‘Seetimaarr’ Shoot To Resume From November 23rd

‘Seetimaarr’ Shoot To Resume From November 23rd

న‌వంబ‌ర్ 23నుండి `సీటీమార్‌` షూటింగ్ పునః ప్రారంభం..

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ `సీటీమార్‌`. పవన్‌ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్‌కి ముందే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ‌లాక్‌డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డ్డ షూటింగ్‌ న‌వంబ‌ర్ 23 నుండి ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో సినిమా ని కంప్లీట్ చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సంద‌ర్భంగా….

నిర్మాత  శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ
 –  “లాక్‌డౌన్‌కి ముందే రాజమండ్రి, హైదరాబాద్ ఆర్ఎఫ్‌సిలో‌ షూటింగ్ జ‌రిపి మూడు భారీ షెడ్యూల్స్‌లో 60% సినిమా పూర్తిచేశాం. ఈ నెల 23 నుండి తిరిగి షూటింగ్ ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. గోపిచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ మ‌రియు భారీ క‌మ‌ర్షియ‌ల్ ఫిలిం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే భావోద్వేగభరిత కథాంశమిది. ప్రతి సన్నివేశం హార్ట్‌ట‌చింగ్‌గా ఉంటుంది.  శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్ బేన‌ర్‌లో  సంపత్ నంది గారు హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ‌గారు అద్భుత‌మైన పాట‌ల్ని కంపోజ్ చేశారు. ఎంత‌గానో ఎదురు చూస్తున్న గోపీచంద్ అభిమానుల‌కోసం వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్ష‌కుల‌ముందుకు తీసుకొస్తాం“ అన్నారు.
మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది మాట్లాడుతూ – “లాంగ్ వార్మ‌ప్, సాలిడ్ స్ట్రెచెస్, ప‌వ‌ర్‌ప్యాక్డ్ ప్రాక్టీస్ త‌ర్వాత  ఫిట్ అండ్ ఫ్యాబ్‌గా మా టీమ్ అంద‌రం అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల జాగ్రత్తల‌తో మాకు ఎంతో ఇష్టం అయిన సీటిమార్  షూటింగ్ ‌కోసం సిద్ద‌మయ్యాం. న‌వంబ‌ర్ 23నుండి కూత మొదలు“ అన్నారు.
ఈ సినిమాలో ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా  మిల్కీబ్యూటీ ‌త‌మ‌న్నా న‌టిస్తున్నారు. విలేజ్‌లో ఉండి హీరోని ప్రేమించే ఒక ప్ర‌త్యేక పాత్ర‌లో మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా చాలా ముఖ్య‌మైన పాత్ర‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి..
సినిమాటొగ్ర‌ఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌,
సంగీతం: మణిశర్మ‌,
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,
ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై,
సమర్పణ: పవన్‌ కుమార్‌,
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,
కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.

 
‘Seetimaarr’ Shoot To Resume From November 23rd

Aggressive Star Gopichand’s latest is ‘Seetimaarr’ Directed by Mass Director Sampath Nandi. Presented by Pavan Kumar and Produced by Srinivasaa Chhitturi under Srinivasaa Silver Screen banner. This Sports based film with a backdrop of mass game Kabaddi has completed three schedules before the lockdown.  The shoot has been halted due to lockdown. The film unit announced that the shoot of the film will resume from November 23 and will finish it in a continuous single schedule. On this occasion…

Producer Srinivasaa Chhitturi said, ” We have completed 60% of the film even before the lockdown in three schedules we shot at Rajahmundry, Hyderabad and RFC. The shoot will resume from November 23 and we are planning to complete it in a single schedule. ‘Seetimaarr’ is the highest budget film in Hero Gopichand’s career which is being made as a very big commercial film. This is an emotional rollercoaster ride in sports backdrop. Every scene will be heart touching. Sampath Nandi garu is making this film with high technical values in a prestigious manner  in our Srinivasaa Silver Screen banner. Mani Sharma garu has composed terrific songs. We will complete the shoot as early as possible and bring ‘Seetimaarr’ to fans of Gopichand who are eagerly waiting for the film.”

Mass Director Sampath Nandi said, ” After a long warm-up, solid stretches, power-packed practice… Everyone is set, fit, fab and back to do what we love the most with extra care and zeal. Whistle blows from November 23rd.”

Gopichand will be seen as Kabaddi coach for Andhra team and Tamanna as Telangana team Kabaddi coach. Another heroine Digangana Suryavanshi will be seen as a village belle who loves Hero Gopichand while Posani Krishnamurali, Rao Ramesh, Bhumika, Rehaman, Bollywood actor Tarun Arora will be seen in other key roles.

Chief Technicians of this movie are
DOP   : S. Soundar Rajan
Music Director : Mani Sharma
Editor: Thammiraju
Art Director : Satyanarayana D.Y.
Presented by : Pavan Kumar
Producer  : Srinivasaa Chhitturi
Story, Screenplay, Dialogues and Direction: Sampath Nandi