Sarileru Neekevvaru 50 days celebrations

Sarileru Neekevvaru 50 days celebrations

 

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా డిస్ట్రిబ్యూటర్ల‌, ఎగ్జిబ్యూటర్ల మధ్య జ‌రిగిన  సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు `స‌రిలేరు నీకెవ్వ‌రు` యాభై రోజుల వేడుక.

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా దిల్ రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జి.ఎం.బి ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్రొఫెస‌ర్ భార‌తీగా లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అపూర్వ ఆద‌ర‌ణ‌తో క‌లెక్ష‌న్ల ప్రభంజనం సృష్లించి ఆల్ టైమ్ ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్(నాన్ బాహుబలి 2) గా నిలిచింది. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 29తో 50రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైద‌రాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్యఅథిలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నిర్మాత అనీల్ సుంక‌ర స్వాగ‌తం ప‌లికారు.  శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్‌ అధినేత, చిత్ర సమర్పకులు దిల్‌రాజు, దర్శకులు అనిల్ రావిపూడి, నిర్మాత, శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్‌ శిరీష్, ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్, శేఖర్ మాస్టర్, ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు పాల్గొన్నారు.

అనంత‌రం..
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ  – “ సరిలేరు నీకెవ్వరు` టైటిల్ లోనే అన్నిఉన్నాయి. హీరోగా మహేష్, నిర్మాతలుగా, డిస్ట్రిబ్యూటర్స్ గా అనీల్ సుంకర, దిల్ రాజు సరిలేరు మీకెవ్వరు అని నిరూపించారు. అలాగే  ఎవరైనా డిప్రెషన్ లో ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే అనిల్ రావిపూడి సినిమా చూడండి అని చెప్తారేమో అంత చ‌క్క‌గా సినిమాలు తీస్తున్నారు.  అనిల్ ప్రతి సినిమాలో ఒక అద్భుతమైన మెస్సేజ్ ఉంటుంది.  టీమ్ అందరికీ మళ్ళీ ఇలాంటి సక్సెస్ లు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ – “సినిమా రంగం మీద ఎంతో  ప్యాషన్ ఉన్న అనీల్ సుంకర గారు, డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ రంగంలో ఎంతో అనుభవం ఉన్న దిల్ రాజు గారు, శిరీష్ గారు వీళ్లందరి సపోర్ట్ తో ఇంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్  తీశారు. `సరిలేరు నీకెవ్వరు` అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ముఖ్యంగా అనిల్ రావిపూడి అంటే అందరికన్నా నాకు ఎక్కువ ఇష్టం. ఆయన ఇలాగే సూపర్ డూపర్ హిట్స్ తీస్తూ అందరిని నవ్విస్తూ ఉండాలనికోరుకుంటున్నాను.  నాకు తెలిసిన ఎగ్జిబ్యూటర్స్ ని, డిస్ట్రిబ్యూటర్స్ ని ఇక్కడ చూస్తుంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసినంత సంతోషంగా ఉంది. మహేష్ లాంటి ఒక సూపర్ స్టార్ తో ఇంత తొందరగా సినిమా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయ‌డం..అన్ని రికార్డులు బద్దలు కొట్టడం నిజంగా గొప్ప విషయం“ అన్నారు.

చిత్ర నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ  – “సరిలేరు నీకెవ్వరు` సినిమా ప్రారంభోత్సవం నుండి డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబ్యూటర్స్, ఒక పాజిటివ్ ఎనర్జీ తో ఇది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మారు. అలాగే ఈ సినిమా ప్రతి ఈవెంట్ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. సినిమా విడుదలైన తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. సినిమా విడుదలై యాభై రోజుల తర్వాత కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు నవ్వుతూ ఈ కార్యక్రమం చేసుకోవడం ఒక అద్భుతమైన వరంగా భావిస్తున్నాను.  మా దర్శకుడు అనీల్ రావిపూడి గారి  కాన్ఫిడెన్స్ కి, ప్యాషన్ కి, అచీవ్ మెంట్ కి, అలాగే  మీ ఆత్మీయతకి, అభిమానానికి, ఆదరణకి టేక్ ఏ బౌ“ అన్నారు.

 శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్‌ అధినేత, చిత్ర సమర్పకులు దిల్ రాజు మాట్లాడుతూ  – “సరిలేరు నీకెవ్వరు విజయవంతంగా యాబై రోజులు పూర్తి చేసుకుంది. అనిల్ రావిపూడి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి అనీల్ సుంకర గారికి, నాకు బ్లాక్ బస్టర్ ఇస్తానని  ముందే చెప్పాడు. అలానే ఇచ్చాడు. మహేష్ బాబు గారికి కెరీర్ బెస్ట్ ఫిలిం ఇచ్చి ఇండస్ట్రీ లో నెంబర్ వన్ సినిమాగా దీన్ని తీసుకువచ్చినందుకు అనిల్ రావిపూడికి దన్యవాదాలు.  ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబ్యూటర్స్ కి ప్రత్యేక దన్యవాదాలు” అన్నారు.  

నిర్మాత‌, శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్‌ శిరీష్ మాట్లాడుతూ  – “సరిలేరు నీకెవ్వరు`తో ఇంతటి ఘ‌న‌ విజయాన్ని అందించిన అనీల్ సుంకర గారికి, అనీల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన  రాఘవేంద్రరావు, వినాయక్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ విజ‌యానికి కార‌ణ‌మైన  డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబ్యూటర్స్ కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు” అన్నారు.

  యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ  – “ ఈ కార్యక్రమానికి విచ్చేసిన  తెలుగు సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ రాఘవేంద్ర రావు గారికి, కమర్షియల్ కా బాప్ వినాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక కమర్షియల్ సినిమాని ఎలా తీయాలో చూపించి తెలుగు సినిమాకి ఒక గ్రాఫ్ ఇచ్చిన దర్శకుడు కె రాఘవేంద్ర రావు. అలాంటి ఒక కమర్షియల్ సినిమా తీస్తున్నప్పుడే ఇది బ్లాక్ బస్టర్ అని నమ్మేలా ఆ టేకింగ్ లోనే కాన్ఫిడెన్స్ ని తీసుకువచ్చిన ద‌ర్శ‌కులు వినాయక్ గారు. నేను డైరెక్టర్ అవ్వడానికి  వినాయక్ గారే కారణం. గుంటూరు హరి హర మహల్ లో `ఆది` సినిమాకి వెళ్తే  పిల్లోడు రెండు బాంబులు వేయగానే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం  వి.వి.వినాయక్ అని స్క్రీన్ మీద పడుతుంది. ఆ టైమ్ లో థియేటర్ అంతా విజిల్స్, క్లాప్స్ తో నిండిపోయింది. అప్పుడు ఒక డైరెక్టర్ కి ఇంత వేవ్ ఉంటుందా? అని ఆశ్ఛర్యం వేసి గూస్బమ్స్ వచ్చాయి. ఆరోజే సినిమా ఇండస్ట్రీ కి వెళ్తే డైరెక్టర్ గానే వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను.  తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు తీసిన దర్శకుల మధ్య నేను నిలబడినందుకు గర్వంగా ఉంది. ఈ సంవత్సరం తెలుగు సినిమాకి మర్చిపోలేని సంక్రాంతి. మైండ్ బ్లాక్ రెవెన్యూస్ వచ్చాయి. ప్రతి సంవత్సరం ఈ రెవెన్యూ ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. `ఎఫ్ 2` జరుగుతున్న సమయంలోనే కథ విని నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ప్ర‌త్యేక  ధన్యవాదాలు. ఆయన ఒక్కటే అడిగాడు మైండ్ బ్లాక్ బ్లాక్ బస్టర్ ఇవ్వమని అలానే ఇచ్చాను. అందరం చాలా హ్యాపి. నా సినిమాలని ఇలానే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేక్షకులు ..సరిలేరు మీకెవ్వరు” అన్నారు.

ఈ కార్యక్రమంలో నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ దాస్, వైజాగ్: శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ భాస్కర్, వెస్ట్: ఆదిత్య ఫిలిమ్స్ ఎల్.వి.ఆర్,  సీడెడ్: సాయి చంద్ర ఫిలిమ్స్ నరసింహ, కృష్ణ:  క్రేజీ సినిమాస్ రాజా, గుంటూరు: మెహర్ మూవీస్, పద్మాకర్ సినిమాస్ పద్మాకర్, సాయికృష్ణ, ఈస్ట్: వింటేజ్ క్రియేషన్స్ శివరామ్, జె.కె.రామకృష్ణ,  నెల్లూరు: హరి పిక్చర్స్ హరి ల‌కు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతులమీదుగా ‘సరిలేరు నీకెవ్వరు’ ఫిఫ్టీ డేస్ షీల్డ్ ను అందజేశారు. చిత్ర యూనిట్, మిగ‌తా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్ల‌కు నిర్మాత అనీల్ సుంక‌ర‌, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఫిఫ్టీ డేస్ షీల్డ్ ను అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కో ప్రోడ్యూస‌ర్ కిషోర్ గ‌రిక‌పాటి, ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాశ్‌, వి.ఎఫ్‌.ఎక్స్ యుగేంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సూపర్‌స్టార్‌మహేశ్ బాబు, రష్మిక మందన్నా,రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటించిన‌ ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి. ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Darsakendrudu K. Raghavendra Rao, Sensational Director VV Vinayak As Chief Guests, The 50 Days Event of Superstar Mahesh Babu’s ‘Sarileru Neekevvaru’ Was Held Among Distributors and Exhibitors

Superstar Mahesh’s latest outing, out and out commercial entertainer, ‘Sarileru Neekevvaru’ presented by Dil Raju under Sri Venkateswara Creations banner, Produced by Ramabrahmam Sunkara in GMB Entertainment and AK Entertainments. Rashmika Mandana played as a heroine while Lady Amitabh Vijashanthi is seen in a powerful role as Professor Bharathi. The film which was released on January 11th as a Sankranthi gift has received a tremendous response from the audience creating a huge sensation at the box-office and stands as an All-time Industry Blockbuster (Non-Baahubali 2). The film successfully completed it’s 50 days of theatrical run on February 29th. Super Fans are celebrated the Massive success of ‘Sarileru Neekevvaru’all-over. On this occasion, the team has held an event to celebrate the 50 days of ‘Sarileru Nekevvaru’ at Park Hyatt Hotel, Hyderabad. Darsakendrudu K. Raghavendra Rao, Sensational Director VV Vinayak graced the event as chief guests. Producer Anil Sunkara hosted the event and welcome the guests. Movie Presenter, Sri Venkateswara Creations Dil Raju, Director Anil Ravipudi, Producer, Sri Venkateswara Creations Sirish, Fight Masters Ram – Laxman, Sekhar Master, Distributors and Exhibitors of the film attended the event.

Darsakendrudu K. Raghavendra Rao said, ” ‘Sarileru Neekevvaru’ title itself suggests that it has everything. Mahesh as a Hero, Anil Sunkara and Dil Raju as Producers and Distributors have proved themselves as ‘Sarileru Meekevvaru’. Doctors can suggest Anil Ravipudi’s films for depression. He is making such kinds of entertainers. His every film carries a very good message. I wish this team to get many more successes in the future.”

Sensational Director VV Vinayak said, ” Anil Sunkara who is very passionate about films delivered a huge blockbuster with the support of Dil Raju garu who is highly experienced as a distributor and producer, Sirish garu. ‘Sarileru Neekevvaru’ has broken all records. I like Anil Ravipudi a lot. I wish he will continue delivering super duper hits like this and entertain everyone. When I see here the exhibitors and distributors I know, I feel like meeting my family members. It’s really a great thing that quickly completing a film with a superstar like Mahesh and released it for Sankranthi breaking all the records.”

Film Producer Anil Sunkara said, ” Right from the beginning, during the launch of ‘Sarileru Neekevvaru’, Distributors and Exhibitors had very positive vibrations for this film and they believed that this will definitely become a big blockbuster. EVery event of this film has created a new trend. After its release, The film has surpassed everyone’s expectations and collected huge numbers at the box-office. I feel blessed to see the happy faces of all distributors and exhibitors in this event even after completing 50 days run. For our Director Anil Ravipudi’s Confidence… His Passion… Achievement… For your love… Support…. Take A Bow.”

Sri Venkateswara Creations founder, Film Presenter Dil Raju said, ” ‘Sarileru Neekevvaru’has successfully completed it’s 50 days theatrical run. Anil Ravipudi said to Anil Sunkara garu and to me that he will complete the film and release it for Sankranthi and will deliver a blockbuster. He has kept his word. Congrats and Thanks to Anil Ravipudi for scoring a career-best film for Mahesh Babu garu and for delivering the number one film in the industry. Special thanks to the Distributors and Exhibitors of this film.”

Producer, Sri Venkateswara Creations Sirish said, ” Thanks to Anil Sunkara garu and Anil Ravipudi garu for delivering such a big blockbuster with ‘Sarileru Neekevvaru’. Thanks to Raghavendra Rao garu, Vinayak garu for attending this event as chief guests. Special Thanks to the distributors and exhibitors who are the reason for this big success.”

Young and Talented Director Anil Ravipudi said, ” Heartful thanks to Telugu Cinema Blockbuster Kaa Baap Raghavendra Rao garu and Commercial Kaa Baap Vinayak garu for coming here today. Darsakendrudu K Raghavendra Rao garu provided a graph for Telugu Cinema and set the benchmark about how to make a proper commercial film. While making such commercial film one can get the confidence of scoring a blockbuster with Vinayak gari mark taking to it. Vinayak garu is the reason why I became a Director. While I was watching ‘Aadi’ in Harihara Mahal at Guntur, a boy threw two bombs and then appears Story – Screenplay – Direction VV Vinayak name card onscreen.  The entire theatre is filled with whistles and claps. I got goosebumps knowing that a director has such a kind of following and wave among the audience. At that moment I decided to enter the film industry as a Director only. I am proud to stand among the directors who uplifted the status of Telugu Cinema with their Films. This year’s Sankranthi is memorable for Telugu Cinema.  We have seen  Mind Block revenues. I wish that this revenue will keep on increasing every year. Special Thanks to Super Star Mahesh Babu garu who has listened to my story and agreed to do the film while I was doing ‘F2’ and believed me. He asked me only one thing to deliver a Mind Block Blockbuster. I am very happy about delivering what he has expected from me. I wish the audience will keep loving all of my films. ‘Prekshakuluu… Sarileru Meekevvaru…’ ”

Nizam Distributor Sri Venkateswara Films Das, Vizag: Sri Venkateswara Films Bhaskar, West: Aditya Films LVR, Ceded: Sai Chandra Films Narasimha, Krishna: Crazy Cinemas Raja, Guntur: Meher Movies, Padmakar Cinemas Padmakar, Sai Krishna, East: Vintage Creations Sivaram, JK Ramakrishna, Nellore: Hari Pictures Hari received ‘Sarileru Neekevvaru’ 50 days shields from Darsakendrudu K. Raghavendra Rao and Sensational Director VV Vinayak. Producer Anil Sunkara and Director Anil Ravipudi handed over the 50 days shields to the film unit, remaining distributors and exhibitors. Co-producer  Kishore Garikapati, Art Director Prakash, VFX Yugandhar and others attended the event. 

Superstar Mahesh, Rashmika Mandanna, Lady Amitabh Vijayasanthi in a special role, Rajendra Prasad, Prakash Raj, Sangeetha, Bandla Ganesh involves star cast.

Devi Sri Prasad, Rathnavelu, Kishore Garikapati, ThammiRaju, Ram Lakshman, Yugandhar T, S Krishna are key technicians.