కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫిల్మ్ ‘మ‌ను చ‌రిత్ర’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫిల్మ్ ‘మ‌ను చ‌రిత్ర’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

శివ కందుకూరి, భ‌ర‌త్ పెద‌గాని, యాపిల్ ట్రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫిల్మ్ ‘మ‌ను చ‌రిత్ర’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

యంగ్ హీరో శివ కందుకూరి న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మ‌ను చరిత్ర’ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. శివ స‌ర‌స‌న హీరోయిన్లుగా మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్ల‌మాని న‌టిస్తోన్న ఈ చిత్రంతో భ‌ర‌త్ పెద‌గాని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

శివ కందుకూరి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘మ‌ను చ‌రిత్ర’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గురువారం చిత్ర బృందం విడుద‌ల చేసింది. పోస్ట‌ర్‌లో ఫెరోషియ‌స్ అవ‌తారంలో క‌నిపిస్తున్నారు శివ‌. బాగా పెంచిన గ‌డ్డం, నోటిలో సిగ‌రెట్‌తో బైక్ న‌డుపుతున్న ఆయ‌న ఒంటినిండా గాయాలు క‌నిపిస్తున్నాయి. అలా బైక్ నడుపుతూనే కుడిచేతిలో గులాబీ పువ్వు ప‌ట్టుకుని ఉన్నారు శివ‌. ల‌వ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంద‌నే అభిప్రాయాన్ని ఈ పోస్ట‌ర్ క‌లిగిస్తోంది. ఫ‌స్ట్ లుక్‌తోటే శివ ఈ సినిమాపై ఆస‌క్తిని అమితంగా పెంచేశారు.

కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌మ‌ర్ప‌ణ‌లో యాపిల్ ట్రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఎన్‌. శ్రీ‌నివాస‌రెడ్డి, రాన్‌స‌న్ జోసెఫ్ సంయుక్తంగా ‘మ‌ను చ‌రిత్ర‌’ను నిర్మిస్తున్నారు. వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో ఇంటెన్స్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంద‌ని వారు తెలిపారు.

గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, రాహుల్ శ్రీ‌వాత్స‌వ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

తారాగ‌ణం:
శివ కందుకూరి, మేఘా ఆకాష్‌, ప్రియ వ‌డ్ల‌మాని, ప్ర‌గ‌తి శ్రీ‌వాత్స‌వ్‌, సుహాస్‌, డాలి ధ‌నంజ‌య్‌, శ్రీ‌కాంత్‌, అయ్యంగార్‌, మ‌ధునంద‌న్‌, ర‌ఘు, దేవీప్ర‌సాద్‌, ప్ర‌మోదిని, సంజ‌య్ స్వ‌రూప్‌, హ‌ర్షిత‌, గ‌రిమ‌, ల‌జ్జ శివ‌, క‌ర‌ణ్‌, గ‌డ్డం శివ‌, ప్ర‌దీప్‌.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: భ‌ర‌త్ పెద‌గాని
నిర్మాత‌లు: ఎన్‌. శ్రీ‌నివాస‌రెడ్డి, పి. రాన్‌స‌న్ జోసెఫ్‌
స‌మ‌ర్ప‌ణ‌: కాజ‌ల్ అగ‌ర్వాల్‌
బ్యాన‌ర్‌: యాపిల్ ట్రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
మ్యూజిక్‌: గోపీ సుంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాహుల్ శ్రీ‌వాత్స‌వ్‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: ఉపేంద‌ర్ రెడ్డి
సాహిత్యం: సిరాశ్రీ‌, కేకే
కొరియోగ్ర‌ఫీ: చ‌ంద్ర‌కిర‌ణ్‌
యాక్ష‌న్‌: ‘రియ‌ల్’ స‌తీష్‌, నందు
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

 
Shiva Kandukuri, Bharath Pedagani, Apple Tree Entertainments, Kajal Aggarwal’s Manu Charitra First Look Out

Young hero Shiva Kandukuri’s new film titled Manu Charitra is fast progressing with its shoot. Megha Akash and Priya Vadlamani play leading ladies opposite Shiva in the film and Bharath Pedagani is making his directorial debut.

On the occasion of Shiva Kandukuri’s birthday, first look poster of Manu Charitra is dropped. The poster sees Shiva Kandukuri in a ferocious avatar with wounds on his face and hands. Depicting his true love, he under this condition carries a rose flower on his hand. The poster is highly impressive as it presents Shina in an intense avatar.

N Sreenivasa Reddy and Ronnson Joseph are producing the film under Apple Tree Entertainments, while Kajal Aggarwal is presenting it.

Manu Charitra is Warangal backdrop intense love story.

The film has music by Gopi Sunder, while Rahul Shrivatsav is cranking the camera.

Shiva kandukuri, Megha Akash, Priya Vadlamani, Pragathi Shrivatsav, Suhas, Daali Dhananjay, Srikanth Iyengar, Madhunandan, Raghu, Devi sri Prasad, Pramodini, Sanjay Swaroop, Harshitha, Garima, Lajja Shiva, karan, Gaddam shiva, Pradeep.

Technicians List:

Written & Directed By: Bharath Pedagani
Producers: N Sreenivasa Reddy, P Ronnson Joseph
Production Banner: APPLE TREE ENTERTAINMENTS
Presents: Kajal Aggarwal
Music Director: Gopi Sunder
DOP: Rahul Shrivatsav
Art: Upender Reddy
Editor: Prawin pudi
Lyrics: Sira Sri, KK
Choreography: Chandra Kiran
Action: ‘Real’ Sathish, Nandhu
PRO: Vamsi Shekar