‘షాదీ ముబారక్‌’ మూవీ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ !!

‘షాదీ ముబారక్‌’ మూవీ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ !!

‘షాదీ ముబారక్‌’ చిత్రాన్ని అన్ని ఏజ్ గ్రూప్స్ వారు ఎంజాయ్ చేస్తున్నారు – హీరో వీర్ సాగ‌ర్‌ !!
 
స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాల‌నే కాదు.. యూత్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్ హృద‌యాలు హ‌త్తుకునేలా కూల్ అండ్ ప్లెజెంట్ మూవీస్‌ను అందిస్తూ ఎన్నోసూప‌ర్ డూప‌ర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్ నుండి వ‌చ్చిన మ‌రో ప్ల‌జంట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్  ‘షాదీ ముబారక్‌’‌. ప‌ద్మ శ్రీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మార్చి 5న గ్రాండ్‌గా విడుద‌లై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ జరిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో ..
 
హీరో వీర్ సాగ‌ర్ మాట్లాడుతూ – “ ఈ జ‌ర్నీలో మాకు స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్యూ వెరీమ‌చ్‌. ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ వ‌చ్చి చాలా రోజులైంది. ఆడియ‌న్స్ తో క‌లిసి థియేట‌ర్లో సినిమా చూశాను. 
 అన్ని ఏజ్ గ్రూప్స్ వారు ఎంజాయ్ చేస్తున్నారు.  ఆ స్క్రిప్ట్‌లోనే మంచి ఎంట‌ర్టైన్ మెంట్ కామెడీ కుదిరింది. ఇంత మంచి క‌థ ఇచ్చిన ప‌ద్మ‌శ్రీ గారికి, మాకు స‌పోర్ట్ చేసిన దిల్‌రాజు, శిరీష్ గారికి నా హృద‌య‌పూర్వ‌క ద‌న్య‌వాదాలు“ అన్నారు.
 
హీరోయిన్ దృశ్యా రఘునాథ్ మాట్లాడుతూ –  “ చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశాను. కాని ఇంత మంచి థియేట‌ర్ రెస్పాన్స్ మేము ఎక్స్‌పెక్ట్ చేయ‌లేదు. థియేట‌ర్‌లో సినిమా చూస్తున్న‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా పూర్త‌య్యాక స‌త్య‌భామ క్యారెక్ట‌ర్ చాలా బాగుంది అని న‌న్ను అప్రిషియేట్ చేశారు. ఈ క్రెడిట్ అంతా మా డైరెక్ట‌ర్ ప‌ద్మ‌శ్రీ గారికే చెందుతుంది. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు“ అన్నారు.  
 
సంగీత ద‌ర్శ‌కుడు  సునీల్‌ కశ్యప్ మాట్లాడుతూ  –  “ఒక సినిమాలో ఈ పార్ట్ బాగుంది. ఆ పార్ట్ బాగుంది అని చెప్ప‌కుండా ఓవ‌రాల్‌గా సినిమా మొత్తం చాలా బాగుంది అని చెప్ప‌డం థ్రిల్లింగ్‌గా ఉంది. ఇలాంటి రెస్పాన్స్ కోస‌మే మా టీమ్ అంద‌రం ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమా చేశాం. మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ప‌ద్మ శ్రీ గారు అద్భుతంగా తెర‌కెక్కించారు ఆయ‌న‌కి థ్యాంక్స్“ అన్నారు. 
 
 ద‌ర్శ‌కుడు ప‌ద్మ‌శ్రీ మాట్లాడుతూ  –  “ముందుగా మా సినిమాని మొద‌టినుండి స‌పోర్ట్ చేసిన మీడియా వారికి థ్యాంక్స్‌.  మేము ఎక్స్‌పెక్ట్ చేసిన‌ట్టు అన్ని పాజిటీవ్ రివ్యూస్ వ‌చ్చాయి. ఆడియన్స్ రియాక్ష‌న్ చాలా బాగుంది. అన్ని డిపార్ట్‌మెంట్‌లు క‌ల‌సి ప‌ని చేయ‌డం వ‌ల్లే సినిమా ఇంత బాగా వ‌చ్చింద‌ని నేను న‌మ్ముతున్నాను.  నేను ఊహించుకున్న రెండు క్యారెక్ట‌ర్స్‌ని సాగ‌ర్‌, దృశ్యా తెర‌మీద అలాగే చూపించారు. వారికి ఈ సంద‌ర్భంగా ద‌న్య‌వాదాలు తెలుపుతున్నాను “ అన్నారు. 
 
 
న‌టీన‌టులు: 
వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్‌, ప్రియదర్శి రామ్‌, హేమంత్‌, శత్రు, భద్రమ్‌, మధునందన్‌, అదితి, అజయ్‌ ఘోష్ తదితరులు 
 
 సాంకేతిక వ‌ర్గం:
ఆర్ట్‌: నాని
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా
ఎడిటర్‌: మధు
సంగీతం: సునీల్‌ కశ్యప్ 
కెమెరా:  శ్రీకాంత్‌ నారోజ్ 
లైన్ ప్రొడ్యూసర్‌: బండి రత్నకుమార్‌
అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: టి. శ్రీనివాస్‌రెడ్డి
నిర్మాతలు: రాజు, శిరీష్
కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: పద్మ శ్రీ.