రాజ ‘శేఖర్’ లో శివానీ రాజశేఖర్ !!

రాజ ‘శేఖర్’ లో శివానీ రాజశేఖర్ !!

రాజ’శేఖర్’లో శివానీ రాజశేఖర్ !!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘శేఖర్’. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోనూ రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు.‌ వెండితెరపై తండ్రి తనయ కలిసి కనిపించనున్న తొలి చిత్రమిదే. ఈ రోజు సినిమా యూనిట్ రాజశేఖర్, శివానీ రాజశేఖర్ స్టిల్స్ విడుదల చేసింది.

హీరోగా రాజశేఖర్ 91వ సినిమా శేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన సినిమా ఇది.

దర్శకురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ఎలా ఉంటారో… సినిమాలో కూడా అలాగే ఉన్నారు. వారిద్దరూ చాలా సహజంగా చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్, లవ్ గంట మోగిందంటే పాటకు అద్భుత స్పందన లభించింది. సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామం” అని చెప్పారు.

రాజశేఖర్, ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్ , రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ, కళ: సంపత్ – దత్, రైటర్: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: వంకాయలపాటి మురళీకృష్ణ, నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి,  శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్.

Shivani Rajasekhar in Rajasekhar’s ‘Shekar’!

Angry Star Rajashekar is the hero of ‘Shekar’, which is his 91st movie. His elder daughter Shivani Rajasekhar has got a crucial role in the upcoming movie. She has played the hero’s daughter in the promising thriller. This is the first time that a father-daughter duo has acted as a father and daughter on the silver screen. On Monday, the makers of the film unveiled stills featuring the two talented actors.

Jeevitha Rajashekar is wielding the megaphone for the movie besides penning its screenplay. Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, and Boggaram Venkata Srinivas have joined hands to produce it on Pegasus Cinecorp, Taurus Cinecorp, Sudhakar Impex IPL, and Tripura Creations banners.

Speaking about the project, Jeevitha Rajasekhar said, “The scenes between Rajasekhar and Shivani are going to be a major attraction. They are natural and come across as their real-life selves. The scenes are organic and the performances are natural. We are glad that the First Glimpse and ‘Love Gante’ song have received a huge response. They and other elements will be outstanding in the film as well. Post-production works are on at the moment. The release date will be announced soon.”

Dr. Rajashekar, Aathmeeya Rajan, ‘George Reddy’ fame Muskaan Kubchandhani, Abhinav Gomatam, Kannada Kishore, Sameer, Bharani Shankar, Ravi Varma, Shravan Raghavendra, and others are the principal cast.

PRO: Naidu Surendra Kumar – Phani Kandukuri (Beyond Media); Digital Partner: Ticket Factory; Art Direction: Sampath – Dutt; Writer: Lakshmi Bhupala; Cinematographer: Mallikarjun Naragani; Music Director: Anup Rubens; Producers: Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, Boggaram Venkata Srinivas; Screenplay, Direction: Jeevitha Rajashekar.