారు చేశారు. త‌న చిత్రాల‌కు స్వ‌చ్ఛ‌మైన తెలుగు పేర్ల‌ను పెట్టే చైత‌న్య దంతులూరి ఇప్పుడు స్క్రిప్టుకు స‌రిగ్గా స‌రిపోయే, విన‌గానే కుతూహ‌లం రేకెత్తే టైటిల్ పెట్టారు.

మంగ‌ళ‌వారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ‘భ‌ళా తంద‌నాన’ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్రముఖ‌ ర‌చ‌యిత‌, శ్రీ‌శైల దేవ‌స్థానం మాజీ ప్ర‌ధాన స‌ల‌హాదారు పురాణ‌పండ శ్రీ‌నివాస్ క్లాక్ నివ్వ‌గా, య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి కెమెరా స్విచ్చాన్ చేశారు. స్క్రిప్టును శ్రీ‌వ‌ల్లి (కీర‌వాణి స‌తీమ‌ణి), ర‌మ (రాజ‌మౌళి స‌తీమ‌ణి) సంయుక్తంగా అందించారు. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో హీరో నారా రోహిత్‌, నిర్మాత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది పాల్గొన్నారు.

శ్రీ‌విష్ణు స‌ర‌స‌న నాయిక‌గా తొలిసారి కేథ‌రిన్ ట్రెసా న‌టించే ఈ చిత్రంలో ‘కేజీఎఫ్‌’లో విల‌న్ గ‌రుడ‌గా న‌టించి, అంద‌రి ప్ర‌శంస‌లూ అందుకున్న రామ‌చంద్ర‌రాజు విల‌న్ రోల్ చేస్తున్నారు.

మార్చిలో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌య్యే ఈ చిత్రాన్ని సాయి కొర్ర‌పాటి స‌మ‌ర్పిస్తుండ‌గా, ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు.

మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి సురేష్ ర‌గుతు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, శ్రీ‌కాంత్ విస్సా సంభాష‌ణ‌ల ర‌చ‌యిత‌గా, మార్తాండ్ కె. వెంక‌టేష్ ఎడిట‌ర్‌గా, గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

తారాగ‌ణం:
శ్రీ‌విష్ణు, కేథ‌రిన్ ట్రెసా, రామ‌చంద్ర‌రాజు

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: చైత‌న్య దంతులూరి
నిర్మాత‌: ర‌జ‌ని కొర్ర‌పాటి
స‌మ‌ర్ప‌ణ‌: సాయి కొర్ర‌పాటి
బ్యాన‌ర్‌: వారాహి చ‌ల‌న‌చిత్రం
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
ఎడిటింగ్‌: మార్తాండ్ కె. వెంక‌టేష్‌
సినిమాటోగ్ర‌ఫీ: సురేష్ ర‌గుతు
ఆర్ట్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌
ర‌చ‌న‌: శ్రీ‌కాంత్ విస్సా
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

 
 
Sree Vishnu, Chaitanya Dantuluri, Vaaraahi Chalana Chitram’s Bhala Thandanana Launched Today

Every actors prefers to do pucca commercial entertainers that will boost their career and help them reaching next level of stardom. There are only few actors in Tollywood who are impressing every time with unusual scripts and Sree Vishnu is one among them.

The versatile actor who is only choosing films with novel scripts has signed yet another interesting project. Director Chaitanya Dantuluri who made great impression with his debut flick Baanam has readied an exceptional script to present Sree Vishnu in a never seen before role.

The super special film from the super talented team is titled interestingly as Bhala Thandanana. Chaitanya Dantuluri likes his films to have pure Telugu titles and Bhala Thandanana is another appealing title.

Catherine Tresa is zeroed in as the female lead opposite Sree Vishnu in the film that will have Ramachandra Raju who frightened with his villainy in KGF as the main antagonist.

Popular production house Vaaraahi Chalana Chitram will be bankrolling the film to be presented by Sai Korrapati. Rajani Korrapati is the producer.

Melody Brahma Mani Sharma scores music, while Suresh Ragutu cranks the camera. Srikanth Vissa is the writer, while Marthand K Venkatesh is the editor. Gandhi Nadikudikar is the art director.

Bhala Thandanana has been launched today with formal Pooja ceremony. Popular writer, Srisaila devasthanam’s ex chief advisor Puranapanda Srinivas sounded the clap board for which the first shot is directed, camera switched on by SS Rajamouli while the script has been handed over by Valli garu, Rama garu.  The film’s regular shooting will begin from March.

Cast: Sree Vishnu, Catherine Tresa, Ramachandra Raju

Technical Crew:

Director – Chaitanya Dantuluri
Producer – Rajani Korrapati
Presents: Sai Korrapati
Banner: Vaaraahi Chalana Chitram
Music – Mani Sharma
Editor – Marthand K Venkatesh
DOP – Suresh Ragutu
Art – Gandhi Nadikudikar
Writer – Srikanth Vissa
PRO: Vamsi-Shekar