సుధాకర్ కోమాకుల హీరోగా అజ్జు మహాకాళి దర్శకత్వం లో ‘రీసెట్’

సుధాకర్ కోమాకుల హీరోగా  అజ్జు మహాకాళి దర్శకత్వం లో ‘రీసెట్’

సుధాకర్ కోమాకుల హీరోగా అజ్జు మహాకాళి దర్శకత్వం లో ‘రీసెట్’

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా ‘, ‘ నువ్వు తోపు రా’ తదితర చిత్రాలతో కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్ కోమాకుల ‘రీసెట్’ పేరుతో మరో విభిన్నమైన చిత్రం చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారా అజ్జు మహాకాళి దర్శకునిగా పరిచయమౌతున్నారు. సుఖ స్టూడియోస్ సమర్పణలో హైలైట్ విజువల్స్, కారా బూందీ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ రోజు (నవంబర్ 12) హీరో సుధాకర్ కోమాకుల పుట్టినరోజు. ఈ సందర్బంగా టైటిల్ పోస్టర్
విడుదల చేశారు.
దర్శకుడు అజ్జు మహాకాళి మాట్లాడుతూ- ”న్యూ యార్క్ ఫిల్మ్ అకాడమీ లో డిప్లమో ఇన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసాను. సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన ‘నువ్వు తోపు రా’ కి కథ- మాటలు అందించాను. దర్శకునిగా ఇదే నా తొలి ప్రయత్నం. కథ నచ్చి సుధాకర్ వెంటనే ఈ సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. లాక్ డౌన్ 1.0 టైం లో జరిగే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఇందులో హీరో క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రపంచం లాక్ డౌన్ అయినాకనే అతని ప్రపంచం ఓపెన్ అయ్యింది. ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే- వాస్తవం, కల్పితం కన్నా కిరాక్ ఉంటది. డిసెంబర్ లో చిత్రీకరణ మొదలుపెడతాం” అని తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరా : సిద్ధం మనోహర్,
సంగీతం: డెన్నిస్ నార్టన్ ,
ఎడిటింగ్: నవీన్ నూలి, రచన – దర్శకత్వం: అజ్జు మహాకాళి .